Sunday, November 1, 2026
28.8 C
Hyderabad

పేదరికంపై భారత్ విజయం|EDITORIAL

ఒకప్పుడు పేదరికం భారత్‌ను వెంటాడింది.. ఇప్పుడు అదే పేదరికంపై దేశం గణనీయమైన విజయం సాధిస్తోంది! 12 ఏళ్లలో 49.6 కోట్ల మందికి ఊరట. ఇది అభివృద్ధికి సంకేతమేనా? అసమానతల అంతానికి ఇంకా ఎంత దూరం ప్రయాణించాలి?

మార్గం – అడుగు, ఎడిటోరియల్ 

పేదరికం అనేది కేవలం ఆదాయం తక్కువగా ఉండటమే కాదు.. ఆకలి, అనారోగ్యం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, కనీస సౌకర్యాల లేమి వంటి అనేక సమస్యల సమాహారం. అలాంటి పేదరికాన్ని తగ్గించడంలో భారత్ గణనీయమైన పురోగతి సాధించిందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించడం ఆశాజనక పరిణామం. 2011 నుంచి 2023 మధ్య దేశంలో పేదరికం గణనీయంగా తగ్గిందని, సుమారు 49.6 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్లు ‘ఇండియా పావర్టీ అండ్ ఈక్విటీ బ్రీఫ్‌–అక్టోబర్ 2026’ నివేదిక పేర్కొంది. రోజుకు 4.20 డాలర్ల ఆదాయ పరిమితి ప్రకారం పేదరికం 57.7 శాతం నుంచి 16.1 శాతానికి పడిపోగా, రోజుకు 3 డాలర్ల లోపు ఆదాయంతో జీవించే తీవ్ర పేదరికం 27.1 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గింది. కొనుగోలు శక్తి సమానత్వం ఆధారంగా రూపొందించిన ఈ గణాంకాలు దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో చోటుచేసుకున్న మార్పులకు అద్దం పడుతున్నాయి.

ఈ పురోగతికి అనేక కారణాలు దోహదపడ్డాయి. ప్రజల వినియోగ వ్యయం పెరగడం, ఉపాధి అవకాశాలు విస్తరించడం, ముఖ్యంగా మహిళల ఉద్యోగ భాగస్వామ్యం పెరగడం, ఆహార సబ్సిడీలు, సామాజిక సంక్షేమ పథకాల ద్వారా పేద కుటుంబాలకు మద్దతు లభించడం వంటి అంశాలను ప్రపంచ బ్యాంకు ప్రధానంగా గుర్తించింది. ఉచిత రేషన్, వంటగ్యాస్, విద్యుత్, తాగునీరు, పారిశుద్ధ్యం, ఆరోగ్య భద్రత వంటి మౌలిక సదుపాయాల విస్తరణ కూడా పేద కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఆర్థిక వృద్ధి, ప్రజల శ్రమ, ప్రైవేటు రంగంలో ఉపాధి విస్తరణ.. ఇలా సమిష్టి కృషి ఈ ఫలితాలకు బాటలు వేసింది. ఈ విజయాన్ని ఏ ఒక్క ప్రభుత్వం ఖాతాలో వేయడం కంటే, దీర్ఘకాలిక అభివృద్ధి ప్రయాణంలో భాగంగా చూడటం సమంజసం.

అయితే పేదరికం తగ్గిందంటే సమస్యలన్నీ సమసిపోయాయని భావించకూడదు. ఆదాయ అసమానతలు ఇంకా ఆందోళన కలిగిస్తున్నాయి. 2023లో అత్యధికంగా సంపాదించే పది శాతం కార్మికుల మధ్యస్థ ఆదాయం, అత్యల్పంగా సంపాదించే పది శాతం కార్మికుల ఆదాయంతో పోలిస్తే దాదాపు 13 రెట్లు ఎక్కువగా ఉందని నివేదిక స్పష్టం చేసింది. అంటే పేదరికం తగ్గుతున్నప్పటికీ సంపద, ఆదాయ పంపిణీలో సమానత్వం ఇంకా సాధించాల్సి ఉంది. మరోవైపు దేశంలోని పేదల్లో సుమారు 57 శాతం మంది ఉత్తరప్రదేశ్‌ నుంచి పశ్చిమ బెంగాల్‌ వరకు ఉన్న రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉండటం ప్రాంతీయ అసమానతల తీవ్రతను తెలియజేస్తోంది.

గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం వేగంగా తగ్గడం సానుకూల పరిణామమే అయినప్పటికీ, అక్కడ స్థిరమైన ఉపాధి అవకాశాల కొరత, వ్యవసాయంపై అధిక ఆధారపడటం, తక్కువ ఉత్పాదకత వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. మహిళలకు ఉపాధి పెరగడం స్వాగతించదగినదే. అయితే యువత నిరుద్యోగం, ముఖ్యంగా గ్రామీణ యువతుల ఉద్యోగ సమస్యలను విస్మరించలేం. ఉపాధి అంటే కేవలం పని కల్పించడం కాదు.. గౌరవప్రదమైన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక రక్షణ కల్పించడం కూడా ప్రభుత్వాల బాధ్యత.

ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం 2028 నాటికి 4.20 డాలర్ల ఆదాయ ప్రమాణం వద్ద పేదరికం 12.1 శాతానికి తగ్గే అవకాశం ఉంది. అయితే ఇది ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా రూపొందించిన అంచనా మాత్రమే. ఆర్థిక పరిస్థితులు, ఉపాధి అవకాశాల్లో మార్పులను బట్టి ఈ అంచనాలు మారవచ్చు. అందుకే సాధించిన విజయాలతో సంతృప్తి చెందకుండా, పేదరిక నిర్మూలనను నిరంతర లక్ష్యంగా కొనసాగించాలి.

పేదరికాన్ని తగ్గించడం మొదటి విజయం.. ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడం అసలైన లక్ష్యం. సంక్షేమంతో పాటు నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం, నైపుణ్యాభివృద్ధి, స్థిరమైన ఉపాధి, సమాన అవకాశాలకు పెద్దపీట వేయాలి. గణాంకాల్లో కనిపించే అభివృద్ధి ప్రతి పేద కుటుంబం జీవితంలోనూ కనిపించినప్పుడే వికసిత భారత్‌ లక్ష్యానికి నిజమైన అర్థం చేకూరుతుంది. పేదరికంపై పోరాటం కొనసాగాలి.. అభివృద్ధి ఫలాలు చివరి వ్యక్తికీ అందాలి!

Latest News

పట్టా శాశ్వతం.. ఓటు మాత్రం తాత్కాలికమా!?|ESSAY|GRADUATES

ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. అర్హులైన ప్రతి పౌరుడు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తన ఓటును వినియోగించుకునేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలి. అయితే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు విధానం మాత్రం...

కరెంట్ అఫైర్స్|CURRENT AFFAIRS|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|EDUCATION

1) లడఖ్‌లోని పుగా వ్యాలీలో భారతదేశపు మొట్టమొదటి జియోథర్మల్ బావులు తూర్పు లడఖ్‌లోని పుగా వ్యాలీలో 1,000 మీటర్ల లోతు కలిగిన భారతదేశపు మొట్టమొదటి మరియు అత్యంత లోతైన జంట జియోథర్మల్ (భూగర్భ ఉష్ణ)...

గీ బూరు మిఠాయి గింత పని శేసిందా!?|ADUGU TRENDS

యెనకటికి ఓ సైకోలు మీదనో, మూడు గిర్రల బండి మీదనో.. ఓ గంట మోగేది. గది మెల్లెగా మన వాడల్లోకి వచ్చేది. ఇగ గది సూద్దుం గదా? గావాటి మీద ఎర్రగనో, గులాబీలోనో...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

నవంబర్ 01 నుండి నవంబర్ 07 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త ఆలోచనలు కార్యరూపం దాల్చే అవకాశం ఉంటుంది. ఉద్యోగ రంగంలో మీ ప్రతిభకు తగిన...

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష! మార్గం -...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

-అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం -ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

అక్టోబర్ 30, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పంచమి రాత్రి 11.37 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మృగశిర పగలు 01.45 వరకు ఉపరి ఆరుద్ర యోగం శివ రాత్రి 02.04 వరకు ఉపరి సిద్ద కరణం కౌలవ పగలు 12.47 వరకు ఉపరి...

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News