Thursday, April 16, 2026
35.2 C
Hyderabad

హద్దు మీరితే అంతే!?

  • తొక్కాలని చూస్తే… తుక్కు తుక్కే!?

  • అమ్మాయే కదా..! అని అనుకోవద్దు!!

  • సాప్ట్ గా కనిపిస్తా… చూస్తూనే స్కాన్ చేస్తా!

  • పార్టీలో కోవర్టుల భరతం పడతా!

  • పార్టీ నాశనాన్ని కోరుకున్నోళ్ళకు ఇక వినాశనమే!

  • తక్కువ అంచనా వేశారో.. జాగ్రత్త!?

  • ఊరకనే ఎమ్మెల్యేను కాలే!

  • నాలోనూ పోరాట తత్వం ఉంది

  • అభివృద్ధిలో ముందే ఉంటా!

  • తేడా వస్తే తాట తీస్తా!

  • రాణీ రుద్రమలా రఫాడించిన పాలకుర్తి ఎమ్మెల్యే!

  • ఐలమ్మ స్ఫూర్తిగా అపర భద్రకాళి గా మారిన యశస్విని రెడ్డి

  • ఐలమ్మ మనుమడి సంస్మరణ సభలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వినీ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

పాలకుర్తి ఎమ్మెల్యేకు పూనకం వచ్చిందా? ఆమెను తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ పూనిందా? పోరాటాల పురిటి గడ్డపై ఆమెలో పోరాటతత్వం పురుడు పోసుకుందా? ఇన్నాళ్ళూ అణచి పెట్టుకున్న ఆవేశం కట్టలు తెంచుకుందా? సైలెన్స్ గా సాఫ్ట్ గా కనిపించే ఆమెలో ఒక్కసారిగా ఇంత వాయిలెన్స్ వాయిస్ ఎందుకు వచ్చింది? ఇంతకూ ఆమె ఎవరిని హెచ్చరించింది? సూటిగా తన రాజకీయ ప్రత్యర్థులనా? పార్టీలో కోవర్టులనా? పార్టీకి వెన్నుపోటు పొడుస్తూ నష్టం చేస్తున్న నాయకులనా? పార్టీ పుట్టీ ముంచుతున్న చిన్నా చితక లీడర్లనా? లేక నియోజకవర్గంలో పార్టీ పనైపోయిందంటూ ఇంటా బయటా జరుగుతున్న విష ప్రచారంతో విసిగిపోయి అసహనం వెల్లగక్కారా? కారణమేదైనా పాలకుర్తి ఎమ్మెల్యే శయస్వినీ రెడ్డికి మాత్రం కోపం వచ్చింది. ఆ కోపం కట్టలు తెంచుకుంది. గట్టిగా హెచ్చరిస్తూనే, గుట్టుగా అంతా కలిసి కట్టుగా పని చేద్దామని చెప్పింది. ఊరకనే ఎమ్మెల్యేను కాలే! నాలో కూడా పోరాట తత్వం ఉంది. దేనికీ వెనుకాడను. అభివృద్ధిలో ముందే ఉంటా! అని మక్తాయించింది. ఈ మొత్తానికి ఆత్మగౌరవ, ధిక్కార, ఉద్యమాల, సాయుధ పోరాటాల పతాక పాలకుర్తి వేదికైంది.

అవును. పాలకుర్తి నవ యువ శాసన సభ్యురాలు మామిడాల యశస్వినీ రాజారామ్ మోహన్ రెడ్డికి కోపం వచ్చింది. ‘హద్దులు మీరని’ ఆవేశంతో ‘ఎవరైనా సరే, హద్దు మీరొద్దు…’ అంటూ బుద్ధి చెప్పింది. ‘అపర కాళీనవుతా!’ అని హెచ్చరించింది. ‘పార్టీలో ఎవరు ఎవరినైనా తొక్కాలని చూస్తే… తుక్కు తుక్కే!’ చేస్తానని చెప్పింది. తనను ‘‘అమ్మాయే కదా..! అని అనుకోవద్దు!! సాప్ట్ గా కనిపిస్తా… చూస్తూనే స్కాన్ చేసేస్తా!’’ నని తనలోని సాఫ్ట్ నెస్ ని, ఫాస్ట్ నెస్ ని కలగలిపి తెలిపింది. ‘‘పార్టీలో కోవర్టుల భరతం పడతా! పార్టీ నాశనాన్ని కోరుకున్నోళ్ళకు ఇక వినాశనమే! మిగులుస్తా!’’నని, తనను ‘తక్కువ అంచనా వేశారో.. ఇగ మళ్ళ జాగ్రత్త!’ అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఏదో ‘‘నేను ఊరకనే ఎమ్మెల్యేను కాలేదు! నాలో కూడా పోరాట తత్వం ఉంది. దేనికి వెనుకకు పోను. అభివృద్ధిలోనూ ముందే ఉంటా! అందరం కలిసి కట్టుగా పని చేద్దాం, పార్టీని కాపాడుకుందాం. పాలకుర్తిని అభివృద్ధి చేసుకుందామ’’ని వివరించింది.

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చిట్యాల (చాకలి) అయిలమ్మ మనుమడు జనగామ జిల్లా పాలకుర్తి మాజీ సర్పంచ్ చిట్యాల రామచంద్రం దశదిన కర్మ సందర్భంగా శనివారం సంస్మరణ సభ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి వచ్చారు. ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన పార్టీ ఇన్ చార్జీ హనుమాండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్వినీ మాట్లాడుతూ, పై విధంగా స్పందించారు. ‘‘ఐలమ్మ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని చిట్యాల రామచంద్రం రాజకీయంగా పోరాటం చేస్తూనే, 20 ఏళ్లు సర్పంచ్ గా పని చేశారు. పాలకుర్తిని అభివృద్ధి చేశారు. మహానీయురాలు, పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ మనుమడు రామచంద్రం ఆకస్మికంగా మరణించడం బాధాకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.’’ అన్నారు.

‘‘ఐలమ్మ అంటే ఒక మన పాలకుర్తి నియోజకవర్గానికే కాదు. యావత్తు ప్రపంచానికి తెలిసిన గొప్ప యోధురాలు. చాకలి ఐలమ్మ అంటే తెలియని వారు లేరు. వారు పుట్టిన, పోరాడిన నేల పాలకుర్తి ప్రాంతానికి నేను ఎమ్మెల్యే గా గెలవడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను.’’ అని చెప్పారు. ‘‘ మరి అదే చాకలి ఐలమ్మ స్పూర్థితోటి ఈ రోజు చెప్తున్న. ఇదే పాలకుర్తి గడ్డ పోరాటాల అడ్డ. చాకలి ఐలమ్మ పోరాట మనస్తత్వంతో చెప్తున్న ఎవరైతే పార్టీని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారో…., ఎవరైతే ఒకరిని తొక్కి పైకి లేవాలని చూస్తున్నారో… వాళ్ళందరికీ అదే చాకలి ఐలమ్మ స్ఫూర్తితో సమాధానం చెప్తా…. అని గట్టిగా సవాల్ విసురుతున్నా…’’ అని హెచ్చరించారు. ‘‘ఎప్పుడైనా కలిసి వుంటే కలదు సుఖం. అందరూ కలిసి ఉండండి. అందరు మంచిగా వుండాలి అంతేగానీ ఒక్కరిని తొక్కితే బాగుపడతం అని అనుకునే వాళ్ళు ఎవరో ఏంటో మీది మీకే తెలుసు. కాబట్టి మీరే ఆలోచించుకోండి.’’ అని సుతిమెత్తగా మొత్తారు. ‘‘నాకు అన్నీ తెలుసు. నేను దానికి తగ్గట్టే చేస్తా.. మొన్న కూడా చెప్పిన… వయసులో చిన్నది అమ్మాయి అని అనుకోవద్దు.’’ అని సూచించారు. ‘‘ఇది చాకలి ఐలమ్మ పుట్టిన గడ్డ పోరాటాల అడ్డా మన పాలకుర్తి గడ్డ. ఇక్కడ..నేను ఊరుకనే ఎమ్మెల్యే కాలే.. నాలో కూడా పోరాటతత్వం ఉంది. ఏదో సాఫ్ట్ గా కనిపిస్తుంది కదా అమ్మాయి అని అనుకోవద్దు.. సందర్భం వస్తే ఆ సాఫ్ట్ కాస్త… ఈ అమ్మాయి ఎట్లుంటదో మీ అందరికీ చూపిస్తా..’’ అంటూ పార్టీ నేతలు, కార్యకర్తలకు సాఫ్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. ‘‘పాలకుర్తి నియోజకవర్గం, నిధులు, అభివృద్ధి విషయాల్లో ముందే వుంటా తప్ప వెనుకకు ఐతే పోను. తక్కువ అంచనా వేశారు అంటే ఇగ మళ్ళా మీ ఇష్టం. మీరే జాగ్రత్త! అని హెచ్చరించారు. ‘‘నేను చూడట్లె అని అనుకోవద్దు. ఇట్లా… చూసుకుంట చూసుకుంట పోతా… ఎవరు ఏందో స్కాన్ చేసుకుంటానే పోతా…’’ అని తానేంటో పార్టీ నేతలకు అర్థం చేశారు. ‘‘ఇక్కడ నిలుచుంటే ఒక ధైర్యం.. చాకలి ఐలమ్మ ఒక ఆదర్శం. చాకలి ఐలమ్మ వారసత్వం వారి కుటుంబ సభ్యులకే కాదు, మన రాష్ట్రానికి కూడా వుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి, హైదరాబాద్ కోఠీలో వున్న మహిళా కాలేజీ ని యూనివర్సిటీగా మార్చి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు.’’ అంటూ ఐలమ్మ పోరాట వారసత్వాన్ని కూడా వివరించారు. ఎమ్మెల్యే హెచ్చరికలు ఏ ఫలితాలను ఇస్తాయో కానీ, మొత్తానికి పాలకుర్తి ఎమ్మెల్యే వ్యాఖ్యలు మాత్రం సంచలనమయ్యాయి.

https://youtu.be/-TC-ScQ1OEo?feature=shared

Latest News

గిట్ల శేత్తే గా కుండల నీల్లు ప్రిజ్జంత సల్ల..గుంటయి!?|ADUGU TRENDS

పేదోల్ల అవ్వల్ దర్జా ప్రిజ్జి ఏందంటే? ఎవ్వలైనా ఏం శెప్తరు? మట్టి కుండ అంటరు! అవు మల్ల గీ నేల తల్లి, మన గా కుమ్మరన్నలు మనకిచ్చిన మట్టి కుండల నీల్లు పెయికి...

స్పష్టతలేని బిల్లులు సమస్యలకు హేతువులు!?|EDITORIAL

భారతదేశ ప్రజాస్వామ్య దశ, దిశను ప్రభావితం చేసే కీలక మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజనపై స్పష్టత అవసరం. ఈ రెండు అంశాల చుట్టూ ఉన్న అనుమానాలు, రాజకీయ వాదోపవాదాలు ప్రజల్లో గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి....

16-04-2026, గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ చతుర్దశి రాత్రి 07.01 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఉత్తరాభాద్ర మధ్యాహ్నం 12.45 వరకు ఉపరి రేవతి యోగం ఐంద్ర ఉదయం 09.35 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం...

వాడి పడేసిన డబ్బల్ని వాడే ఇకమతు!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! ఉపాయం ఉంటే ఊరేగొచ్చట!! వాడి పడేసే డబ్బాల్ని గిట్ల వాడే ఇకమతు శేస్తున్న గీ అక్క ఉపాయం సూత్తే మీరే పరేషాన్ అయితరు! మనం పండ్లు కొంటే గ...

శాంతి చర్చలు-సజీవంగా ఆశలు!?|EDITORIAL

ప్రపంచంలో యుద్ధోన్మాద ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి. పశ్చిమాసియా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అమెరికా–ఇరాన్ మధ్య చర్చలు విఫలమవడం, ఇజ్రాయెల్ పాత్ర, చమురు సరఫరాలో ప్రతిష్టంభన, అంతరాయం ప్రపంచాన్ని అస్థిరత వైపు నెడుతున్నాయి. శాంతి...

15-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ త్రయోదశి రాత్రి 08.17 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం పూర్వాభాద్ర మధ్యాహ్నం 01.10 వరకు ఉత్తరాభాద్ర యోగం బ్రహ్మ ఉదయం 11.27 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం 08.41 వరకు ఉపరి...

బియ్యప్పిండితోనే ముగ్గులు!?|ADUGU TRENDS

ముగ్గంటే. ముగ్గే! మన జీవన పరంపరంలో నేటికీ కొనసాగుతున్నది. ఇల్లలికి ముగ్గులు పెట్టేది. ఇంటి ముందు, వాకిలిల. పూజలు శేసే దేవుని అర్రల్ల మన ఆడోల్లు యేసే ముగ్గులు ఆ ఇంటికే అందం....

అంబేద్కర్ అందరివాడు!|EDITORIAL

పాలకులు, ప్రజలు అంబేద్కర్ ఆశయాలను, సామాజిక న్యాయం, సమానత్వం, మానవ హక్కుల పరిరక్షణలో అనుసరించాలి. రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, ఆయన సిద్ధాంతాలను కార్యరూపంలోకి తీసుకురావడం ముఖ్యం.అంబేద్కర్ ఒక వ్యక్తి కాదు శక్తి....

14-04-2026, మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి రాత్రి 09.05 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శతభిషం మధ్యాహ్నం 01.08 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శుక్ల మధ్యాహ్నం 01.02 వరకు ఉపరి బ్రహ్మ కరణం కౌలవ ఉదయం 09.15...

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News