పెరుగుదలతో వినియోగదారులకు షాక్
వివాహ, శుభకార్యాల సీజన్‌లో బంగారం ధరలు సామాన్య ప్రజలకు భారీ షాక్ ఇస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో పసిడి రేట్లు మరింత పెరిగి ఆల్‌టైమ్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹79,800కు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర ఒక్కరోజులోనే ₹390 పెరిగి తొలిసారి ₹87,060ను తాకింది. అయితే, వెండి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 1 కేజీ వెండి రేటు ₹1,07,000గా ఉంది. పెరుగుతున్న బంగారం ధరల నేపథ్యంలో వినియోగదారులు ఖరీదైన బంగారం కొనుగోళ్లను తగ్గించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

