తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం తెలుసు కదా? మన దేశం, రాస్ట్రం, యిదేశాల్లో కూడా గిసొంటి ముచ్చట ఉంది. గట్ల పెట్టిన పేర్లే గీ ఫణి, యాస్, తిత్లీ (సీతాకోకచిలుక), వర్ష, బర్షా, పవన్, బతాసి (గాలి) అసొంటి పేర్లెన్నో ఉన్నయి.

1979ల స్కైలాబ్ పడింది. గప్పుడు కూడా పుట్టిన గా పిల్లగాండ్లకు గా పేర్లే పెట్టిండ్రు. ఇగిప్పుడు అర్ణబ్ తుఫాన్ ఒచ్చింది గద. ఇగిప్పుడు కూడ పుట్టిన ఓ బిడ్డకు గా పేరే పెట్టిండ్రు గా తల్లిదండ్రులు.
అక్టోబర్ 2026 ల ఆంధ్రప్రదేస్, ఒడిశా తీరాలను ‘అర్ణబ్ తుఫాన్’ తాకింది. మస్తు గాలులు, వానలు పడి వదరల్ల జనం కొట్టుకపోతాండ్రు. ఇగో గిప్పుడు ఒడిశా గంజాం జిల్లాల ఓ మగబిడ్డ పుట్టిండు. ఇగ గా పొల్లగానికి అర్ణబ్ అని పేరు పెట్టిండ్రు. ఇగ అర్ణబ్ అంటే బెంగాలీ బాసల సముద్రం అని అర్థం. ఎట్టున్నయి గీ పేర్లు?

