Sunday, September 20, 2026
25.2 C
Hyderabad

ఒక ఉప ఎన్నిక…ఎన్నో ఉపమానాలు!?|EDITORIAL

ఒక ఉప ఎన్నిక ఫలితం, మొత్తం రాష్ట్ర ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, రాజకీయాలను ఏమార్చి, ప్రభుత్వాన్ని మార్చేంత ప్రభావవంతంగా ఉంటుందా? ఒక్క ఫలితాన్ని మొత్తం ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇంకా మూడేళ్ళ తర్వాత రానున్న ఎన్నికలకు ఇది ముందస్తు సంకేతం అవుతుందా? నిరతరం వేగంగా మారుతూ ఉన్న చలనశీలమైన వైయక్తిక, సామాజిక అవసరాలు, అభిప్రాయాలు, ప్రభావాలు, మానసిక స్థితిగతులు, పార్టీలు, రాజకీయాలు, మనుషులు, ఓటర్లు, అన్నింటికీ మించి డబ్బు ప్రభావం చూపే మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక్క ఫలితంతో భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయవచ్చా? ఇలా…జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో!
మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ఒక ఉప ఎన్నిక ఫలితం, మొత్తం రాష్ట్ర ప్రజాభిప్రాయాన్ని ప్రభావితం చేసి, రాజకీయాలను ఏమార్చి, ప్రభుత్వాన్ని మార్చేంత ప్రభావవంతంగా ఉంటుందా? ఒక్క ఫలితాన్ని మొత్తం ప్రజాభిప్రాయంగా పరిగణించవచ్చా? ఇంకా మూడేళ్ళ తర్వాత రానున్న ఎన్నికలకు ఇది ముందస్తు సంకేతం అవుతుందా? నిరతరం వేగంగా మారుతూ ఉన్న చలనశీలమైన వైయక్తిక, సామాజిక అవసరాలు, అభిప్రాయాలు, ప్రభావాలు, మానసిక స్థితిగతులు, పార్టీలు, రాజకీయాలు, మనుషులు, ఓటర్లు, అన్నింటికీ మించి డబ్బు ప్రభావం చూపే మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక్క ఫలితంతో భవిష్యత్తు ఫలితాలను అంచనా వేయవచ్చా? ఇలా…జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక లేవనెత్తుతున్న ప్రశ్నలెన్నో!

రాష్ట్ర రాజకీయాల్లో జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్. అది అయినా, కాకపోయినా రాజకీయ పార్టీలు, మీడియా అన్నీ కలిసి దాన్ని అలా మార్చాయి. పార్టీలు వాటి పబ్బం గడుపుకోవడానికి చేసే వ్యాఖ్యలను పతాకశీర్షికలు చేసి, మీడియా అందులో పావుగా మారిపోతోంది. కొందరు జర్నలిస్టులైతే కండువాలు కప్పుకున్న కార్యకర్తలకు మించి అంగీలాగూ చింపుకుంటున్నారు. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అనారోగ్య రీత్యా చనిపోతే జూబ్లీ ఉపఎన్నిక వచ్చింది. ఇది సాధారణం. కానీ ఎందుకు అంత అసాధారణంగా మారింది? అంటే ఆ సీటుని ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్, మళ్ళీ గెలిచి తీరాలని బీఆర్ఎస్, ఆ రెండు పార్టీలో కొట్లాటలో తామే గెలిస్తే పోలా? అని బీజేపీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కాంగ్రెస్ కోసం పోటీ నుంచి తప్పుకుని ఎంఐఎం వేడుక చూస్తోంది. ఇప్పుడు ఇక్కడి ముస్లిం ఓట్లు కీలకంగా మారి, మహ్మద్ అజహరుద్దీన్ ని మంత్రిని చేసేశాయి. ఇక ఈ ప్రభావం కూడా ఏ మేరకు ఉంటుందో? చూడాలి.

నిజానికి జూబ్లీ ఉప ఎన్నికలో ఎవరు, ఏపార్టీ గెలిచినా, ఓడినా ప్రజలకు పెద్దగా ఒరిగేదేమీ ఉండదు. వారి దైనందిన జీవనంలో వచ్చే మార్పులూ ఉండవు. అదరిపోయే అభివృద్ధేమీ జరగదు. చెదిరిపోయే ముఖ చిత్రమమేమీ ఉండదు. కాకపోతే ఈ ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న రాజకీయ పార్టీలు ఈ ఒక్క నియోజకవర్గంలో గెలపోటములను బట్టి అధికార మార్పిడికి గురవుతాయి. ఆ తర్వాత అవి ఆ ఫలితాన్నే కాదు. ప్రజల్ని కూడా యథావిధిగా మరచిపోతాయి.

అధికారంలో ఉన్నందున ఈ సీటుని గెలవడం కాంగ్రెస్ కు, సిటింగ్ సీటుని నిలుపుకోవడం బీఆర్ఎస్ కు, తమ బలాన్ని పరీక్షించుకోవడం బీజేపీకి అవసరం. అధికారంలో ఉన్న పార్టీల పంచన ఉండటం ఎంఐఎంకు ముఖ్యం. దీంతో పార్టీలు తమ మనుగడ కోసం జూబ్లీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని, ప్రజల్ని, వారిచ్చే తీర్పుని అప్రతిష్టపాలు చేసే సవాల్‌గా తీసుకుంటున్నాయి. దీంతో ఇక్కడ పోటీ ఆసక్తికరంగా మారింది.

ఈ ఉప ఎన్నిక ఫలితంతో ప్రజల జీవితాల్లోనే కాదు, రాజకీయ నాయకుల్లోనూ పెద్దగా వచ్చే మార్పేమీ ఉండదు. రాజకీయ పార్టీలకు గెలుపోటములు యాదిమరుపంత అలకన. అయితే రాజకీయ పార్టీలు, నేతలు, ప్రజలు, మీడియా సమీకరణలు వేర్వేరుగా వాటి అవసరాలను బట్టి ఉంటాయి. ఫలితాల చర్చలు ప్రజల దృక్కోణం నుంచి కాకుండానే ఉంటాయి.

జూబ్లీ ఉప ఎన్నిక బీఆర్‌ఎస్‌ పదేండ్ల పాలనకు, కాంగ్రెస్ రెండేండ్ల పాలనకు ఎలా పోలిక అవుతుంది? పోలికకు సమాన కాలాన్ని కూడా తీసుకోవాలి కదా! ఇక పార్టీల, నేతల పరస్పర ఆరోపణలకు అర్థాలే ఉండవు. అర్థమైనా చర్యలుండవు. ప్రజల్ని పిచ్చోళ్ళను చేస్తన్నారంతే. అయితే ప్రజలు కూడా ఇలాంటి సందర్భాలొచ్చినప్పుడే పార్టీలు, నేతల పీచమణుస్తారు.

నిజానికి ప్రజలకు తమ అభ్యర్థి ఎంచుకునే అవకాశాలు పరిమితం. నిలబడిన పార్టీలు, నిలబెట్టిన అభ్యర్థుల్లో ఒకరిని మాత్రమే ఎన్నుకోవాలి. నచ్చపోతే ‘నోటా’ ఉన్నప్పటికీ, ప్రజలు పార్టీలంత, నేతలంత సంఘటితం కాదు. కాబట్టి, ఎన్నికేదైనా వాటి ఫలితాలు రాజకీయ పార్టీలు తమ బలాబలాలను పరీక్షించుకోవడానికి, పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడానికి మాత్రమే పనికివస్తాయి.

పార్టీలు తమ ఏజెండాలను నెత్తినెత్తుకుని ఊరేగుతున్నాయి. ప్రజల ఆ పార్టీల నేతలు చేసిన అవినీతిని చూస్తున్నారు. పార్టీల నేతలే ఒకరి అవినీతిని ఒకరు బయట పెట్టుకుంటున్నారు. జనం ఓట్ల కోసం నానా పాట్లూ పడుతున్నారు. ఓట్ల వేటలో ఎవరి సమీకరణాలు వారికున్నాయి. బీఆర్ఎస్ అవినీతిని చూపి కాంగ్రెస్… కాంగ్రెస్ అవినీతిని చూపి బీఆర్ఎస్ లు పోటీ పడుతున్నాయి. ఈ సమయంలోనే జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఓటర్లు విజ్ఞతను ప్రదర్శించాల్సి ఉంది. చైతన్యంతో ఓటేయాల్సి ఉంది.

Latest News

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 20 నుండి సెప్టెంబర్ 26 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త అవకాశాలు కనిపిస్తాయి, ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపార రంగాల్లో ముందడుగు వేసే పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులను...

కరకరలాడే కరెన్సీ నోట్లతో నాయకుడు!|ADUGU TRENDS

అవును. మీరు ఇ0టున్నది నిజమే. కావాలనంటే మీరే సూడు0డ్రి. గాడ కరకరలాడే కొత్త కరెన్సీ నోట్ల తోటి ఇనాయకుడిని అలంకరించినరు. ఒక్క రూపాయి రెండు రూపాయలతోటి కాదుల్ల ఏకంగా 65.03 లచ్చల నోట్ల...

పన్నుల ఉచ్చులో ప్రపంచ వాణిజ్యం!|EDITORIAL

సుంకాల అస్త్రంతో అమెరికా మరోసారి ప్రపంచ వాణిజ్యాన్ని కుదిపేస్తోంది. రష్యా, ఇరాన్‌లపై ఆంక్షల పేరుతో భారత్, చైనాలపై కూడా భారీ సుంకాల ముప్పు తెరపైకి వచ్చింది. ముఖ్యంగా రష్యా చమురు దిగుమతుల విషయంలో...

సెప్టెంబర్ 19, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు అష్టమి పగలు 01.40 వరకు ఉపరి నవమి నక్షత్రం మూల రాత్రి 01.14 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం ఆయుష్మాన్ పగలు 03.20 వరకు ఉపరి సౌభాగ్య కరణం బవ పగలు 01.40...

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News