మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు… తప్పైందని ఓ శేతి సీటి కూడా రాసి పెట్టిండు.

గది రాజస్తాన్ ఝాలావాడ్ జిల్ల. బకానీ పోలీసు టేసన్ పరిధిల నర్సింగ్ గుడి ఉంది. గా గుడిల రెండున్నరేండ్ల కింద దొంగతనం జరిగింది. దేవుని నగలన్నీ పోయినయి. గప్పట్ల గా దొంగతనం మీద పోలీసులకు ఫిర్యాదులు కూడా శేసిండ్రు. కనీ, గా దేవుని సొమ్ము దొరకలే. గీ మద్దెల గా గుడిల మూటగ గా దోపిడీకి గురైన నగలన్నీ దొరికినయి. గా పక్కనే ఓ శీటి దొరికింది. గండ్ల… ‘నేను తప్పతాగిన మైకంల గా గుడిల దేవుడి నగలను ఎత్తుకపోయిన. దేవుడా శమించు.’ అని రాసి పెట్టి ఉంది. గంతే కాదుల్లా.. గా నగల మీద గవాటి మరమ్మతులకని కొంత నగదు కూడా పెట్టి ఉందట. గా మూటల గప్పట్ల పోయిన అన్ని నగలూ ఉన్నయట. భలే దొంగ.. ! గీ బూచోడు.. ఎంత మంచోడో కదా!?

