Thursday, October 29, 2026
29.3 C
Hyderabad

‘సర్’, ఏది సత్యం? ఏది అసత్యం!?|EDITORIAL

అంతిమంగా, ఓటర్ల జాబితా ప్రక్షాళన లక్ష్యం నకిలీ ఓట్లను తొలగించడమే కాదు. ఒక్క అర్హుడి ఓటు కూడా కోల్పోకుండా కాపాడటం. అధికార పార్టీ రాజకీయ ఆరోపణలతో సమస్యను కొట్టిపారేయ కూడదు. ప్రతిపక్షాలు కూడా ఆధారరహిత ప్రచారానికి దిగకూడదు. పారదర్శక గణాంకాలు, స్వతంత్ర పరిశీలన, న్యాయపరమైన సమీక్ష, బాధితులకు సత్వర న్యాయం.. ఇవే ఈ వివాదానికి సరైన పరిష్కారం. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ఏ పార్టీదీ కాదు. ఓటరు విశ్వాసానిదే కావాలి.!

మార్గం – అడుగు, ఎడిటోరియల్

ప్రజాస్వామ్యంలో ఎన్నికల విశ్వసనీయతకు ఓటర్ల జాబితా గీటురాయి. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించడంతోపాటు, మరణించినవారి, ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదైన, అనర్హమైన ఓట్ల నమోదులను తొలగించడం కూడా ఎన్నికల సంఘం బాధ్యతే. ఈ లక్ష్యంతో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌–ఎస్‌ఐఆర్‌) ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వివాదానికి దారితీసింది. అయితే, ఈ వ్యవహారాన్ని అధికార, ప్రతిపక్షాల రాజకీయ వాదనలతో కాకుండా వాస్తవాలు, గణాంకాలు, చట్టపరమైన నిబంధనల ఆధారంగా పరిశీలించాలి.

భారత రాజ్యాంగంలోని 324వ అధికరణం, ప్రజాప్రాతినిధ్య చట్టం–1950లోని 21వ విభాగం ఎన్నికల సంఘానికి ఓటర్ల జాబితాల సవరణకు అధికారాన్ని కల్పిస్తున్నాయి. బిహార్‌లో నిర్వహించిన ఎస్‌ఐఆర్‌ చట్టబద్ధతను సుప్రీంకోర్టు 2026 మే 27న సమర్థించింది. అయితే, అందువల్ల ఈ ప్రక్రియ లోపరహితమని, ఓటర్ల తొలగింపుపై వచ్చే ప్రతి అభ్యంతరమూ నిరాధారమని భావించలేం. చట్టబద్ధతకు న్యాయస్థానం మద్దతు ఇవ్వడం ఒక అంశమైతే, క్షేత్రస్థాయిలో అమలు నిష్పాక్షికంగా సాగిందా? లేదా? అన్నది మరో అంశం.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో మొత్తం ఓటర్ల వివరాలను పరిశీలించడం, నివాస మార్పులు, మరణాలు, నకిలీ లేదా పునరావృత నమోదులను గుర్తించడం ప్రధాన లక్ష్యాలు. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్‌లో 2025 అక్టోబరు 27 నాటికి 15.44 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య, ముసాయిదా జాబితా విడుదలయ్యేసరికి 12.56 కోట్లకు తగ్గింది. అంటే, 2.89 కోట్ల పేర్లు ముసాయిదా జాబితాలో చోటు పొందలేదు. వీరిలో 46.23 లక్షల మంది మరణించినవారిగా, 2.17 కోట్ల మంది శాశ్వతంగా నివాసం మారినవారిగా, 25.46 లక్షల మంది ఒకటికంటే ఎక్కువ చోట్ల నమోదైనవారిగా గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ గణాంకాలు జాబితా సవరణ అవసరాన్ని సూచిస్తున్నప్పటికీ, తొలగించబడిన ప్రతి పేరు అనర్హుడిదేనని చెప్పడమే కష్టం.

ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేయడం ఎంత అవసరమో, అర్హులైన పౌరుల పేర్లు పొరపాటున తొలగిపోకుండా చూడటం కూడా అంతే ముఖ్యం. వలసలు, ఉపాధి కోసం తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లడం, నోటీసులు అందకపోవడం, పత్రాల సేకరణలో ఇబ్బందులు వంటి కారణాలతో నిజమైన ఓటర్లు జాబితా వెలుపల ఉండిపోయే ప్రమాదం ఉంది. అందుకే ముసాయిదా జాబితాల ప్రచురణ, అభ్యంతరాల స్వీకరణ, సవరణలకు అవకాశం, అప్పీళ్ల ప్రక్రియ కేవలం లాంఛంగా కాకుండా సమర్థంగా అమలు కావాలి.

2026 అక్టోబరు 28న ఢిల్లీ ఎస్‌ఐఆర్‌పై విచారణ సందర్భంగా, ఓటర్లను తొలగించేందుకు ఉపయోగిస్తున్న ‘లాజికల్‌ డిస్‌క్రెపెన్సీ’ ప్రమాణం చట్టబద్ధతను సుప్రీంకోర్టు ఇంకా తేల్చలేదని స్పష్టం చేసింది. బిహార్‌ ఎస్‌ఐఆర్‌కు సంబంధించిన తీర్పు ఈ అంశాన్ని పరిష్కరించలేదని కూడా పేర్కొంది. అంటే, ఎస్‌ఐఆర్‌ మొత్తాన్ని చట్టవిరుద్ధమని కొట్టిపారేయడం సరికాదు. అదే సమయంలో ప్రతి అమలు విధానానికీ న్యాయపరమైన ఆమోదం లభించిందని చెప్పడమూ సరికాదు.

కాంగ్రెస్‌, ఇండియా కూటమి ఓటర్ల తొలగింపుపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు ఆధారాలతో సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎన్నికల సంఘంపై ఉంది. అలాగే ప్రతిపక్షాలు కూడా అక్రమ తొలగింపులు జరిగాయని ఆరోపిస్తే, నిర్దిష్ట నియోజకవర్గాలు, ఓటర్ల వివరాలు, పత్రాలతో తమ వాదనను బలంగా వినిపించాలి. ఎన్నికల సంఘాన్ని విమర్శించినవాళ్ళంతా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమైనట్లు కాదు. ఆధారాలు లేకుండా రాజ్యాంగ సంస్థలపై ఆరోపణలు చేయడం కూడా సమర్థనీయం కాదు.
మరణించినవారి పేర్లు తొలగించడం, కొత్త ఓటర్లను చేర్చడం వంటి చర్యలకు సంబంధించిన గణాంకాలను రాష్ట్రాలవారీగా, తొలగింపుల కారణాలవారీగా బహిరంగపరచాలి. రాజకీయ పార్టీల బూత్‌ స్థాయి ప్రతినిధులకు పరిశీలనకు అవకాశం కల్పించాలి. పేరు తొలగించబడిన ప్రతి అర్హుడికి సులభమైన పునఃనమోదు, ఫిర్యాదు, అప్పీల్‌ మార్గాలు అందుబాటులో ఉండాలి.

అంతిమంగా, ఓటర్ల జాబితా ప్రక్షాళన లక్ష్యం నకిలీ ఓట్లను తొలగించడమే కాదు. ఒక్క అర్హుడి ఓటు కూడా కాపాడటం. అధికార పార్టీ రాజకీయ ఆరోపణలతో సమస్యను కొట్టిపారేయకూడదు. ప్రతిపక్షాలు కూడా ఆధారరహిత ప్రచారానికి దిగకూడదు. పారదర్శక గణాంకాలు, స్వతంత్ర పరిశీలన, న్యాయపరమైన సమీక్ష, బాధితులకు సత్వర న్యాయం ఇవే ఈ వివాదానికి సరైన పరిష్కారం. ప్రజాస్వామ్యంలో అంతిమ విజయం ఏ పార్టీదీ కాదు. ఓటరు విశ్వాసానిదే కావాలి.

Latest News

తుఫాన్లే.. గి పొల్లగాండ్ల పేర్లు!?|ADUGU TRENDS

తుఫాన్లు, వరదలు, భూకంపాలు పకృతి వైపరీత్యాలప్పుడు పుట్టిన పిల్లలకు, గా కట్టాలను తట్టుకుని బతికి బట్టకట్టినందుకు గురుతుగనో లేకపోతే, గా ఘటనల జ్ఞాపకార్థమో గనీ, గా తల్లిదండ్రులు గా తుఫాన్ల పేర్లను పెట్టడం...

అక్టోబర్ 29, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి చవితి రాత్రి 01.58 వరకు ఉపరి పంచమి నక్షత్రం రోహిణి పగలు 03.21 వరకు ఉపరి మృగశిర యోగం వరీయాన్ ఉదయం 08.14 వరకు ఉపరి పరిఘ కరణం బవ పగలు 03.05...

తబలా మీద.. తాళాలు!?|ADUGU TRENDS

పతిభకు ఆకాసం కూడా హద్దు కాదు. కళకు వయసుతో సంబంధం లేదు. సంకల్పముంటే సాధించలేనిదేదీ లేదు. ఏందీ గీ స్పూర్తి నీతి సూత్రాలనుకుంటాండ్రా? గి సిన్న పిల్ల ముందు గయన్నీ సిన్నబోయినయి మరి....

అమెరికాకు రాజకీయ సవాల్!|EDITORIAL

బ్రెజిల్ రాజకీయాల్లో మరోసారి లులా ప్రభంజనం! 80 ఏళ్ల వయసులోనూ హోరాహోరీ పోరులో విజయం సాధించి నాలుగోసారి అధ్యక్ష పీఠం దిశగా అడుగులు వేశారు. పేదల సంక్షేమమే అజెండాగా ముందుకు సాగిన ఆయనకు...

అక్టోబర్ 28, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి విదియ ఉదయం 06.19 వరకు ఉపరి తదియ నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యతీపాత ఉదయం 11.06 వరకు ఉపరి వరీయాన్ కరణం గరజి ఉదయం 06.19 వరకు ఉపరి...

గీ ఇలసే.. గా పులస!?|ADUGU TRENDS

శేపల్ల గీ శేపలకే మస్తు గిరాకీ. గందుకే పుస్తెలమ్మైనా గా పులసలు తినాలనే సామెత ఒచ్చింది. కనీ, గీ ఇలసలేందని అనుకుంటాండ్లా? గీ ఇలసలే తర్వాత పులసలైతయట.! గందుకే గీ సీజన్ల గీ...

ఆర్థిక సంక్షోభమేనా!?|EDITORIAL

వానలు ముఖం చాటేశాయి.. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి.. పంటలపై కరువు పంజా విసురుతోంది! మరోవైపు పెరుగుతున్న విద్యుత్ వ్యయం, సంక్షేమ పథకాల ఖర్చులు తెలంగాణ ఖజానాపై ఒత్తిడి పెంచుతున్నాయి. ప్రకృతి దెబ్బకు ఆర్థిక...

అక్టోబర్ 27, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం కృష్ణపక్షం తిధి పాడ్యమి ఉదయం 08.05 వరకు ఉపరి విదియ నక్షత్రం భరణి సాయంత్రం 06.03 వరకు ఉపరి కృత్తిక యోగం సిద్ది పగలు 01.50 వరకు ఉపరి వ్యతీపాత కరణం కౌలవ ఉదయం 08.05 వరకు ఉపరి...

అక్టోబర్ 26, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి ఉదయం 09.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం అశ్విని రాత్రి 07.00 వరకు ఉపరి భరణి యోగం వజ్ర సాయంత్రం 04.15 వరకు ఉపరి సిద్ది కరణం బవ ఉదయం 09.35 వరకు ఉపరి...

మధ్యయుగ భారతదేశ చరిత్ర|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITVE EXAMS|SPECIAL

భారతదేశ చరిత్రలో మధ్య యుగాల దశ ఎంతో కీలకమైనది. దీనిని చీకటి యుగం అని కూడా అంటారు. ఈ కాలంలో అభివృద్ధి స్తంభించిపోయి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం పూర్తిగా నిలిచిపోయిందని చరిత్రకారులు...

తప్పించడమా? తప్పుకోవడమా?|INDIA|ELECTION COMMISSION

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదా!? భారత ప్రభుత్వం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నేరుగా తొలగించగలదా? అదంత సులభమా? సుప్రీం కోర్టు సీఈసీని తప్పుకోమనో, తప్పించమనో ప్రభుత్వాన్ని ఆదేశించగలదా? రాజకీయంగా కేంద్ర ప్రభుత్వమో...

తంతే రూపాల గుట్టల్ల..!?|ADUGU TRENDS

ఒక అవుడియా జీవితాన్నే మార్సేస్తే, మరి ఒక లక్కీ లాటరీ ఎంత మార్పు తేవాలె? ఎంతగా జీవితాన్ని మార్సేయాలె? ఒకటా, రెండా? లచ్చో, కోటో కూడా కాదాయె.! ఏకంగా 240 కోట్ల రూపాయెల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News