Monday, August 24, 2026
23.3 C
Hyderabad

శనివారం అక్టోబర్ 25 –2025|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరత్ ఋతువు
కార్తీక మాసం –శుక్లపక్షం
నాగుల చవితి
తిధి శు.చవితి రాత్రి 11.55 వరకు
ఉపరి పంచమి
నక్షత్రం జ్యేష్ఠ పూర్తిగా రోజంత
యోగం శోభ రాత్రి తెల్ల 03.40 వరకు
ఉపరి అతిగండ
కరణం వణజి పగలు 01.10 వరకు
ఉపరి బవ
వర్జ్యం పగలు 11.59 నుండి
01.45 వరకు
దుర్ముహూర్తం ఉదయం 06.10 నుండి
07.45 వరకు
రాహుకాలం ఉదయం 09.00 నుండి
10.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.10
సూర్యాస్తమయం సాయంత్రం 05.50

మేష రాశి
రాజకీయ రంగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. పై అధికారుల నుండి మెచ్చుకోలు పొందే రోజు. కార్యాలయంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం గమనించాలి, అధికం తినకూడదు.

వృషభ రాశి
ధన సంపాదనకు అనుకూలమైన రోజు. పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. విదేశీ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంతో సమయం గడపడం వలన మానసిక సంతృప్తి కలుగుతుంది.

మిధున రాశి
భాగస్వామ్య వ్యవహారాలలో లాభం ఉంది. పెళ్లి చేసుకునేవారికి మంచి రోజు. పనిలో కొంత ఒత్తిడి ఉండవచ్చు, కానీ దాన్ని ఎదుర్కోగలరు. ఆరోగ్యం మధ్యంతరంగా ఉంటుంది.

కర్కాటక రాశి
కార్యాలయంలో పని భారం ఎక్కువగా ఉండవచ్చు. సహోద్యోగులతో సహకరించి పని చేయడం మంచిది. ఆర్థిక పరిస్థితుల్లో మెరుగు దిశగా మార్పు కనిపిస్తుంది. సంతానం విషయంలో శుభ సమాచారం లభించవచ్చు.

సింహ రాశి
ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. సృజనాత్మక రంగంలో పని చేసేవారికి చాలా మంచి రోజు. ఆరోగ్యం కుదుటగా ఉంటుంది. కుటుంబంలో శుభకార్యం జరగడం వలన ఆనందం నెలకొన్తుంది.

కన్యా రాశి
కుటుంబం మరియు ఇల్లు సంబంధిత విషయాలపై శ్రద్ధ చూపాలి. ఆస్తి పెరుగుదలకు అనుకూలమైన సమయం. పూర్వపు పెట్టుబడుల నుండి లాభం వస్తుంది. మానసికంగా ప్రశాంతత అనుభవిస్తారు.

తుల రాశి
సమాచార మాధ్యమాలు మరియు ప్రయాణం సంబంధిత విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. చిన్న చిన్న వివాదాలు తలెత్తవచ్చు, జాగ్రత్త. నీటి స్రోతల నుండి లాభం ఉండవచ్చు. బంధువుల సహాయం లభిస్తుంది.

వృశ్చిక రాశి
ఆర్థిక పరిస్థితులు బాగున్నాయి, కానీ ఖర్చులు కూడా ఎక్కువ. పనిలో కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం. ప్రేమ జీవితంలో రోమాంచకరమైన అనుభవాలు ఉంటాయి. ఆత్మ విశ్వాసం మీరు గెలిపిస్తుంది.

ధనస్సు రాశి
మీ ఆలోచనలు మరియు వ్యక్తిత్వం మీరు గుర్తింపు పొందే రోజు. పని స్థలంలో ప్రశంసలు లభిస్తాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ వహించాలి. కుటుంబంతో వినోద యాత్రలో పాల్గొనడం వలన ఆనందం కలుగుతుంది.

మకర రాశి
గతంలో చేసిన ప్రయత్నాల ఫలితం ఈ రోజు లభించవచ్చు. రహస్య విషయాలపై జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆధ్యాత్మిక దిశగా ఆసక్తి పెరుగుతుంది.

కుంభ రాశి
స్నేహితుల సహకారం తో పనులు సాఫల్యం అవుతాయి. సామాజిక కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొనే అవకాశం ఉంది. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోండి. కుటుంబంలో సంతోషం నెలకొనే అవకాశం ఉంది.

మీన రాశి
వృత్తి రంగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారుల నుండి మద్దతు లభించే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి రోజు. కుటుంబ సభ్యులతో మంచి సంబంధాలు నెలకొంటాయి.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

ప్రియాంక-బెటర్ ఛాయిసేనా!?|EDITORIAL

కాంగ్రెస్ కు ‘ప్రియాంక బెటర్ ఛాయిసా?” అన్నదానికంటే ‘కాంగ్రెస్ మెరుగైన ప్రతిపక్షంగా ఎలా సాగాలి?’ అన్నదే ముఖ్యం. సభను సజీవంగా మార్చడం ద్వారా ప్రతిపక్షం బలపడుతుంది. ప్రభుత్వాన్ని విమర్శించడంతో పాటు ప్రత్యామ్నాయ విధానాన్ని...

ఆగస్టు 22, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి దశమి రాత్రి 01.18 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం జ్యేష్ఠ పగలు 03.33 వరకు ఉపరి మూల యోగం వైధృతి ఉదయం 07.15 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల పగలు 12.18 వరకు ఉపరి గరజి రాహుకాలం...

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన...

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News