కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి.

అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి ఖతమైతాందట. గదే కాదు గా శెవిల ఉండే అన్ని కరాబైపోతానయట. గంతే కాదు గా పోన్లను ఆడేటోల్లకు శెవుడు కూడ తొందరగనే వత్తాందట. యియర్ బడ్లు, యియర్ పోన్లను ఆడేటోల్లూ.. జెర జాగ్రత్త. అనేక పరిశోధనలు శేసినంకనే గిదీన్ని కనుక్కున్నరట.

