ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో మీరే సూడుండ్రి. !

గా పిల్లగాని పేరు సూర్య. గాయినె సదివే కాలేజీల ఓపాలి ఫుడ్డు ఫెస్టివల్ పెట్టిండ్రు. గదాని కోసం శికెన్ తోటి లోడెడ్ ఫ్రెంచి ప్రైస్ అనే వంటకం రుసి సూపిత్తే అంతా మెచ్చుకున్నరు. ఇగా కాలేజీల్నే యువ సమ్మేళనం జరిపిద్దామని 30యేలు అప్పు శేసి తయ్యారైండు. శివరకు గా కాలేజోల్లు గదాన్ని రద్దు శేసిండ్రు. గది కరాబై అప్పైంది. గిదంత పని కాదని దోస్తుల దగ్గర మల్లా అప్పుశేసి, గా అప్పు తీర్సి, మిగిలిందాతోటి లోడెడ్ ఫ్రెంచి ప్రైస్ తయారు శేసి అమ్మే దుకాణం పెట్టిండు. సోషల్ మీడియల పచారం శేసిండు. గంతే, గిరాకీ పెరిగింది. మస్తు క్లిక్కైంది. గది తిన్నోల్లు మేం గూడ గా దుకాణం పెడ్తమని గా పిల్లగాడ్నే అడిగిండ్రు. గదాని ఫ్రాంచైజీని అడిగినోల్లకు పైసలు తీసుకొని ఇచ్చిండు. ఏడాదిల్నే గిప్పుడు గా దుకాణాలు మర్రిపాలెం, సుజాతనగర్, అనకాపల్లి, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, షోలాపూర్లల్లకు యిస్తరించినయి. మొత్తం 16 ప్రాంచైజీలైనియి. ఇగిప్పుడు నెలకు లచ్చ రూపాయలు సంపాదిత్తున్నడు. ఎట్లుంది గీ అవుడియా. !?

