Sunday, September 13, 2026
29.2 C
Hyderabad

బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు బిజెపి గాలం!?

కమలంలో కథనోత్సాహం-1

రకరకాల ఎరలతో కమలనాథుల బేరం?!

ఆశల పల్లకీలో పదవుల పందేరం!?

ఆ వెంటే ఇంటలీజెన్స్ ఆరా?!

ఖంగు తింటున్న ఇరు పార్టీల నేతలు!?

అధికారానికి అడ్డదారులు, నిలువు దారులు అంటూ ఏవీ లేవు. అడ్డమైన దారుల్లో కూడా అధికారం దక్కించుకోవచ్చని ఈ మధ్య అనేక దృష్టాంతాలు నిరూపిస్తున్నాయి. అదే కోవలో ఆరు నూరైనా, నూరు ఆరైనా సరే, తెలంగాణలో వెంటనే అధికారంలోకి రావాలనే ఆతృత బీజేపీలో కొట్టొస్తున్నది. అందుకు బిజెపి అన్ని పావులూ కదుపుతున్నది. ఇందుకనుగుణంగానే కమలనాథుల మాటలు, చేతలు ఉంటున్నాయి.

మొన్నా మధ్య బిజెపికి చెందిన ఓ బడా నేత నేరుగా ఓ ఎమ్మెల్యేకు ఫోన్ చేశాడు. ‘‘మీరు బిజెపిలోకి వస్తే, మీరు కోరుకున్నది ఇస్తామన్నాడా నేత. పనిలో పనిగా ఏమిస్తారని ప్రశ్నించాడా ఎమ్మెల్యే. తిరిగి అదే లేదా కోరుకున్న నియోజకవర్గం నుంచి బిజెపి టికెట్ పై పోటీ చేసే అవకాశం ఇవ్వడంతోపాటు, తప్పకుండా గెలిపించుకుంటామని, గెలిచాక తెలంగాణలో అధికారంలోకి వస్తే మంత్రి పదవి కూడా ఇస్తామని హామీ ఇచ్చాడు. ఇలా ఈ ఫోన్ మాట్లాడిన కొద్ది సేపటికే, మరోసారి ఫోన్ మోగింది. మీకు బిజెపి నుంచి ఎవరైనా ఫోన్ చేశారా? ఫలానా నేత నుంచే ఆ కాల్ వచ్చిందా? ఏం మాట్లాడారు? మీరేమన్నారు?’’ వంటి ప్రశ్నల వర్షం కురిసింది. ఎవరాని ఆరా తీస్తే… అదికాస్తా ఇంటలీజెన్స్ ఆరా! అని తెలిసిపోయింది. ఖంగు తినడం ఆ ఎమ్మెల్యే వంతైంది!

“భవిష్యత్తులో బి ఆర్ ఎస్ అధికారంలోకి వచ్చేది లేదు చచ్చేది లేదు. ఆ వచ్చేదేదో మా పార్టీలోకి వచ్చేయ్! నీ భవిష్యత్త మా బాధ్యత”

‘‘అసంతృప్త నేతగా పేరున్న ఓ కాంగ్రెస్ నేతకు ఫోన్ వచ్చింది. మీ నియోజకవర్గం నుంచి నీకు బిజెపి టికెట్ ఇస్తాం. పోటీ చేస్తారా? అందుకు ఏం కావాలని ప్రశ్నలు. అంతా మేమే చూసుకుంటామని హామీలు..’’

‘‘నెక్ట్స్ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా, నీవే మా అభ్యర్థివి. నీకు టికెట్ పూచీ నాది. నిలిచే బాధ్యత నీది. గెలిచే బాధ్యత మాది. ఏమంటావు?’’ వెంటనే ఇంటలీజెన్స్ ఆరాలు… షరా మామూలే!!

ఇవి మచ్చుకు ఒకటి రెండు ఘటనలు. ఇలా ఇటీవలి కాలంలో ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలో బిఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు, బిఆర్ఎస్, కాంగ్రెస్ అసంతృప్త నేతలకు ఫోన్లు వెళ్ళాయి. కొందరు నేతలు ఇదే పనిగా ఫోన్లు చేస్తున్నట్లుగా ఇంటలిజెన్స్ ఆరా లో తేలినట్లు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బి ఆర్ ఎస్, కాంగ్రెస్ నేతలు ఉన్నారు.

ఇవి బిజెపి నేతల చేతల్లా కనిపిస్తుంటే, ఇందుకనుగుణంగానే ఈ మధ్య కమలనాథుల మాటలు ఉంటున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ‘‘తుమ్మితే ఊడిపోయే కాంగ్రెస్’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. మరో కేంద్ర మంత్రి బండి సంజయ్ సైతం మంచిర్యాలలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణలో కాంగ్రెస్ మరో ఐదారు నెలలు మాత్రమే అధికారంలో ఉంటుందని జోస్యం చెప్పారు. అంతటితో ఆగకుండా, ఆ తర్వాత బిజెపి అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ కి బి ఆర్ ఎస్ ఏటీఎం లా మారిందని ఆరోపించారు. సునిశిత రాజకీయ పండితుల పరిశీలన ప్రకారం పొంతన, పొలిక కుదురి, ఒకదానికి ఒకటి మ్యాచ్ అవుతున్న ఈ మాటల, చేతల సారాంశం ఏంటి? సంకేతాలేంటి?

బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి రోజుల్లో కూడా.. ఇలాంటి ఒక టోకు బేరాన్ని ఆరా తీసి, రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని, బట్టబయలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఆ సమయంలో బిజెపి జాతీయ నేతలపై రాష్ట్ర స్థాయిలో కేసులవడం మనమంతా చూశాం. కానీ ఈ సారి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎప్పటికప్పుడు అలాంటి ప్రయత్నాలను తిప్పికొడుతున్నట్లుగా కనిపిస్తున్నది. పొంచి ఉన్న ఉపద్రవాన్ని, ఊపందుకోక ముందే తుంచి వేస్తున్నది. మరోవైపు పార్టీ మారిన తమ నేతలపై అనర్హత వేటు కోసం పోరాడుతున్న బిఆర్ఎస్, పార్టీ ఫిరాయింపులపై చాలా సీరియస్ గానే ఉంది. పార్టీ ఫిరాయింపుల ప్రస్తుత పరిణామాలు కూడా ఎమ్మెల్యేలకు పాలుపోని విధంగా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఇటీవలి ఢిల్లీ ఎన్నికల గెలుపు తర్వాత కమలంలో నూతన కథనోత్సాహం వెల్లివిరుస్తున్నది. వరసగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపి, 27 ఏళ్ళ తర్వాత ఢిల్లీ పీఠం దక్కించుకుంది. ఇక ఇప్పుడు ఎంతో కాలంగా ఊరిస్తున్న, ఇప్పటిదాకా దక్కని తెలంగాణ ఫీఠంపై బిజెపి కన్నేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని తమకు అనుకూలంగా మలచుకోవడంపై బిజెపి దృష్టి సారించింది. తెలంగాణ తెచ్చిందే మేమన్న బిఆర్ఎస్ జనాగ్రహంతో బురిడీ కొట్టింది. తెలంగాణ ఇచ్చిందే మేమన్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది తిరగకముందే ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకుంటున్నది. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రావడానికి కారణమైన మేం అధికారంలోకి కూడా వస్తామన్న పట్టుదలతో బిజెపి ఉంది. అందుకే అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తన్నదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ బిజెపి నేత ‘‘అడుగు’’కు చెప్పారు.

రాజనీతిలోనే కాదు రాజకీయాల్లోనూ విలువలు పడి పోతున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు సైతం పార్టీ ఏదైనా ఫర్వాలేదు, పదవి దక్కితే చాలన్నట్లుగానే ఉన్నారు. రాజకీయ నేతల స్వార్థం, రాజకీయ పార్టీలకు వరంగా మారుతున్నది. పదవుల ఆశల పల్లకీలో ఉన్న రాజకీయ నేతలు, పదవుల కోసం పెదవులు మూసుకొని, పార్టీలు మారడానికీ సిద్ధంగా ఉన్నారు. దీంతో రకరకాల పదవుల ఎరతో పార్టీలు కూడా సంసిద్ధంగా ఉంటున్నాయి. ఇందుకు అనుగుణంగానే బిజెపి సంస్థాగతంగా బలపడుతూనే, చాప కింద నీరులా ఒక వైపు తమ శక్తి యుక్తులను ధారపోసి, గ్రౌండ్ వర్క్ చేస్తూనే, మరోవైపు మిగతా అన్ని రాజకీయ ప్రక్రియలను ప్రయోగిస్తున్నది.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News