శేపల్ల గీ శేపలకే మస్తు గిరాకీ. గందుకే పుస్తెలమ్మైనా గా పులసలు తినాలనే సామెత ఒచ్చింది. కనీ, గీ ఇలసలేందని అనుకుంటాండ్లా? గీ ఇలసలే తర్వాత పులసలైతయట.! గందుకే గీ సీజన్ల గీ ఇలస శేపలకు కూడా మస్తు గిరాకీ ఉంటదట.

ఆంధ్రప్రదేస్ రాస్ట్రంల గా యు.కొత్తపల్లి మండలం ఉప్పాడ శేపల మార్కెట్ల ఆదివారం గీ ఇలసలు సందడి శేసినయి. ఒక్కో శేప ఎయ్యి రూపాలు పలికిందట. గీ ఇలస శేపలే సముద్రం నుంచి గోదావరి నదిలకు ఎదురీదుతూ పులసలుగ మారతయి. ఇలసగా ఉన్నప్పుడు యెయ్యి ఉన్న గివీటి ధర పులసగా మారినంక 20 యేలకు పైగా పలుకుతది. ఇగ కొందరైతే గీ ఇలసనే పులస అనుకొని కొంటరట. ఇలసో, పులసో గని మనమూ తిందామా?

