మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం పట్టుకోలేం. ముట్టుకోలేం. గిదేం ఇచ్చెంత్రం? అనుకుంటాండ్లా? సరే సూద్దాం పదండ్రి.
ఇంతకూ గదెక్కడంటే? గిదంతా గా యేరే గ్రహాల మీదన్నట్లు. మనకున్న యురేనస్, నెఫ్ట్యూన్ గ్రహాలల్ల గీ వాన పడ్తాందట. గా గ్రహాల మీద మనలెక్క మట్టీ, రాళ్లు, నీళ్లూ, శెట్లు శేమలుండవట. మిథేన్, నీరూ, అమోనియా అసొంటి వాయువులుంటయట. గయన్నీ కలిసుండుట్ల గదంతా మంచు రూపంల భయంకరంగా ఉంటదట. గా ఒత్తిడికే మిథేన్ ల ఉండే కార్బన్ అణువులు విడిపోయి, శిన్న శిన్న వజ్రాల రేణువులుగ మారుతయట. ఇగ గయ్యే మబ్బులుగ మారి, వ్రజాలుగ తయారై కింద పడ్తయట. మన దగ్గర రాల్ల వాన లెక్క.. వడగండ్ల వాన లెక్క వజ్రాలు పడ్తానయ్నట్లు. గిదంత కాదుకనీ, సూటి సెప్పాల్నంటే, గక్కడ మేఘాలు వజ్రాలు కురుస్తానయి. కాకపోతే, గాడికి మనమే కాదుల్లా. గా అంతరిక్ష నౌకలు గూడ పోవేలవట. గాడ గాలి పీఢనం, వాతావరణానికి ఏమాత్రం తట్టుకోలేక, గయి ముక్కలు శెక్కలై పోతయట. గిదంతా కలలా.. మాయ లెక్క ఉంది కదా? కాకపోతే నిజమేనుల్లా?

