Wednesday, April 8, 2026
34.2 C
Hyderabad

ప్రపంచానికి ఇరాన్ ఒక హెచ్చరిక!|EDITORIAL

ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే అమెరికా ఆకాంక్ష కొత్తదేమీ కాదు. అయితే డొనాల్డ్‌ ట్రంప్‌ అధ్యక్షుడయ్యాక ఆ ఆకాంక్ష మరింత దుర్నీతిగా, దుందుడుకుగా మారింది. ప్రపంచాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. సుంకాలు, ఆర్థిక ఆంక్షలు, దౌత్య బెదిరింపులు, సైనిక దాడులు వంటి వ్యూహాలతో ట్రంప్‌ అనేక దేశాల్లో అస్థిరతకు కారణమవుతున్నారు. పైకి స్నేహహస్తం చాస్తూనే లోపల ధృతరాష్ట్ర కౌగిలిని బిగించడం అమెరికా విదేశాంగ విధానంగా మారింది.

వెనెజువెలా మొదలు ఇరాన్‌ వరకు, శ్రీలంక, బంగ్లాదేశ్‌, నేపాల్‌, ఇరాక్‌ వంటి దేశాల్లో అంతర్గత కలహాలకు అమెరికా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఆజ్యం పోసింది. సీఐఏ పాత్ర, ఇటీవలి పరిణామాలు రూఢీ చేస్తున్నాయి. ప్రజాస్వామ్యం, మానవ హక్కుల పరిరక్షణ పేరుతో మొదలయ్యే అమెరికా జోక్యం, చివరికి ఆయా దేశాల్లో రాజకీయ అరాచకతకు దారితీస్తోందన్నది చేదు నిజం.

ఇరాన్‌ తాజా పరిణామాలు, ఆర్థిక సంక్షోభ నిరసనలతో మొదలై, క్రమంగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంగా మారాయి. అమెరికా విధించిన చమురు ఎగుమతులపై కఠిన ఆంక్షలు, అంతర్జాతీయ వాణిజ్య పరిమితులు ఇరాన్‌ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీశాయి. ఇరానియన్‌ రియాల్‌ విలువ చరిత్రలో ఎన్నడూ లేనంతగా పడిపోయింది. ద్రవ్యోల్బణం 40 శాతాన్ని దాటింది. ఆహారం, ఇంధన ధరలు సామాన్య ప్రజల జీవనాన్ని అసాధ్యంగా మార్చాయి.

ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆగ్రహాన్ని తమ ప్రయోజనాలకు మలచుకోవాలని అమెరికా ప్రయత్నించింది. నిరసనకారులను బహిరంగంగా ప్రోత్సహించింది. ఇరాన్‌ ప్రభుత్వాన్ని పదేపదే హెచ్చరించింది. సైనిక దాడుల సంకేతాలు ఇచ్చింది. ఇవి ఆ దేశంలో అనిశ్చితిని మరింత పెంచాయి. ఒక దశలో టెహ్రాన్‌పై అమెరికా సైనిక చర్యకు సిద్ధపడింది. పశ్చిమాసియాలోని అమెరికా వైమానిక స్థావరాల్లో కదలికలు, బలగాల ఉపసంహరణలు యుద్ధ మేఘాలను కమ్మేశాయి.

అయితే చివరి నిమిషంలో వ్యూహాత్మక కారణాలతో ట్రంప్‌ వెనక్కి తగ్గారు. ఇరాన్‌పై దాడి చేస్తే అది పరిమిత స్థాయిలో ఆగదని, దీర్ఘకాలిక యుద్ధంగా మారే ప్రమాదం ఉందని అమెరికా నిపుణులు హెచ్చరించారు. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు కూడా ఇరాన్‌ అంత తేలికగా లొంగదని ట్రంప్‌కు హితవు పలికినట్లు సమాచారం. సౌదీ అరేబియా, ఖతార్‌, ఒమన్‌, ఈజిప్టు వంటి గల్ఫ్ మిత్రదేశాలు కూడా యుద్ధానికి వ్యతిరేకంగా దౌత్యం చేశాయి. యుద్ధం జరిగితే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించాయి.

నిరసనకారుడు ఎర్ఫాన్‌ సొల్తానీకి విధించిన మరణశిక్షను ఇరాన్‌, చివరి క్షణంలో నిలిపివేయడం కూడా ట్రంప్‌ వెనక్కి తగ్గేందుకు ఆస్కారమిచ్చింది. దీన్ని మానవ హక్కుల విజయంగా అమెరికా అభివర్ణించినా, వాస్తవానికి అది రాజకీయ నిర్ణయమేనని విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. సైనిక దాడి లేకుండానే ఇరాన్‌పై ఒత్తిడి కొనసాగించవచ్చన్న భావన ట్రంప్‌లో బలపడింది.

ఇక ఇరాన్‌లో పరిస్థితులు ఇప్పటికిప్పుడు అదుపులోకి వచ్చేలాలేదు. 31 ప్రావిన్సులన్నింటిలోనూ నిరసనలు చెలరేగడం, వందలాది నగరాల్లో ఆందోళనలు జరగడం, వందల మంది మరణాలు, వేలాది అరెస్టులు ఆ దేశం ఎంత తీవ్రమైన సంక్షోభంలో ఉందో అర్థం చేస్తున్నాయి. సంపూర్ణ ఇంటర్నెట్‌ బ్లాక్‌ఔట్‌, పరిస్థితిని మరింత దుర్భరం చేసింది. భద్రతా బలగాల కఠిన చర్యలు, ఉరిశిక్షల బెదిరింపులు ప్రజల్లో భయాందోనళనల్ని పెంచుతున్నాయి.

అమెరికా దౌత్యం అస్థిరతను ఆయుధంగా మలచుకుంటోంది. ప్రజాస్వామ్యం పేరుతో జోక్యం చేసుకుంటూ, ఆయా దేశాల అంతర్గత సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది. ఇరాన్‌ మాత్రమే కాదు, భారత్‌ సహా అనేక దేశాలు ఇలాంటి ప్రయత్నాల ప్రభావాన్ని ఎదుర్కొన్నాయి. మణిపూర్‌ అల్లర్లు, రైతు ఉద్యమాలు, సరిహద్దు ఉద్రిక్తతలు వంటి పరిణామాలను కూడా ఈ విస్తృత వ్యూహంలో భాగమేనా? అన్న అనుమానాలు కలగక మానవు.

అయితే, ఇరాన్‌ ఎదుర్కొంటున్న సంక్షోభానికి కేవలం అమెరికా జోక్యమే కారణమనలేం. అక్కడి ఛాందస పాలన, రాజకీయ దమనమే ప్రజల ఆగ్రహానికి మూలకారణం. కానీ ఆ అసంతృప్తిని అమెరికా, తమ స్వార్థానికి వాడుకోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. ఇరాన్‌ ఈ సంక్షోభం నుంచి బయటపడాలంటే అంతర్గత సంస్కరణలు, రాజకీయ చర్చలు, ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందే ప్రయత్నాలు తప్పనిసరి. అదే సమయంలో ప్రపంచం మొత్తం కూడా అమెరికా విధానాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఒక దేశంలో మొదలైన చిచ్చు, చివరికి ప్రపంచాన్నే కాల్చే కార్చిచ్చు అయ్యే ప్రమాదం లేకపోలేదు. తస్మాత్ జాగ్రత్త!

Latest News

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

బట్టల మీద బూరును సాఫ్ శేసే ఇకమతు!?|ADUGU TRENDS

సూటూ, బూటూ గదేనుల్లా... బట్ట తీరు మనిసికి యిలువ. గా బట్టేమో పోగుల తీరును బట్టి ఉంటదాయె. కొన్ని బట్టలు ఎన్ని పైసలు పెట్టి కొన్నా, ఒక్కపాలి ఉతికితిమా? బూరు బూరు లేస్తది....

కెజి బేసిన్ – మన గ్యాస్ మన హక్కు!|EDITORIAL

పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన, సహజవాయువు సరఫరా వ్యవస్థలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. ఈ పరిణామాల ప్రభావం మన దేశంతోపాటు అన్ని దేశాలపైనా,...

07-04-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి మధ్యాహ్నం 01.49 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి తెల్ల 03.21 వరకు ఉపరి మూల యోగం వ్యతీపాత మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి వరీయాన్ కరణం తైతుల మధ్యాహ్నం...

06-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ చవితి ఉదయం 11.47 వరకు ఉపరి పంచమి నక్షత్రం అనూరాధ రాత్రి 12.45 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సిద్ది మధ్యాహ్నం 01.40 వరకు ఉపరి వ్యతీపాత కరణం బాలవ ఉదయం 11.47...

గా ఊల్లె.. అందరికీ ఒకటే వంట!?|ADUGU TRENDS

గా ఊల్లె నిజంగా రోజూ పండుగే? ఎవలింట్లా పొయ్యి ఎలగదు. ఊరంతటికీ ఒకటే పొయ్యి. కులం లేదు మతం లేదు. గా ఊరంతా ఒకటే కుటుంబం. రోజూ అంతా కలిసే ఉంటరు. ఒకదగ్గరనే...

గ్రామాలు బలపడితేనే దేశాభివృద్ధి!|EDITORIAL

మనది గ్రామీణ భారతం. గ్రామాలతోనే దేశం బాగుపడుతుంది. అభివృద్ధి అనగానే “ట్రిలియన్ డాలర్ ఎకానమీ”, “ఫ్యూచర్ సిటీలు” వంటి ఆకర్షణీయమైన లక్ష్యాలు ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ లక్ష్యాలు సాధ్యమవ్వాలంటే గ్రామాలు బలపడటం...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 05, 2026 నుండి ఏప్రిల్ 11, 2026 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నా ఫలితాలు మంచిగా ఉంటాయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News