Thursday, July 30, 2026
24.4 C
Hyderabad

Unexpected|ఊహించని Two States| ఇరు రాష్ట్రాల President|అధ్యక్షుల ఎంపిక|Selection

New| నూతన Presidents| అధ్యక్షులతో BJP| బీజేపీకి కలిసొచ్చేనా…

Eatala Rajender| ఈటెలకు ఊహించని దెబ్బ అంటూ … ప్రచారం

Telangana| తెలంగాణ ఆధ్యక్షుడి ఎంపికలో AP CM| ఏపీ సీఎం MARK| మార్క్ ఉందంటూ… మరో ప్రచారం |CAMPAIGN

అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ mla| ఎమ్మెల్యే రాజా సింగ్ |Raja Singh

Andhrapradesh| ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుల ఎంపికలో పార్టీ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఊహించిన పేరులకు భిన్నంగా, ఆశించని, ఊహించని అభ్యర్థులను ఎంపిక చేస్తూ నాయకత్వంలో కీలక మార్పులు చేసింది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్‌ను, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్. రామచందర్ రావును ఎంపిక చేసిన విధానం పార్టీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

ఏపీలో పీవీఎన్ మాధవ్ ఎంపికపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేసినా, ఆయనకు ఆరెస్సెస్‌తో బలమైన సంబంధాలు, పార్టీకి చేసిన సేవలు, రాజకీయ ప్రస్థానం, స్వచ్ఛమైన వ్యక్తిత్వం ఈ ఎంపికకు బలమైన కారణాలు అని తెలుస్తుంది. మాధవ్ బీసీ వర్గానికి చెందినవారు, పార్టీ బలం పెరిగి, అన్ని వర్గాల వారికి బీజేపీ సమ న్యాయం చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఆయన తండ్రి పీవీ చలపతి రావు కూడా గతంలో బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉండడం ఈ ఎంపికను మరింత బలపరిచింది. వైఎస్సార్‌సీపీ-టీడీపీ సమీకరణాల మధ్య బీజేపీని ఒక బలమైన పార్టీగా నిలిపేందుకు మాధవ్ లాంటి మృదువైన నేత అవసరమన్న అభిప్రాయం కార్యకర్తల్లో వ్యక్తమవుతుంది.

తెలంగాణలో మరింత ఆసక్తికరంగా నాయకత్వ మార్పు చోటు చేసుకుంది. ఈటల రాజేందర్, అరవింద్, డీకే అరుణ వంటి బలమైన నాయకుల్ని పక్కనపెట్టి సీనియర్ నేత రామచందర్ రావుకు అవకాశమివ్వడంపై పార్టీ వర్గాల్లో అనేక చర్చలు మొదలయ్యాయి. ఎబివిపి నుండి రాజకీయ జీవితాన్ని ప్రారంభించి, బీజేపీకి ఎనలేని సేవలందించిన ఆయన ఎన్నో బాధ్యతల్ని నిర్వర్తించారు. మృదుస్వభావంతో, అందరినీ కలుపుకుపోయే లక్షణంతో రామచందర్ రావు ఎంపిక పై ఆర్ఎస్ఎస్ స్థాయిలో ఆమోదం పొందినట్లుగా తెలుస్తోంది. పార్టీ నైతిక విలువలపై ఆయనకు ఉన్న నిబద్ధత, కార్యకర్తలతో ఉన్న అనుబంధం, రాష్ట్ర రాజకీయాలపై లోతైన అవగాహన ఆయన ఎంపికకు కారణం అని ఆ పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఏపీ సీఎం మార్క్ ఉందా?

అయితే ఈ ఎంపికపైమరో పెద్ద రాజకీయ అంశం చర్చనీయాంశమవుతోంది. రామచందర్ రావు ఎంపికపై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ప్రభావం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీలో ఆయనకు సన్నిహితుడిగా పేరున్న రామచందర్ రావును ఎంపిక చేయడం వెనక చంద్రబాబు పాత్ర ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇది ఈటల రాజేందర్‌కు భారీ ఎదురుదెబ్బగా భావిస్తున్నారు.

అధ్యక్షుల ఎంపికపై విరుచుకుపడ్డ ఎమ్మెల్యే రాజా సింగ్

ఈ విషయంపై ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర అధ్యక్షుడిని నావాడు, నీవాడు అంటూ ఎవరి సలహాలో వింటూ నియమించుకుంటే పార్టీ దెబ్బతింటుందని హెచ్చరించారు. బీజేపీలో నాయకుడిని బూత్ స్థాయి నుంచి ముఖ్య నాయకుడి వరకు ఓటేసి ఎన్నుకోవాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీ అధిష్ఠానం మాత్రం వ్యూహాత్మకంగా, అందరినీ సమన్వయపరచగల నేతలను ఎంపికచేసినట్లు సంకేతాలు పంపిస్తోంది.

https://youtu.be/Ijlzc2xlW3w?feature=shared

ఈ మార్పుతో బీజేపీలో కూడా మార్పు ప్రారంభమైందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఇది పార్టీకి కొత్త ఊపు ఇచ్చే అవకాశం అయినప్పటికీ, అసంతృప్తి వర్గాలను సర్దుబాటు చేస్తారా..లేదా… వివాదాలకు కారణం అవుతారా… అనేది భవిష్యత్ నిర్ణయించాల్సిందే.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News