Saturday, June 27, 2026
24.8 C
Hyderabad

ట్రంప్‌ ‘శాంతి’ అ(హ)త్యాశ నెరవేరేనా!?|EDITORIAL

సాధారణంగా ప్రజలెవరూ యుద్ధాలను కోరుకోరు. ఘర్షణలను కూడా ఆహ్వానించరు. ఎవరైనా ప్రశాంతంగా బతకాలనే అనుకుంటారు. ఒక్క ట్రంప్, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు తప్ప. ఇలాంటి ఓ వ్యక్తి ఓ శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడవడమే అత్యంత బాధాకరం. అతడిని ఎన్నుకున్నందుకు ఆ దేశ ప్రజలే బాధపడుతుంటే, యుద్ధాలతో, సుంకాలతో, రక్తపాతంలో, మాయోపాయ కుయుక్తులతో, యుద్ధ హెచ్చరికలతో శాంతి ప్రవచనాలు పలికి, దేశాలను బెదిరించి మద్దతు కూడగట్టి, నామినేట్ చేయించుకుని, ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాంతి బహుమతిని కొట్టాయాలనుకోవడమే విధి వైచిత్రి. ఇది ట్రంప్‌ ఒక్కడికే సాధ్యమయ్యే ట్రంపరితనం! అత్యాశను మించిన హత్యాశ!! శృతి మించిన వెర్రితనం!!!
అమెరికా అధ్యక్షుడినన్న ఆధిపత్యంతో, నాకివ్వరా? అన్న అహంకారంతో, తన చుట్టుముట్టు దేశాలను బెదిరిస్తున్న ధోరణితో ‘నోబెల్ శాంతి’పై ట్రంప్ మనసు పడ్డారు. నోబెల్ స్టాండర్డ్ స్థాయిలు నీకు లేనే లేవుగా? అన్నట్లుగా ‘వైట్ హైస్’ ని, ‘లైట్’ తీసుకుంది నోబెల్ కమిటీ.
అయితే, ట్రంప్ ఆశలు ఇక్కడితో అడియాశలయ్యాయనుకోలేం. మళ్ళీ మళ్ళీ పోటీ పడటానికి జనవరి 20, 2029 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనకు ఈ టర్మే చివరి అవకాశం కాబట్టి, మున్ముందు ఈ ప్రయత్నాలను మానరు. ఒత్తిడిని పెంచుతారు. తాను ఈ ప్రపంచానికి శాంతి దూత కావాలన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. అది నెరవేరేనా? డా. మార్గం – అడుగు ఎడిటోరియల్

‘ఆల్ఫ్రెడ్ నోబెల్ ఆశయాలకు అనుగుణంగా మేం నిర్ణయాలు తీసుకుంటాం’ అన్నారు నార్వే నోబెల్ కమిటీ చైర్మన్ జోర్గెన్ వాట్నె ఫ్రిడ్నెస్. అంతేకాదు, ‘త్వరితగతిన దక్కిన దౌత్య విజయాలకంటే, స్థిరమైన బహు పాక్షిక ప్రయత్నాలకు కమిటీ ప్రాధాన్యమిస్తూ ఉంటుంది. ట్రంప్ ప్రయత్నాలు సుస్థిర ఫలితాలిస్తాయని ఇంకా నిరూపితం కాలేదు. ఒర ఘర్షణను స్వల్పకాలం ఆపడానికి, దాని మూల కారణాలను గుర్తించి, పరిష్కరించడానికి మధ్య చాలా తేడా ఉంటుంది.’ అని హెన్నీ జాక్సన్ సొసైటీలో చరిత్రకారుడిగా ఉన్న థియో జనౌ అన్నారు. ఇది ట్రంప్ నుద్దేశించే అనడానికి అనుమానాలు అక్కరలేదు. జనవరి 31ననే నోబెల్ కు నామినేషన్ల గడువు ముగిసింది. అయినా అమెరికా అధ్యక్షుడినన్న ఆధిపత్యంతో, నాకివ్వరా? అన్న అహంకారంతో, తన చుట్టుముట్టు దేశాలను బెదిరిస్తున్న తరహా ధోరణితో ‘నోబెల్ శాంతి’పై మనసు పడ్డారు. నోబెల్ స్టాండర్డ్ స్థాయిలు నీకు లేనే లేవుగా? అన్నట్లుగా ‘వైట్ హైస్’ ని ‘లైట్’ తీసుకుంది నోబెల్ కమిటీ. అసలే కోతి. ఆపై నిప్పును తొక్కింది. ఇగ దాని ‘ఎగురుడు’ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. నెబెల్ దెబ్బకు ట్రంప్ మైండ్ బ్లాంక్ అయింది. నోబెల్ లేవెల్ తను కాదని ట్రంప్ కి తెలిసొస్తే ప్రపంచానికి అంతకంటే ‘శాంతి’ మరోటి ఉండదు.

సాధారణంగా ప్రపంచంలో ప్రజలెవరూ యుద్ధాలను కోరుకోరు. ఘర్షణలను కూడా ఆహ్వానించరు. ఎవరైనా ప్రశాంతంగా బతకాలనే కోరుకుంటారు. ఒక్క, ట్రంప్, ఇస్లామిక్‌ ఉగ్రవాదులు తప్ప మిగతా ప్రపంచమంతా ఇదే కోరుకుంటోంది. ఇలాంటి ఓ వ్యక్తి ఓ శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడవడమే అత్యంత బాధాకరం. అతడిని ఎన్నుకున్నందుకు ఆ దేశ ప్రజలే బాధపడుతుంటే, యుద్ధాలతో, సుంకాలతో, రక్తపాతంలో, మాయోపాయ కుయుక్తులతో, యుద్ధ హెచ్చరికలతో శాంతి ప్రవచనాలు పలికి, దేశాలను బెదిరించి మద్దతు కూడగట్టి, నామినేట్ చేయించుకుని, ప్రతిష్ఠాత్మక ప్రపంచ శాంతి బహుమతిని కొట్టాయాలనుకోవడమే విధి వైచిత్రి. ఇంతకంటే దారుణం ప్రపంచంలో ఉంటుందా? ఇది ట్రంప్‌ ఒక్కడికే సాధ్యమయ్యే ట్రెంపరితనం! అత్యాశను మించిన హత్యాశ!! శృతి మించిన వెర్రితనం!!!

సుంకాలతో ప్రపంచాన్ని అస్థిరతలోకి నెట్టిన ట్రంప్‌ ఎప్పిటికైనా శాంతి కాముకుడు కాగలడా? ముందుగా ఇజ్రాయెల్ ను ఎగదోసి, బలవంతంగా గాజా, హమాస్‌ మధ్య శాంతి కుదిరినా అది ట్రంప్‌ ఖాతాలో వేయగలమా? శాంతిదూతలెప్పుడూ ట్రంప్ లా తనను తాను శాంతిదూత అని ప్రకటించుకోలేదు. యుద్ధాలే కాదు, ఆర్థిక యుద్దాలు కూడా యుద్ధం కిందకే వస్తాయని ట్రంప్‌ తెలుసుకోవాలి.

భారత్‌, పాక్‌ యుద్ధం సహా ఎనిమిది యుద్ధాలు ఆపానని, ఈ ఏడాది తనకు నోబెల్‌ బహుమతి రావాలని, లేదంటే అమెరికాను అవమానించినట్లేనని ట్రంప్ బెదిరింపులకు దిగాడు. అమెరికాకు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ట్రంప్ తనను తాను శాంతి దూతగా సంసిద్ధం చేసుకుంటూ వస్తున్నాడు. అన్ని విధాల అర్హుడినని ప్రకటించుకున్నాడు. ఈ ఏడాదికి నోబెల్‌ బహుమతుల ప్రకటన మొదలైన తర్వాత ట్రంప్‌ మరింత వేగం పెంచాడు. పాక్‌, ఇజ్రాయెల్‌ వంటి దేశాలు ట్రంప్‌ను శాంతి బహుమతికి నామినేట్‌ కూడా చేశాయి. అయితే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఈ బహుమతికి ట్రంప్‌ అసలు అర్హుడేనా? అన్న చర్చ ప్రపంచమంతా జరుగుతున్నది. పాలస్తీనా దురాక్రమణకు ఇజ్రాయెల్‌ను ఎగదోస్తున్నదే అమెరికా! రష్యాపై పోరుకు ఉక్రెయిన్‌కు ఆయుధాలు సరఫరా చేస్తున్నది కూడా అగ్రరాజ్యమే!! అఫ్ఘానిస్తాన్‌ ఎయిర్‌ బేస్‌ను ఆక్రమిస్తామని, కెనడా కూడా అమెరికా భూభాగమేనని, దాన్నితమ దేశంలో మరో రాష్ట్రంగా గుర్తిస్తామని ట్రంప్‌ ఇప్పటికే ప్రకటించాడు. సుంకాలతో ప్రపంచానికి కంటివిూద కునుకు లేకుండా చేశాడు. వీసాలు, గ్రీన్‌ కార్డుల విషయంలోనూ ట్రంప్ వైఖరే వేరు. అయితే హమాస్‌, ఇజ్రాయిల్‌ శాంతి ఒప్పందంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. కానీ ట్రంప్ కు కాదు.
ట్రంప్ కి తనేంటో తనకు తెలుసు. అయినా, నోబెల్ శాంతి కావాలి. అందుకే ఆయన పరస్పర భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఫిబ్రవరిలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో మాట్లాడుతూ, ‘వాళ్ళు నాకు నోబెల్ ఇవ్వరు. అర్హుడినైనా ఎప్పటికీ ఇవ్వరు.’ అన్నారు. ఆగస్టులో ఉక్రెయిన్ ‘నేను యుద్ధాలతో మగ్గుతున్న దేశాల ఒప్పందాలు చేశాను. ఆరు అని, కాదు ఏడు అని సవరించుకున్నారు. భారత్, పాక్ యుద్ధ సమయంలోనూ ‘నేను ఈ యుద్ధాన్ని ఎలా ఆపానో మీకు తెలుసు. నేను నోబెల్ కు అర్హుడను.’ అన్నారు. అప్పటికీ నోబెల్ రాకపోడంతో, ఆప్రకటనకు ముందు ‘ఆ అవార్డు నాకు రాకపోతే, అమెరికాకు అవమానం’ అన్నారు. 1901 నుండి ఇప్పటి వరకు ఇప్పటి వరకు 105సార్లు నోబెల్ బహుమతి ప్రకటించారు. 111 మంది సభ్యులు, 31 సంస్థలు ఇప్పటి వరకు ఈ పురస్కరాన్ని అందుకున్నారు. అయితే, ‘వాతావరణ మార్పులపై నమ్మకంలేని వారికి, ఇలాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డులు దక్కుతాయనుకోలేం’ అని కూడా థియో జనౌ అన్నారు. ఇది ట్రంప్ గురించేనన్న విషయం వేరే చెప్పక్కరలేదు.

అయితే, ట్రంప్ ఆశలు ఇక్కడితో అడియాశలయ్యాయనుకోలేం. మళ్ళీ మళ్ళీ పోటీ పడటానికి జనవరి 20, 2029 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉంటారు. ఆయనకు ఈ టర్మే చివరి అవకాశం కాబట్టి, తన ప్రయత్నాలను మానుకోరు. కొద్ది గంటల ముందే రష్యా, ట్రంప్ పేరును నోబెల్ ప్రతిపాదించింది. ఈసారి నోబెల్ గ్రహీత మరియా కొరీనా, ట్రంప్ నకు అంకితమిస్తున్నానని ప్రకటించారు. దీనికి భిన్నంగా వైట్ హౌస్ మాత్రం ‘నోబెల్ కు ఎంపికలో రాజకీయ వివక్ష చూపించార’ని విమర్శించింది. ‘అయినా ట్రంప్ యుద్ధాలను ఆపుతూనే ఉంటారు. ఒప్పందాలతో ప్రజల ప్రాణాలు నిలబెడతారు. ఆయన మానవతవా వాది. ఆయన సంకల్పంతో పర్వతాలను సైతం కరిగించగలిగిన ఆయనలాంటి వ్యక్తి మరొకరుండరు’అని వ్యాఖ్యానించింది. అంటే మున్ముందు ఈ ప్రయత్నాలను మానరు. ఒత్తిడిని పెంచుతారు. తాను ఈ ప్రపంచానికి శాంతి దూత కావాలన్నది ఆయన ప్రగాఢమైన కోరిక. మరి అది నెరవేరేనా?

Latest News

ఆఖరి మజిలీ అదే!?|ADUGU TRENDS

స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన ‘ది టర్నినల్’ సినిమా చూసిండ్రా? గా సినిమాకు అసల్ కథ గీయినదే! మనిసి మనుగడ, జీవిత మజిలీలకు గీయినె జీవితమే ఉదాహరణ. గందుకే గా స్పీల్ బర్గ్...

వెనెజువెలా ప్రపంచానికి హెచ్చరిక!?|EDITORIAL

వెనెజువెలా విషాదం ప్రపంచానికి మరో కీలక సందేశాన్ని అందిస్తోంది. ప్రకృతి విపత్తులను ఆపలేకపోయినా, శాస్త్రీయ ప్రణాళిక, భూకంప నిరోధక నిర్మాణాలు, విపత్తు నిర్వహణలో సాంకేతికత వినియోగం, ప్రజల్లో అవగాహన, అంతర్జాతీయ సహకారంతో ప్రాణనష్టాన్ని...

జూన్ 27, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 12.14 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అనురాధ రాత్రి 10.29 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం సాధ్య మధ్యాహ్నం 01.38 వరకు ఉపరి శుభ కరణం కౌలవ ఉదయం 11.20...

మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!!|ADUGU TRENDS

గంజి నీల్లు తాగినోడు మట్టిలోనే..! బెంజి కార్ల తిరిగినోడు మట్టిలోనే..!! మనతో తెచ్చిందేమీ లేదు. తీసుకపోయేదేమీ లేదు. మిగిలేదంతా మట్టే! మరు భూమిల మసే!! గీ సూత్రం తెలిసినోల్లు గీ భూమ్మీద మనుసుల్లెక్క...

చమురుకు చలువ పరిణామాలు!?|EDITORIAL

ఇరాన్‌తో చమురు వాణిజ్యానికి మళ్లీ అవకాశం కనిపించడం భారత్‌కు సానుకూల పరిణామమే. చమురు ధరల తగ్గుదల, హర్ముజ్ మార్గంలో స్థిరత్వం, ఇంధన సరఫరా భద్రత వంటి అంశాలు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊరటనివ్వగలవు....

జూన్ 26, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 10.26 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం విశాఖ రాత్రి 08.07 వరకు ఉపరి అనురాధ యోగం సిద్ద మధ్యాహ్నం 01.15 వరకు ఉపరి సాధ్య కరణం బవ ఉదయం 09.43...

శెట్టా? పెద్ద.. ఛెత్రా?!|ADUGU TRENDS

మనిసిది పక్రుతితో యిడదీయరాని సంబంధం. మనిసే కాదు, పతి పాణి మనుగడే శెట్లతోటే ముడిపడి ఉంది. గాలి, నీడ, ప్రాణవాయువు ఆక్సీజన్ మొదలు పంచ భూతాల దాకా శెట్టుకు-మనిసికి లెంకే. మనం తినేవన్నీ...

అయ్యో..రామయ్యా! ఇదేం గోలయ్యా?|EDITORIAL

అయోధ్య రామాలయాన్ని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మాత్రమే చూడలేం. అది కోట్లాది మంది హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక. ఆ పవిత్ర స్థలంలో నిధుల దుర్వినియోగం జరిగిందనే అనుమానమే భక్తులను కలచివేస్తోంది. అందుకే ఈ...

జూన్ 25, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం నిర్జల ఏకాదశి తిధి శు ఏకాదశి రాత్రి 08.59 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం స్వాతి సాయంత్రం 06.03 వరకు ఉపరి విశాఖ యోగం శివ మధ్యాహ్నం 01.09 వరకు ఉపరి సిద్ద కరణం వణజి ఉదయం...

చెట్లని …. “హత్య” చేస్తున్నారు!!|POETRY|ADUGU SPECIAL

హరిత తెలంగాణ... వనమావోత్సవం... అది.... ఇది.. . పేర్లతోటి.... నాయకులని ,అధికారులని తమను నాటమని మొక్కలు అడిగాయా..?? ...మీరే కదా నాటింది!! ఆ నాటడం కూడా... పోయి పోయి ఎక్కడ స్థలం లేనట్టు - విద్యుత్తు తీగల కింద నాటడం ఎందుకు చేశారు ?? అదేదో పెద్ద ఘనకార్యం...

పెండ్లాం కోసం ఇంట్ల మెట్లకే ఎస్కలేటర్?!|ADUGU TRENDS

ఆలుమొగల బంధం అమూల్యం, అపురూపమైంది. గందుకే ఒకర్నొకరు గౌరవించుకోవాలె. గట్లనే ప్రైజులు, సర్ ప్రైజులు ఇచ్చుకోవాలె. శెద్ద సూపాలె. టైమియ్యాలె. అభినందించాలె. ఇగ మొఘల్ రాజు షాజహానైతే భార్య ముంతాజ్ మహల్ మీద...

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా!?|EDITORIAL

భారత రాజకీయ ముఖచిత్రం మారుతోందా? జాతీయ పార్టీల ప్రాభవం తగ్గి, సంకీర్ణాల యుగం అంతరిస్తోందా? జాతీయ పార్టీలు మళ్ళీ పుంజుకుంటున్నాయా? ప్రాంతీయ పార్టీలకు కాలం చెల్లిపోతోందా? అవి ప్రమాదంలో పడ్డాయా? సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయా?...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News