‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి.

ఇగో గీ ఉపాయం ఏడ సేసిండ్రో కనీ, గా నెట్టింట్ల పెట్టుట్ల గీ ఈడియ మస్తు వైరలైతాంది. ఒకాయినె ఒక అర్రల ఏసీ మిషిని పెట్టిండు. కనీ, గా ఎసీని రెండు అర్రలల్లకు వచ్చేటట్లు శేసిండు. గదెంట్లటే, గా సల్లదనాన్నిచ్చే ఏసీకి ఓ ఒంక పైపు పెట్టిండు. గా పైపులకు సల్ల గాలి తోలేటట్లు ఏసీ వైపు పైపులు అమర్సిండు. ఇగ గా పైపు ఇంకోవైపు ఓ వంక బెండు పెట్టి, గా గోడకు పొక్క కొట్టిండు. గండ్ల గూడ మంచిగ ఓ పైపు బిగిచ్చిండు. గంతే… ఏసీ ఆన్ శేసిండు. ఇగ గా ఏసీ సల్లదనం రెండు అర్రలకు పోబట్టే. ఒక్క ఏసీ రెండు అర్రలకన్నట్లు. బాగుంది కదా గీ ఇకమతు.!?

