ఒకప్పుడు పుస్తకం హస్త భూషణం అన్నరు. ఇగిప్పుడైతే సెల్లే! ఎవల సేతుల సూసినా సెల్లే. పుస్తకానికి శెల్లు శీటీ రాసేసి, సెల్లుకు విల్లు రాసేసిండ్రు. మరి గా సెల్లు పోన్ల శార్జింగుంటేనే గది పని శేత్తది. ఇగ గా శార్జింగ్ వైర్ ను వాడంగ.. వాడంగ.. గది కొసలకు తెగి పోతాంటది. గట్ల గది తెగిపోకుండ ఉండాల్నంటే…శిన్న శిట్కా సూడుండ్రి.

గా తెగిపోతున్న శార్జింగ్ వైరు కొసకు గీ పోటువల సూపినట్లు, దారాన్ని ముందుగ పెట్టాలె. గ దారాన్నే ఇగ గట్టిగ సుట్టాలె. ఆకరికి గింత మెలికేసి, గట్టిగ రెండు వైపుల దారాన్ని బిగియ్యాలె. ఇగ గది ఊసిపోదు.. శార్జింగ్ వైరు తెగిపోదు. గీ శిట్కాను మీరూ శేసి సూడుండ్రి.

