Friday, April 17, 2026
39.2 C
Hyderabad

TELANGANA|తెలంగాణ పౌరుషానికి ప్రతీక ఈ నేల

INTERNATIONAL|అంతర్జాతీయ స్థాయి EDUCATIONAL CENTRE|విద్యా కేంద్రంగా తీర్చిదిద్దుతాం

OSMANIA UNIVERSITY|ఉస్మానియా యూనివర్సిటీలో CM|సీఎం రేవంత్ రెడ్డి|REVANTH REDDY

స్వరాష్ట్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉస్మానియా యూనివర్సిటీ గడ్డకు వచ్చినందుకు గర్వంగా ఉందని, ఇక్కడికి రావడానికి ధైర్యం కాదు… అభిమానం అవసరమని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గుండెల నిండా ప్రేమతో, విశ్వవిద్యాలయ అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని వచ్చానని, ఉస్మానియాను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

తెలంగాణ నేల ఎప్పటికీ పౌరుషం, తిరుగుబాటు స్వభావానికి ప్రతీకగా నిలిచిందని, ఆధిపత్యం చెలాయించాలనుకునే ప్రతి ప్రయత్నానికి ఈ నేలలోనే ప్రతిఘటన పుట్టిందని చెప్పారు. కొమురం భీమ్ నుంచి సాయుధ రైతాంగ పోరాటం, తాజా తెలంగాణ ఉద్యమం వరకు ఆధిపత్యానికి వ్యతిరేకంగా లేచిన ప్రజా ఉద్యమాలకు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే ముందున్నారని గుర్తుచేశారు. తెలంగాణ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం ఉద్యమ సమయంలో ఓయూ, కేయూ వేదికలపై విద్యార్థులు పోరాడి చరిత్ర నిర్మించారని అన్నారు.

పీవీ నర్సింహారావు, జైపాల్ రెడ్డి, జార్జ్ రెడ్డి, గద్దర్ వంటి మహనీయులను దేశానికి అందించిన ఘనత ఓయూదే అని, మలి దశ తెలంగాణ ఉద్యమంలో కూడా ఈ యూనివర్సిటీనే మొదటి స్థానంలో నిలిచిందని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్లు అవుతున్నా, ఓయూను బలహీనపరిచే ప్రయత్నాలే జరిగాయని విమర్శించారు. ప్రజా ప్రభుత్వంలో స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు సాధ్యమని రేవంత్ రెడ్డి అన్నారు.

తాను ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడినని, విదేశీ భాషలు రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవగలనని, పేదల కోసం పరిపాలన చేయగలనని తెలిపారు. ప్రజల సొమ్ముతో ఫామ్ హౌసులు కట్టుకోలేదని, పేద బలహీన వర్గాల ఆశీర్వాదాలతోనే ముఖ్యమంత్రి అయ్యానని స్పష్టం చేశారు. చరిత్ర గుర్తుంచుకునేలా పరిపాలన చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నామని అన్నారు.

రెండేళ్లలో చేసిన పనులను గుర్తుచేసిన సీఎం జయ జయహే తెలంగాణ గీతాన్ని అధికారిక రాష్ట్ర గీతంగా గుర్తించడం, బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించడం, ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన పూర్తి చేయడం వంటి నిర్ణయాలను వివరించారు. కేంద్ర జనగణనలో కులగణనకు మార్గం సుగమం చేసిన ఘనత తెలంగాణకే దక్కిందని చెప్పారు. భూములు లేవని నిస్సందేహంగా చెప్పినందుకు విమర్శిస్తున్నారని, అదే సమయంలో వందల ఎకరాల్లో ఫామ్‌ హౌసులు కట్టుకున్న వాళ్లు పదేళ్లలో దళితులకు మూడు ఎకరాలు కూడా ఇవ్వలేదని ప్రశ్నించారు.

భూమి లేకపోవడం పేదరికానికి సూచిక కావొచ్చని, కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనానికి సంకేతమని తెలిపారు. నాణ్యమైన విద్య అందరికీ అందించాలని ప్రభుత్వం సంకల్పించిందని, విద్య మాత్రమే తలరాత మార్చే శక్తి ఉందని గుర్తుచేశారు. కులవివక్షను తొలగించేందుకు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని, యువత నైపుణ్యాభివృద్ధికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, క్రీడా ప్రతిభను వెలికితీయడానికి 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటుచేశామని తెలిపారు. అనంద్ మహీంద్రా వంటి గొప్ప వ్యక్తులను బోర్డుల్లో నియమించడం ద్వారా విద్యార్థులకు అత్యుత్తమ అవకాశాలు కల్పిస్తున్నట్లు వివరించారు.

పేదలకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే తన తపన అని, అందుకే రూ.1000 కోట్లతో ఉస్మానియా యూనివర్సిటీ సమగ్ర అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశామని ప్రకటించారు. ఇంగ్లీష్ భాష నాలెడ్జ్ కాదు, కమ్యూనికేషన్‌ మాత్రమేనని, నాలెడ్జ్, నిబద్ధత ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని చెప్పారు. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ నియామకానికి కమిటీ ఏర్పాటు చేసినట్లు, ఇందులో రాజకీయ జోక్యం ఏమీ ఉండదని స్పష్టం చేశారు.

ఉస్మానియా తెలంగాణ గుండెకాయ అని, ఇక్కడి విద్యార్థులు రాజకీయ పార్టీల వలలో పడకూడదని సీఎం సూచించారు. కష్టపడితే తప్పకుండా విజయం సాధించవచ్చని నమ్మకం వ్యక్తం చేశారు. డాక్టర్లుగా, లాయర్లుగా, ఉన్నతాధికారులుగా మాత్రమే కాక, ఈ యూనివర్సిటీ నుంచే భవిష్యత్ నాయకులు ఎదిగి రాష్ట్రాన్ని పరిపాలించాలని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు.

Latest News

భయమా? వ్యూహమా?|PARLIAMENT|Delimitation bill|TEJASWI SURYA|BJP|NARENDRA MODI

పాగాకై పాకులాటా? కస్సుమన్న కాంగ్రెస్!|CONGRESS భగ్గుమన్న బీఆర్ఎస్!!|BRS ఆత్మరక్షణలో బీజేపీ!!!|BJP వివాదానికి నేపథ్యమేంటి? ఇప్పుడు సూర్య, గతంలో మోదీ! చారిత్రక అంశాల వక్రీకరణా? రాజకీయ మైలేజీ వ్యూహమా? కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడమా? పునర్విభజన - దక్షిణాది భయమా? లోక్‌సభలో పునర్విభజన బిల్లుపై చర్చను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర...

శింతపండు పురుగుపట్టది! నల్లబడది!!|ADUGU TRENDS

ఇగో గీ శింతపండు లేకపోతే ఎవ్వలికీ ఎల్లది. పప్పుశారు, సేప పులుసు, అంటుపులుసు, ఒట్టి సేపల పులుసు, దప్పడం, అన్ని తొక్కుల్ల ఏసుడే కాదు, ఆఖరికి శింతపండు తొక్కు కూడ శేసుకొని తింటం....

చట్టసభలు అ (కొ) 0దరి కోసమేనా!?|EDITORIAL

భారతదేశం వంటి 140 కోట్ల జనాభా ఉన్న దేశంలో కొందరే పదే పదే చట్టసభల్లో కొనసాగడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. కొత్త ఆలోచనలు, కొత్త నాయకత్వం రావాలంటే వ్యవస్థలో మార్పులు అవసరం. మహిళల...

17-04-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య సాయంత్రం 05.25 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం రేవతి మధ్యాహ్నం 11.55 వరకు ఉపరి అశ్విని యోగం వైధృతి ఉదయం 07.10 వరకు ఉపరి విష్కమ్భ కరణం చతుస్పాద ఉదయం 06.15...

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News