Sunday, September 13, 2026
26.2 C
Hyderabad

MAOIST HISTORY|మావోయిస్టు చరిత్రలో సంచలనం|SENSATIONAL

POLITBUREAU|పొలిట్ బ్యూరో సభ్యుడు|MEMBER మల్లోజుల వేణుగోపాల్ రావు|MALLOJULA VENUGOPAL RAO లొంగుబాటు

మావోయిస్టు ఉద్యమ చరిత్రలో సరికొత్త సంచలనం చోటుచేసుకుంది. సీపీఐ (మావోయిస్ట్) పొలిట్ బ్యూరో సభ్యుడు, అగ్రశ్రేణి నాయకుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ అభయ్, అలియాస్ సోనూ మంగళవారం మహారాష్ట్ర రాష్ట్రంలోని గడ్చిరోలి జిల్లాలోపోలీసు అధికారుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు ఉద్యమాన్ని సుదీర్ఘకాలం పాటు ముందుండి నడిపిన వేణుగోపాల్ రావు ఈ నిర్ణయంతో నక్సలిజం చరిత్రలో కీలక మలుపు తిరిగింది. ఆయనతో పాటు సుమారు 60 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు కూడా ఆయుధాలు వదిలి పోలీసుల ఎదుట లొంగిపోయారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ‘ఆపరేషన్ కగార్’ ప్రభావంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతా దళాలు ముమ్మర చర్యలు చేపట్టాయి. ఈ ఆపరేషన్‌లో వరుసగా ఎన్‌కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో వందలమంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో పలువురు సీనియర్ మావోయిస్టులు లొంగిపోవడానికి సిద్ధమవుతుండగా, వేణుగోపాల్ రావు తీసుకున్న ఈ నిర్ణయం మావోయిస్టు పార్టీలో పెద్ద సంచలనం రేపింది.

కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో పేద కుటుంబంలో జన్మించిన మల్లోజుల వేణుగోపాల్ రావు విద్యావంతుడైనప్పటికీ విప్లవ భావాలతో ఆకర్షితుడయ్యాడు. ఆయన అన్న మల్లోజుల కోటేశ్వర రావు అలియాస్ కిషన్‌జీ మావోయిస్టు ఉద్యమానికి అగ్రగామిగా పనిచేసి విప్లవ నాయకుడిగా గుర్తింపు పొందారు. కిషన్‌జీ 2011 నవంబర్ 24న పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మృతి చెందగా, ఆ ఘటన వేణుగోపాల్ జీవితంలో మలుపు తీసుకొచ్చింది. అన్న మరణం తర్వాత ఆయన పార్టీకి సీనియర్ వ్యూహకర్తగా ఎదిగారు. అదే సమయంలో ఆయన భార్య తారా కూడా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర పోషించగా, ఆమె అనంతరం మహారాష్ట్ర సీఎం ఎదుట లొంగిపోయింది. తారా గడ్చిరోలి ప్రాంతంలో మోస్ట్ వాంటెడ్ నక్సల్స్ జాబితాలో ఉన్నప్పటికీ, సదరు నిర్ణయం తీసుకోవడం ఊహించని పరిణామంగా మారింది.

మల్లోజుల వేణుగోపాల్ రావు మావోయిస్టు పార్టీకి పూర్వ పీపుల్స్ వార్ గ్రూప్ దశ నుంచి పనిచేశారు. భూపతి, సోనూ, మాస్టర్, అభయ్ వంటి పలు పేర్లతో ఆయన విప్లవ రంగంలో గుర్తింపు పొందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న దండకారణ్య ప్రత్యేక జోనల్ కమిటీకి ఆయన అధిపతిగా ఉన్నారు. పశ్చిమ కనుమల ప్రాంతం, గోవా నుంచి ఇడుక్కి వరకు వున్న ప్రాంతాల్లో మావోయిస్టు గెరిల్లా జోన్ ఏర్పాటు చేయటంలో ఆయన కీలక పాత్ర వహించారు. చెరుకూరి రాజ్‌కుమార్ (ఆజాద్) మరణం తరువాత సీపీఐ (మావోయిస్టు) అధికార ప్రతినిధిగా మల్లోజుల నియమితులయ్యారు. పార్టీ ప్రచార, ప్రచురణల విభాగ బాధ్యతలు కూడా ఆయన చేపట్టారు.

ఏప్రిల్ 2010లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని దంతెవాడ ఘటనలో 76 మంది సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ సిబ్బంది మరణానికి వెనుక మల్లోజుల వేణుగోపాల్ రావు పాత్ర ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానించాయి. ఆయనపై ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు భారీ రివార్డులు ప్రకటించాయి. అన్న కిషన్‌జీ మరణం తర్వాత పశ్చిమ బెంగాల్ లో లాల్గర్ ఉద్యమానికి నాయకత్వం వహించారు.

ఇటీవల మల్లోజుల పత్రికా ప్రకటన ద్వారా మావోయిస్టు మార్గం తప్పుడు దిశలో సాగుతోందని, తాము ఆయుధాలు వదిలిపెట్టేందుకు సిద్ధమని వెల్లడించారు. ఈ ప్రకటనకు దేశవ్యాప్తంగా ఉన్న పలువురు మావోయిస్టు నాయకులు మద్దతు తెలపడంతో చివరికి ఆయన గడ్చిరోలి పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు చరిత్రలో మరో నాందిగా మారుతుందని పోలీసులు భావిస్తున్నారు.

Latest News

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

గుప్తుల సమాజం|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|HISTORY

గుప్తుల సామ్రాజ్యం అనేక రాష్ట్రాలుగా విభజించబడింది. ఈ రాష్ట్రాలను భుక్తులు అని పిలిచేవారు. ఒక భుక్తి యొక్క ముఖ్య అధికారిని ఉపారిక అన్నారు. ఈ భుక్తులను విషయాలుగా (జిల్లాలుగా) విభజించారు. ఒక విషయం...

గీ ఊర్లల్ల యేడ సూసినా, యేడి నీల్లే!?|ADUGU TRENDS

గా ఊర్లల్ల భూమి కింద మంట పెట్టినట్లు... అదే పనిగ కట్టెలెగేస్తున్నట్లు... కరెంటుతో గీజరేసినట్లు... యేడి నీల్లు ఉబికి వత్తయి.! ఒకేళ వాన పడ్డా సరే, పెనం మీద నీల్లు పోసినట్లు భూమి...

ప్రపంచానికి బ్రిక్స్ సరికొత్త దశాదిశ!?|EDITORIAL

ఢిల్లీ సదస్సు బ్రిక్స్ కు కొత్త దిశను సూచిస్తోంది. ప్రపంచ పాలనలో సంస్కరణలు, గ్లోబల్ సౌత్‌కు గొంతుక, ఆర్థిక సంస్థల్లో సమాన ప్రాతినిధ్యం వంటి లక్ష్యాలు స్వాగతించదగినవే. అయితే, తీర్మానాల అమలే అసలు...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 13 నుండి సెప్టెంబర్ 19 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో పురోగతి కనిపిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం...

గీ బూచోడు, ఎంత మంచోడో!?|ADUGU TRENDS

మనుసుల్లో మంచి మనుసులున్నట్లే.. దొంగల్ల కూడ మంచి దొంగలుంటారని నిరూపించాడో దొంగ. తను దోసుకున్న దేవుడి నగలే కాదు, వాటిని మరమ్మతు సేయడానికి కొంత నగదు కూడా పెట్టి, దేవుడా శమించు... తప్పైందని...

వానల్లేక అన్నదాతల విలవిల!?|EDITORIAL

వర్షం పడటం ప్రకృతి చేతిలో ఉండొచ్చు. కానీ వర్షం పడకపోయినా రైతును కాపాడే వ్యవస్థను నిర్మించడం మాత్రం పాలకుల చేతుల్లోనే ఉంది. వరుణుడి కోసం ఎదురుచూస్తూ చేతులు ముడుచుకుంటే కరువు ముప్పు మరింత...

సెప్టెంబర్ 12, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 07.35 వరకు ఉపరి విదియ నక్షత్రం ఉత్తర పగలు 01.54 వరకు ఉపరి హస్త యోగం శుభ సాయంత్రం 05.12 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 07.35...

కోవా యినాయకుడు! లడ్డూ మండపం!?|ADUGU TRENDS

ఇగ యినాయక చవితి రానే వచ్చే! ఇగిప్పుడు యినాయకుల సీజన్ ఒచ్చింది. రకరకాల ఆకారాలల్ల యిగ్రహాలను తయారు శేసుడు. గవాటిని ఈధుల్ల పెట్టుడు. నవరాత్రులు పూజలు శేసుడు మామూలేనాయె. అయితే, గా యినాయకులను...

భారత అంతరిక్ష ఇరుసు ఇస్రో ప్రైవేటుపరమేనా!?|EDITORIAL

ఇస్రోను “ప్రైవేటు కంపెనీలతో పోటీ పడే సంస్థ”గా కాకుండా, దేశ అంతరిక్ష వ్యవస్థకు మూల స్తంభంగా చూడాలి. పరిశోధన, వ్యూహాత్మక మిషన్లు, కీలక సాంకేతికతలు, జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన కార్యకలాపాలు ఇస్రో ఆధ్వర్యంలోనే...

సెప్టెంబర్ 11,శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి అమావాస్య ఉదయం 08.35 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుబ్బ పగలు 02.08 వరకు ఉపరి ఉత్తర యోగం సాధ్య రాత్రి 06.54 వరకు ఉపరి శుభ కరణం నాగవ ఉదయం 08.35 వరకు ఉపరి కింస్తుంఘ్న రాహుకాలం...

గీ సర్, గా అన్నదమ్ముల్ని కలిపింది!?|ADUGU TRENDS

అవుమల్ల.. గది నిజమేనుల్లా... పత్యేక ఓట్ల సవరింపు (సర్) 35 ఏండ్ల కింద యిడిపోయిన అన్నదమ్ముల్ని కలిపింది. గదెట్లనో మీరే సదువుండ్రి. మన తెలంగాణ లెక్కనే గా పంజాబ్ ల సర్ సవరింపులు జరుగుతున్నయి....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News