Saturday, October 31, 2026
30.1 C
Hyderabad

ప్రతి నీటి చుక్కా విలువైనదే!|EDITORIAL

ఎల్‌నినో హెచ్చరికలు.. అడుగంటుతున్న జలాశయాలు.. పెరుగుతున్న ట్యాంకర్ల డిమాండ్‌! భాగ్యనగరానికి జలగండం ముంచుకొస్తోందా? రేపటి దాహాన్ని తీర్చేందుకు నేడే మేల్కోవాలి. ప్రభుత్వ ముందుచూపుతో పాటు ప్రజల నీటి పొదుపే మహానగరానికి శ్రీరామరక్ష!

మార్గం – అడుగు, ఎడిటోరియల్

హైదరాబాద్‌ మహానగరానికి తాగునీటి భవిష్యత్తుపై ఆందోళన మొదలైంది. ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల అంచనాలు ఒకవైపు.. మరోవైపు ప్రధాన జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు నగర భవిష్యత్తుకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌, మంజీరా, సింగూరు జలాశయాల్లో నీటి మట్టాలు పడిపోతుండటం, కృష్ణా ప్రాజెక్టుల నుంచి ఆశించిన స్థాయిలో నీరు అందకపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం గోదావరి జలాలే నగరానికి ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఉస్మాన్‌సాగర్‌లో 3.9 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి గాను 2 టీఎంసీలు, హిమాయత్‌సాగర్‌లో 4.2 టీఎంసీలకు గాను 2 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. మంజీరాలో 1.50 టీఎంసీలకు గాను కేవలం 0.19 టీఎంసీలు, సింగూరులో 29.91 టీఎంసీలకు గాను 3.029 టీఎంసీల నీరే అందుబాటులో ఉండటం ఆందోళనకరం. నగరానికి రోజుకు సుమారు 560 మిలియన్‌ గ్యాలన్ల నీరు అవసరమవుతుండగా, భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో బోర్లు విఫలమవుతుండటంతో ట్యాంకర్లపై ఆధారపడే కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. గతంలో రోజుకు ఆరు వేలుగా ఉన్న ట్యాంకర్‌ బుకింగ్‌లు ఇటీవల ఎనిమిది వేలకు చేరడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఈ నేపథ్యంలో జలమండలి సరఫరాను క్రమబద్ధీకరించడం, ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ నుంచి నీటి సరఫరాను తగ్గించడం వంటి చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మంజీరాపై ఆధారపడే ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా గోదావరి నీటిని అందించేందుకు వెలిమెల సమీపంలో రింగ్‌ మెయిన్‌ను మంజీరా ఫేజ్‌-3, ఫేజ్‌-4 పైప్‌లైన్లతో అనుసంధానించే పనులు చేపట్టడం స్వాగతించదగిన చర్య. అయితే ఇవి తాత్కాలిక ఉపశమనానికే పరిమితం కాకుండా దీర్ఘకాలిక జలభద్రతకు బాటలు వేయాలి. వర్షపు నీటి సంరక్షణ, చెరువుల పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు, మురుగునీటి శుద్ధి చేసి పునర్వినియోగించడం వంటి చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలి. నీటి సమస్యను రాజకీయ విమర్శలకు పరిమితం చేయడం వల్ల ప్రయోజనం లేదు. అధికార, ప్రతిపక్షాలు బాధ్యతాయుతంగా వ్యవహరించి పరిష్కారాలపై దృష్టి సారించాలి. మంత్రి పొన్నం ప్రభాకర్‌ సూచించిన పానీ యాప్‌, వాటర్‌ వారియర్స్‌ వెబ్‌సైట్‌ ద్వారా నీటి వృథాపై ప్రజలు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించడం కూడా ఉపయోగకరం. అయితే ప్రజల్లో అవగాహనతో పాటు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ, ఫిర్యాదులపై తక్షణ స్పందన ఉండాలి. తాగునీటితో వాహనాలు కడగడం, పైపులతో ప్రాంగణాలను శుభ్రం చేయడం, ట్యాంకులు నిండినా మోటార్లు ఆపకపోవడం వంటి వృథా చర్యలకు అడ్డుకట్ట వేయాలి. ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ వనరులను సిద్ధం చేయాలి. ప్రజలు కూడా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి. ప్రకృతి ఇచ్చే నీటి వనరులు అపరిమితం కావు. నేటి నిర్లక్ష్యం రేపటి దాహానికి కారణం కాకూడదు. హైదరాబాద్‌ దాహం తీర్చడం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు.. ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత కూడా. ప్రతి నీటి చుక్కను కాపాడుకుంటేనే మహానగర భవిష్యత్తుకు భరోసా ఉంటుంది.

Latest News

ఉపవాసం లేదని యిడుపు కాయితం!?|ADUGU TRENDS

ఆలుమొగల బంధం పాలునీల్ల లెక్క కలిసిపోయేది. ఎంతో యిలువైంది. వందేండ్ల పానాలకు నూరేండ్ల అనుబంధం. కానీ గా పెనిమిటి, పెండ్లాంల జీవితాలు కుక్కలు శింపి, ఇసిరేసిన ఇస్తరిలెక్కైతానయి. శీటికి మాటికి శిల్లర పంచాయితీలు,...

అక్టోబర్ 31, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 09.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఆరుద్ర పగలు 12.05 వరకు ఉపరి పునర్వసు యోగం సిద్ద రాత్రి 10.57 వరకు ఉపరి సాధ్య కరణం గరజి ఉదయం 10.24 వరకు ఉపరి...

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

-అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం -ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

అక్టోబర్ 30, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పంచమి రాత్రి 11.37 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మృగశిర పగలు 01.45 వరకు ఉపరి ఆరుద్ర యోగం శివ రాత్రి 02.04 వరకు ఉపరి సిద్ద కరణం కౌలవ పగలు 12.47 వరకు ఉపరి...

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

‘సర్’, ఏది సత్యం? ఏది అసత్యం!?|EDITORIAL

అంతిమంగా, ఓటర్ల జాబితా ప్రక్షాళన లక్ష్యం నకిలీ ఓట్లను తొలగించడమే కాదు. ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా కాపాడటం. అధికార పార్టీ రాజకీయ ఆరోపణలతో సమస్యను కొట్టిపారేయ కూడదు. ప్రతిపక్షాలు కూడా...

అక్టోబర్ 29, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి చవితి రాత్రి 01.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి పగలు 03.21 వరకు ఉపరి మృగశిర యోగం వరీయాన్ ఉదయం 08.14 వరకు ఉపరి పరిఘ కరణం బవ పగలు 03.05...

తబలా మీద.. తాళాలు!?|ADUGU TRENDS

పతిభకు ఆకాసం కూడా హద్దు కాదు. కళకు వయసుతో సంబంధం లేదు. సంకల్పముంటే సాధించలేనిదేదీ లేదు. ఏందీ గీ స్పూర్తి నీతి సూత్రాలనుకుంటాండ్రా? గి సిన్న పిల్ల ముందు గయన్నీ సిన్నబోయినయి మరి....

అమెరికాకు రాజకీయ సవాల్!|EDITORIAL

బ్రెజిల్ రాజకీయాల్లో మరోసారి లులా ప్రభంజనం! 80 ఏళ్ల వయసులోనూ హోరాహోరీ పోరులో విజయం సాధించి నాలుగోసారి అధ్యక్ష పీఠం దిశగా అడుగులు వేశారు. పేదల సంక్షేమమే అజెండాగా ముందుకు సాగిన ఆయనకు...

అక్టోబర్ 28, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి విదియ ఉదయం 06.19 వరకు ఉపరి తదియ నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యతీపాత ఉదయం 11.06 వరకు ఉపరి వరీయాన్ కరణం గరజి ఉదయం 06.19 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News