Wednesday, June 17, 2026
37.1 C
Hyderabad

జనవరి 08 – 2025 బుధవారం

శ్రీ క్రోధినామ సంవత్సరం–దక్షిణాయనం
హేమంతఋతువు- పుష్యమాసం-శుక్లపక్షం
తిధి శు.నవమి పగలు 01.12 వరకు
ఉపరి దశమి
నక్షత్రం అశ్విని పగలు 02.25 వరకు
ఉపరి భరణి
యోగం సిద్ద రాత్రి 09.01 వరకు ఉపరి
సాధ్య
కరణం కౌలవ పగలు 02.20 వరకు ఉపరి
గరజి
వర్జ్యం ఉదయం 10.39 నుండి 12.08
వరకు
దుర్ముహూర్తం పగలు 11.36 నుండి
12.24 వరకు
రాహుకాలం పగలు 12.00 నుండి
01.30 వరకు
సూర్యోదయం ఉదయం 06.46
సూర్యాస్తమయం సాయంత్రం 05.53

జనవరి 08–2025 బుధవారం
నేటి రాశి ఫలితాలు

మేషం
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. బంధువర్గంతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆరోగ్య సమస్యలు భాదిస్తాయి. ఇంటాబయట ఊహించని సమస్యలు కలుగుతాయి.

వృషభం
నిరుద్యోగుల యత్నాలు సఫలమౌతాయి. మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు.

మిధునం
చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో వ్యవహారంలో మాటపట్టింపులు తప్పవు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.

కర్కాటకం
వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి. నూతన వాహన యోగం ఉన్నది. ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి.

సింహం
వ్యాపార, ఉద్యోగాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో కొద్దిపాటి ఆటంకాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్య
కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నూతన గృహ వాహన యోగం ఉన్నది. సమాజంలో విశేషమైన ఆదరణ పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి.

తుల
వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు. రాజకీయ ప్రముఖుల నుండి సమావేశాలలో ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.

వృశ్చికం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగయత్నాలు నత్తనడకన సాగుతాయి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ధనస్సు
వృత్తి, వ్యాపారాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసి రావు. సోదరులతో ఆస్తి విషయంలో స్వల్ప వివాదాలు ఉంటాయి. ఆలయ సందర్శనం చేసుకుంటారు.

మకరం
వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కుంభం
వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. చాలా కాలంగా పూర్తికాని పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందువినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరపు బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సంతాన విద్య ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

మీనం
పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు.

Dr. Mattagajam Nagaraju sharma
Dr. Mattagajam Nagaraju sharma
శ్రీ.మత్తగజం నాగరాజు శర్మ ఎం.ఏ జ్యోతిషం

Latest News

గోడలకంటే, గీ ఇకమతు మస్తుగుందే!|ADUGU TRENDS

ఇగిప్పుడు ఇండ్లు కట్టుడంటే గోడలే కాదుల్లా...! గోడల్లెక్కనే అద్దాలు పెట్టుడు, ఇనుప సువ్వలతోటి గ్రిల్స్ పెట్టుడు, రకరకాల డిజైన్లతోటి శేత్తాండ్రు. గోడలు మాత్రం పెడ్తలేరు. గవాటితోటి ఎల్తురుకు ఎల్తురు, గాలికి గాలి వత్తాంది....

పంటల సాగుకు శాశ్వత పరిష్కారమేది?!|EDITORIAL

వ్యవసాయం శాస్త్రీయ ప్రణాళిక, నాణ్యమైన ఇన్‌పుట్లు, సమర్థవంతమైన మార్కెటింగ్, ధరల భరోసా, ప్రభుత్వ మద్దతు అనే ఐదు అంశాలపై ఆధారపడి ఉంటుంది. ప్రతి ఖరీఫ్‌కు ముందు రైతులు విత్తనాలు, ఎరువులు, రుణాల కోసం...

జూన్ 17, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు తదియ రాత్రి 02.00 వరకు ఉపరి చవితి నక్షత్రం పునర్వసు సాయంత్రం 05.51 వరకు ఉపరి పుష్యమి యోగం వృద్ధి రాత్రి 01.35 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల మధ్యాహ్నం 03.06 వరకు...

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం...

జూన్ 16, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 06.37 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆరుద్ర రాత్రి 07.23 వరకు ఉపరి పునర్వసు యోగం గండ ఉదయం 07.29 వరకు ఉపరి వృద్ధి కరణం బవ ఉదయం 06.37...

జూన్ 15, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య ఉదయం 09.06 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మృగశిర రాత్రి 09.00 వరకు యోగం శూల ఉదయం 10.30 వరకు ఉపరి గండ కరణం నాగవ ఉదయం 09.06 వరకు ఉపరి...

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News