Wednesday, August 26, 2026
27.2 C
Hyderabad

ఎదురీతే జీవితం.. ప్రభంజన్ ప్రస్థానం|PRABHANJAN YADAV

దివంగత ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పై గూడూరు వాస్తవ్యులు పాలడుగు రత్నాకర్ రావు రాసిన వ్యాసం 

ఎదురీతే జీవితం.. ప్రభంజన్ ప్రస్థానం

మా ఊరివ్యక్తి ఒకతను ఈరోజు ఉదయం ఫోన్ చేసి ప్రొఫెసర్ ప్రభంజన్ కుమార్ యాదవ్ గారు చనిపోయినట్లు చెప్పడంతో విషాదానికి గురైయ్యాను. 2024 సంవత్సరం చివరి నెల అనుకుంటా నేను మిత్రులు అనుముల ఎల్లయ్య గారితో కలసి “గూడూరు చరిత్ర” పుస్తకాన్ని అందించడానికి నారపల్లిలో ఉన్న ప్రభంజన్ కుమార్ గారి ఇంటికి వెళ్ళాము. మెయిన్ రోడ్డుకు సమీపంలోనే గ్రౌండ్ ఫ్లోర్ తో కలసి రెండు అంతస్థుల మేడ. కింది భాగంలో బహుజన మీడియా స్టూడియో రూమ్ ఉన్నట్లుంది. ఫస్టు ఫ్లోర్ లో తన నివాసం. ముందు హాల్లో లైబ్రరీ. తను ప్రచురించిన పుస్తకాలతోపాటు అనేక పుస్తకాలున్నవి. ఇంటిలో ఒంటరిగా ఉన్నట్లు కనిపించాడు. అప్పటికే అతని ఆరోగ్యం సరిగా లేనట్లు అనిపించింది. మాట లోగొంతులో నుండి వస్తున్నట్లుగా ఉంది. ఇక మేము వెళ్లిన పని గుర్తుంచుకొని, వెంట తీసుకువెళ్లిన శాలువ కప్పి, “గూడూరు చరిత్ర” పుస్తకం చేతిలో పెట్టి, తిరిగి వస్తున్నప్పుడు ‘రత్నాకర్ రావు గారు నా పుస్తకాల సెట్టు ఒకటి మీకు పంపిస్తానండి!’ అంటూ కింది వరకు వచ్చి మమ్మల్ని సాగనంపాడు. ఆరునెలలలోపే ఈ వార్త వినవలసి రావడం విచారం.

ఊరిలో నేను వ్యవహారం చేస్తున్న రోజుల్లో తను వాళ్ల ఇంటి ఆవరణ యందే సత్యశోధక విద్యాపీఠం ఏర్పాటు సందర్భంగా నన్ను అతిథిగా ఆహ్వానించాడు. ఉద్యోగ రీత్యా వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్నా, గూడూరుకు వచ్చినపుడు నన్ను వ్యక్తిగతంగా కలసి ఎన్నో విషయాలు చర్చిస్తుండే అతను, రచన ఇన్స్టిట్యూట్ లో డిప్లామా ఇన్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ కోర్సును నేను డిస్టెన్స్ లో చేస్తున్నపుడు సంబంధిత సబ్జెక్టులలో నాకెంతగానో సహకరించాడు. తను ఓయూలో ఎంసీజే చేసిన వ్యక్తిగా అతని అనుభవం నా కెంతగానో ఉపయోగ పడింది.

2017లో నా ఆర్టికల్ ఒకటి నమస్తే తెలంగాణ ఆదివారం అనుబంధంలో ప్రచురితం అయింది. అది చదివి ఫోన్లో అభినందించాడు నన్ను. 2022 జనవరి లో నా పుస్తకం “అక్షర పలకరింపులు” మేడిపల్లి మా మేనకోడలు లక్ష్మీశ్రీనివాస్ రావు గారి ఇంటిలో ఆవిష్కరణ సందర్భంగా ఆత్మీయ అతిథిగా పాల్గొన్నాడు. వివిధ పత్రికల్లో పనిచేసుకుంటూనే ఉన్నత విద్యలు అభ్యసించి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీసుకు ఎంపికై క్షేత్ర ప్రచారాధికారిగా పనిచేశాడు. ఆ తరువాత తెలంగాణ విశ్వవిద్యాలయం నందు ఆచార్యునిగా పనిచేస్తూ పదవీ విరమణ పొందాడు. అనేక పుస్తకాలు వెలువరించి రచయితగాను, పబ్లిషర్ గాను, వక్తగాను, జర్నలిస్టుగాను, పరిశోధకుడుగాను, సామాజిక ఉద్యమకారుడుగాను వివిధ వర్గాల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. గూడూరు గ్రామ విద్యాధికుల్లో ప్రభంజన్ కుమార్ గారిని, ఉన్నత స్థానంలో నిలిపిన వారి తల్లి, తండ్రి యాదనాల సోమయ్య-కొమురమ్మలు చిరస్మరణీయులు. జీవించిన కాలమంతా ప్రభంజనంగా వెలుగొందినాడు. ప్రభంజనుడికి అక్షర నివాళులు.

✍పాలడుగు రత్నాకర్ రావు

Latest News

పనికి ఫార్చునర్ కారులో సఫాయి!?|ADUGU TRENDS

రోజులు మస్తుగ మారిపోతున్నయి. పేదా బక్క, బిక్కిబీదా తేడా లేకుండా పోతాంది. ఎవ్వలైనా హమ్ కిసీ సే కం నహీ అంటాండ్రు. గట్లనే గా సఫాయి కూడా అంటా0డు. గా సఫాయి రోజూ...

ఆర్థిక యుద్ధం అణుబాంబు కన్నా డేంజర్!?|EDITORIAL

యుద్ధానికి ఆయుధాలు అవసరం. ఆర్థిక యుద్ధానికి ప్రపంచ సహకారం అవసరం. అమెరికా ఆ సహకారాన్ని ఎంతవరకు సాధించగలదన్నదే అసలు పరీక్ష. ఇరాన్‌ను బలహీనపరచాలన్న అమెరికా ప్రయత్నం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలహీనపరచకుండా జాగ్రత్తపడాల్సిన...

ఆగస్టు 26, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి త్రయోదశి ఉదయం 06.53 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం శ్రవణ రాత్రి 01.03 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సౌభాగ్య ఉదయం 09.20 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 06.53 వరకు ఉపరి గరజి రాహుకాలం...

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

వంటింట్లో మంట! తిరేదేలా తంటా?|EDITORIAL

ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య,...

ఆగస్టు 25, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు *శ్రావణమాసం* *శుక్లపక్షం* తిధి త్రయోదశి పూర్తిగా రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11.03 వరకు ఉపరి శ్రవణ యోగం ఆయుష్మాన్ ఉదయం 09.04 వరకు ఉపరి సౌభాగ్య కరణం కౌలవ సాయంత్రం 06.05 వరకు ఉపరి తైతుల రాహుకాలం పగలు 03.00...

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News