Friday, October 30, 2026
31.6 C
Hyderabad

గ్రహణం వీడేనా? గూడూరు కు హాస్టల్ తిరిగి వచ్చేనా?|PALAKURTHI|EDUCATION

–అడుగు కథనంతో కదిలిన అధికార యంత్రాంగం

-ప్రజా ప్రతినిధుల్లోనూ కదలిక

దాతలు కీ.శే బొబ్బల రంగారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారులు బొబ్బల రమణారెడ్డి, బొబ్బల అశోక్ రెడ్డి లు స్వచ్ఛందంగా, ఉచితంగా పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం ఇచ్చిన ఎకరం భూమి.. ప్రభుత్వం వెచ్చించిన రూ.21 లక్షలు.. నిర్మించిన పక్కా భవనం.. అయినా, నిరుపయోగంగా మారిన ఎస్సీ బాలుర హాస్టల్ భవనం! వెరసి జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలోని ఈ భవనంపై ‘అడుగు ‘ దినపత్రికలో అక్టోబర్ 10న ‘దాతలిచ్చిన ఎకరం.. హాస్టల్‌కు గ్రహణం!’ శీర్షికన ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగంలో కదలిక తీసుకొచ్చింది. ప్రజా ప్రతినిధులు స్పందించేలా చేసింది. అయితే, ప్రస్తుతం ఈ భవనంపై ఏం జరుగుతోంది? భవిష్యత్తులో ఏం జరగనుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

కలెక్టర్ ఆదేశాలతో అధికారుల పరిశీలన

అడుగు వార్త ఎలుగెత్తి సమస్య జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝూ దృష్టికి వెళ్లింది. అక్టోబర్ 14న గూడూరు సర్పంచ్ మాచర్ల స్వరూప–పుల్లయ్యలు ఈ భవనం పై ఓ నిర్ణయం తీసుకోవాలని వినతిపత్రం అందించారు., భవన పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖ అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు.. మరోవైపు నాంచారి మడూరు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు గూడూరులోని ఆ భవనాన్ని సందర్శించారు.

బీజేపీ నేతల వినతి.. ఎమ్మెల్యే జోక్యం

ఇదిలా ఉండగా అక్టోబర్ 24న బీజేపీ మండల అధ్యక్షుడు మారం రవికుమార్, రాష్ట్ర నాయకుడు దొంగరి మహేందర్ తదితరులు నిరుపయోగంగా ఉన్న గూడూరు ఎస్సీ హాస్టల్ భవనాన్ని సందర్శించి, పరిశీలించారు. అలాగే ఆ భవనాన్ని పునరుద్ధరించాలని, వెంటనే హాస్టల్ ను కానీ, లేదా వేరే విద్యాసంస్థలను అందులో నడిచే విధంగా చర్యలు తీసుకోవాలని అక్టోబర్ 26న ప్రజావాణిలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఇదిలా ఉండగా రాష్ట్ర బీజేపీ సీనియర్ నాయకుడు పాకనాటి దామోదర్ రెడ్డి అక్టోబర్ 28న వీడియో ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా ఈ సమస్యను ప్రస్తావించారు. మరి వైపు అక్టోబర్ 29న ఆ గ్రామ సర్పంచ్ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, భవనాన్ని సీరియస్‌గా పరిశీలించి విద్యాసంస్థ ఏర్పాటు చేసే అవకాశాలను చూడాలని ఆమె అధికారులకు సూచించినట్లు తెలిసింది.

భవన పునరుద్ధరణకు ఏర్పాట్లు!

గూడూరు హాస్టల్ భవన పునరుద్ధరణకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు ఒకటి రెండు రోజుల్లో అంచనాలు సిద్ధం కానున్నాయి.

ఇదిలా ఉండగా, మరమ్మతులు పూర్తయ్యాకే ఈ భవనాన్ని దేనికి ఉపయోగించాలన్నది నిర్ణయిస్తారని తెలుస్తోంది. ఏదేని విద్యాసంస్థగా లేదా ప్రభుత్వ వసతి గృహంగా వినియోగించే అవకాశాలున్నాయి. అయితే తుది నిర్ణయం ఇంకా వెల్లడికావాల్సి ఉంది. మరోవైపు, భవనాన్ని ఎవరి స్వప్రయోజనాలకు వారు తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారనే ప్రచారమూ సాగుతోంది.

దాతల ఆశయం నెరవేరి, ఈ భవనం నిరుపేద విద్యార్థులకు ఉపయోగపడుతుందా? లేక తిరిగి నిరుపయోగంగానే మిగిలిపోతుందా? అన్నది అధికారుల తదుపరి చర్యలపై ఆధారపడి ఉంది.

Latest News

గీ కుక్క-కోతిని సూసి నేర్సుకోవాలె!?|ADUGU TRENDS

కుక్క-కోతిలది పుట్టుకతోనే వైరం. వాటి స్వభావికం కూడా. కోతులను తరిమికొట్టడానికి కుక్కలను సాదుతరు. గాడాడ గా కుక్కలు, కోతులు కలిసి మెలిసి కూడా ఉంటయి. గట్లనే గా ఒడిశా రాష్ట్రం కలహండి జిల్ల కేంద్రం...

అన్నం అందనంత ఎత్తులో…|EDITORIAL

అన్నం పెట్టే బియ్యమే ఇప్పుడు సామాన్యుడికి భారంగా మారింది! బస్తా ధర రూ.2 వేలు దాటుతుంటే, పప్పులు, పంచదార ధరలూ మండిపోతున్నాయి. వర్షాభావం ప్రభావమా? వ్యాపారుల ధరల మాయాజాలమా? మార్కెట్‌పై నిఘా ఏదీ? మార్గం...

అక్టోబర్ 30, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పంచమి రాత్రి 11.37 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం మృగశిర పగలు 01.45 వరకు ఉపరి ఆరుద్ర యోగం శివ రాత్రి 02.04 వరకు ఉపరి సిద్ద కరణం కౌలవ పగలు 12.47 వరకు ఉపరి...

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

‘సర్’, ఏది సత్యం? ఏది అసత్యం!?|EDITORIAL

అంతిమంగా, ఓటర్ల జాబితా ప్రక్షాళన లక్ష్యం నకిలీ ఓట్లను తొలగించడమే కాదు. ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా కాపాడటం. అధికార పార్టీ రాజకీయ ఆరోపణలతో సమస్యను కొట్టిపారేయ కూడదు. ప్రతిపక్షాలు కూడా...

అక్టోబర్ 29, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి చవితి రాత్రి 01.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి పగలు 03.21 వరకు ఉపరి మృగశిర యోగం వరీయాన్ ఉదయం 08.14 వరకు ఉపరి పరిఘ కరణం బవ పగలు 03.05...

తబలా మీద.. తాళాలు!?|ADUGU TRENDS

పతిభకు ఆకాసం కూడా హద్దు కాదు. కళకు వయసుతో సంబంధం లేదు. సంకల్పముంటే సాధించలేనిదేదీ లేదు. ఏందీ గీ స్పూర్తి నీతి సూత్రాలనుకుంటాండ్రా? గి సిన్న పిల్ల ముందు గయన్నీ సిన్నబోయినయి మరి....

అమెరికాకు రాజకీయ సవాల్!|EDITORIAL

బ్రెజిల్ రాజకీయాల్లో మరోసారి లులా ప్రభంజనం! 80 ఏళ్ల వయసులోనూ హోరాహోరీ పోరులో విజయం సాధించి నాలుగోసారి అధ్యక్ష పీఠం దిశగా అడుగులు వేశారు. పేదల సంక్షేమమే అజెండాగా ముందుకు సాగిన ఆయనకు...

అక్టోబర్ 28, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి విదియ ఉదయం 06.19 వరకు ఉపరి తదియ నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యతీపాత ఉదయం 11.06 వరకు ఉపరి వరీయాన్ కరణం గరజి ఉదయం 06.19 వరకు ఉపరి...

గీ ఇలసే.. గా పులస!?|ADUGU TRENDS

శేపల్ల గీ శేపలకే మస్తు గిరాకీ. గందుకే పుస్తెలమ్మైనా గా పులసలు తినాలనే సామెత ఒచ్చింది. కనీ, గీ ఇలసలేందని అనుకుంటాండ్లా? గీ ఇలసలే తర్వాత పులసలైతయట.! గందుకే గీ సీజన్ల గీ...

ఆర్థిక సంక్షోభమేనా!?|EDITORIAL

వానలు ముఖం చాటేశాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. పంటలపై కరువు పంజా విసురుతోంది! మరోవైపు పెరుగుతున్న విద్యుత్ వ్యయం, సంక్షేమ పథకాల ఖర్చులు తెలంగాణ ఖజానాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతి దెబ్బకు ఆర్థిక...

అక్టోబర్ 27, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి ఉదయం 08.05 వరకు ఉపరి విదియ నక్షత్రం భరణి సాయంత్రం 06.03 వరకు ఉపరి కృత్తిక యోగం సిద్ది పగలు 01.50 వరకు ఉపరి వ్యతీపాత కరణం కౌలవ ఉదయం 08.05 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News