మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఆరెంజ్ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా తిరిగి విడుదలైంది. ఈ రీరిలీజ్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తోంది. థియేటర్లలో సందడి చేస్తూ, పాటలకు చిందేస్తూ అభిమానులు సినిమాను పెద్ద ఎత్తున ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై దర్శకుడు భాస్కర్ స్పందిస్తూ, “థియేటర్లను మ్యూజిక్ కన్సర్ట్‌లా మార్చేశారు. అందరికీ ధన్యవాదాలు!” అని ట్వీట్ చేశారు.

