పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “హరి హర వీరమల్లు” సినిమా ప్రస్తుతం సినిమాభిమానులను కిక్కొడుతోంది. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఫస్ట్ గింప్స్ “వినాలి.. వీరమల్లు మాట చెబితే వినాలి. మాట వినాలి.. గురుడా మాట వినాలి.. మాట వినాలి మంచి మాట వినాలి’’ అంటూ శుక్రవారం విడుదల చేశారు. ఈ పాట నెట్టింట వైరల్ అవుతోంది.
ప్రధానంగా, ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించి 50 శాతం సినిమా పూర్తి చేశారు. ప్రస్తుతం జ్యోతి కృష్ణ ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. భారీ బడ్జెట్‌తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో సాగుతుంది. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఈ చిత్రం 2025, మార్చి 28న పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదల కానుంది. ఆస్కార్ గ్రహీత ఎం.ఎం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.

