Sunday, October 25, 2026
22.5 C
Hyderabad

వినాయక చవితి ఉత్సవాలకు ముస్తాబైన రెండు రాష్ట్రాలు|TELANGANA|AP

హైదరాబాద్ డెస్క్, ఆగస్టు 26 (అడుగు న్యూస్):
వినాయక చవితి ఉత్సవాలకు గణనాథుడు ముస్తాబయ్యాడు. రెండు రాష్ట్రాల్లో ప్రధాన నగరాల్లో, పలు పట్టణాల్లో, గ్రామాల్లో, గల్లీలో గణనాథులను ప్రతిష్టించి, పూజలు చేయనున్నారు. అందులో భాగంగా రాజస్థాన్‌ కళాకారులు పీవోపీ, తాటిపీచు, కొబ్బరిపీచుతో వివిధ ఆకృతులు, రంగుల్లో గణనాథులు, పర్యావరణ ప్రేమికులు మట్టితో విగ్రహాలను తయారుచేశారు. అడుగు ఎత్తు నుంచి 20 అడుగుల విగ్రహాలను గణేశ్‌ ఉత్సవ నిర్వాహకులు కొనుగోలు చేస్తున్నారు. విగ్రహాల ఎత్తును బట్టి వేల నుంచి లక్షల ధర పలుకుతోంది. ఇదిలా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఖైరతాబాద్ గణేష్ పూజలకు ముస్తాబయ్యాడు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా పలు చోట్ల భారీ విగ్రహాలు పూజలు అందుకొనున్నాయి.

పాలకుర్తిలో:
జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో మొట్ట మొదటి వినాయకుడిని ప్రతిష్టించి, నేటికి ఎన్నో ఏళ్లుగా నవరాత్రులు నిర్వహిస్తున్న క్రాంతి యూత్ ఈ సారి బాల గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేయనున్నట్లు బాధ్యులు తెలిపారు. అలాగే ఎంతో చరిత్ర కలిగిన గుడివాడ విఘ్నేశ్వర కమిటీ ప్రతి సంవత్సరం విఘ్నేశ్వరుడిని ప్రతిష్టించి,పూజిస్తూ, ఈ ఏడాది 50వ సంవత్సరంలోకి వస్తున్న సందర్భంగా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా గుడివాడ విఘ్నేశ్వర కమిటీ అధ్యక్షుడు చారగొండ్ల శివ & వారి బృందం రామకృష్ణ, రేపాల అశోక్, చాట శ్రీనివాస్ ఆధ్వర్యంలో పూర్తి హంగులతో పర్మినెంట్ మండపం నిర్మించి, గణేషుడిని ప్రతిష్టించి పూజలు చేయనున్నారు. ఈ ఉత్సవాలకు 15 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా అడుగుతో కమిటీ అధ్యక్షుడు శివ ఫోన్ లో మాట్లాడుతూ, ఈ సారి భారీ ఎత్తున, ఊహించని రీతిలో నవరాత్రులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సారి తమ కుటుంబమే దాతగా మట్టి గణపతిని ఇస్తున్నట్లు తెలిపారు.

గణనాథుని ప్రతిష్ఠకు పర్మినెంట్ పనులు
గుడివాడ విఘ్నేశ్వర కమిటీ ప్రతిష్టించనున్న మట్టి గణపతి
క్రాంతి యూత్ బాల గణేశుడు

నిబంధనలు పాటించాల్సిందే..

ఆహ్లాదకర వాతావరణంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించేందుకు నిర్వాహకులు కృషి చేయాలని డీజీపీ డా.జితేందర్ పిలుపునిచ్చారు. మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలు, భద్రతా అంశాలపై ఆయన సూచనలు చేశారు.

ఉత్సవాలకు అనుమతి తప్పనిసరి

వినాయక ఉత్సవ కమిటీలు మండపాల ఏర్పాటు, ఉత్సవాలకు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. గణేశ్‌ ఉత్సవ.నెట్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో అవసరమైన వివరాలను నింపాలి. దరఖాస్తును పరిశీలించిన తర్వాత పోలీసులు అనుమతిస్తారు.

విద్యుత్‌ జాగ్రత్తలు:
విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యుత్‌ వైరింగ్‌ను నిపుణులతో చేయించాలి.

సౌండ్‌ సిస్టమ్‌:
లౌడ్‌ స్పీకర్లను ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ఉపయోగించాలి. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాల వద్ద మైకులు వాడకూడదు.

నిఘా:
మండపాలలో రాత్రిపూట కమిటీ సభ్యులు కాపలా ఉండాలి. మండపాలలో విలువైన వస్తువులను ఉంచకూడదు. శాంతి భద్రతల కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి.

రోడ్డు భద్రత:
విగ్రహాలను, మండపాలను రోడ్లపై ఏర్పాటు చేయరాదు. బ్యానర్లు, ఫ్లెక్సీలు ప్రజలకు, ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు కలిగించకూడదు.

ఊరేగింపు, నిమజ్జనం నిబంధనలు

నినాదాలు, ప్రదర్శనలు:
ఊరేగింపు సమయంలో కులలాలు, మతాలు లేదా పార్టీలకు వ్యతిరేకంగా రెచ్చగొట్టే నినాదాలు, అనుచిత ప్రదర్శనలు, అసభ్యకరమైన నృత్యాలు చేయకూడదు. డీజే, బాణసంచాకు అనుమతి లేదు.

వాహనాల నియమాలు:
నిమజ్జనం వాహనాలకు లైసెన్స్‌ ఉన్న డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలి. మద్యం సేవించిన వారు లేదా మైనర్లు వాహనంపై ఉండకూడదు.

నిమజ్జన సమాచారం:
నిమజ్జనం మార్గం, సమయం, తేదీ వివరాలను పోలీసులకు తప్పనిసరిగా తెలియజేయాలి. నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా కమిటీ సభ్యులు తగినంత మంది వాలంటీర్లను ఏర్పాటు చేయాలి.

భద్రతా ఏర్పాట్లు:
నిమజ్జన ప్రదేశాల్లో గజ ఈతగాళ్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలి.

అవాంఛనీయ సంఘటన జరిగినా, జరగడానికి అవకాశం ఉన్నా వెంటనే సంబంధిత పోలీసు అధికారులకు లేదా డయల్‌ 112కు సమాచారం ఇవ్వాలి. నిబంధనలను ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటారు.

Latest News

మధ్యయుగ భారతదేశ చరిత్ర|HISTORY|ADUGU DIGITAL MEDIA|COMPITITVE EXAMS|SPECIAL

భారతదేశ చరిత్రలో మధ్య యుగాల దశ ఎంతో కీలకమైనది. దీనిని చీకటి యుగం అని కూడా అంటారు. ఈ కాలంలో అభివృద్ధి స్తంభించిపోయి, శాస్త్ర సాంకేతిక రంగాలలో పురోగమనం పూర్తిగా నిలిచిపోయిందని చరిత్రకారులు...

తప్పించడమా? తప్పుకోవడమా?|INDIA|ELECTION COMMISSION

సీఈసీని తొలగించడం అంత ఈజీ కాదా!? భారత ప్రభుత్వం ఛీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను నేరుగా తొలగించగలదా? అదంత సులభమా? సుప్రీం కోర్టు సీఈసీని తప్పుకోమనో, తప్పించమనో ప్రభుత్వాన్ని ఆదేశించగలదా? రాజకీయంగా కేంద్ర ప్రభుత్వమో...

తంతే రూపాల గుట్టల్ల..!?|ADUGU TRENDS

ఒక అవుడియా జీవితాన్నే మార్సేస్తే, మరి ఒక లక్కీ లాటరీ ఎంత మార్పు తేవాలె? ఎంతగా జీవితాన్ని మార్సేయాలె? ఒకటా, రెండా? లచ్చో, కోటో కూడా కాదాయె.! ఏకంగా 240 కోట్ల రూపాయెల...

అప్రమత్తతే అసలైన పరిష్కారం!?|EDITORIAL

ఎల్‌నినో ప్రభావం ఎంతకాలం కొనసాగుతుందన్నది నిరంతరం మారే అంచనాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల అధికారిక సూచనలను క్రమం తప్పకుండా పరిశీలించాలి. ప్రకృతిని నియంత్రించలేకపోయినా, నీటిని పొదుపు చేయడం, ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, వ్యవసాయాన్ని ముందస్తుగా...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 25 నుండి అక్టోబర్ 31 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం, పనులను వేగంగా పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభను నిరూపించుకునే అవకాశం...

ముసలోనితోటి నిచ్చితార్థం! పెనిమిటి కోసం రద్దు!?|ADUGU TRENDS

గీ మద్దెల మనుసులు యేగంగా మారుతాండ్రు. సోసల్ మీడియ చెలరేగుతాంది. ఇగ మనుసులు ఎంతకైనా దిగజారుతాండ్రు. ఇగెంతకైనా ఎగబాకుతాండ్రు. సబ్ స్క్రైబర్లు, లైకులు, శేర్ల కోసం సిగ్గు శెరం లేని పనులు కూడా...

గాలి కాదు.. గరళం!|EDITORIAL

ఊపిరి పోసే గాలే ఇప్పుడు ప్రాణాలు తీసే విషంగా మారుతోంది! హైదరాబాద్‌లో పీఎం-10 స్థాయులు జాతీయ ప్రమాణాలను 33.3 శాతం మించగా, సంగారెడ్డి, నల్గొండల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దిల్లీలోనూ గాలి నాణ్యత...

అక్టోబర్ 24, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం స్వాతి కార్తె అక్టోబర్ 24 నుండి నవంబర్ 06 వరకు ఉపరి విశాఖ కార్తె తిధి త్రయోదశి ఉదయం 11.19 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 07.42 వరకు ఉపరి రేవతి యోగం...

కావలింత..! జెర జాగరత!?|ADUGU TRENDS

మనుషుల, మనసుల మద్దెల ఆప్యాయత, స్నేయితం, పేమ, అనురాగాల్ని వ్యక్తం శేసే ఒక సహజమైన భావోద్వేగ పద్ధతిని కావలింత అంటం. గదాన్నే కౌగిలి అని కూడ అంటరు. ఇగ కౌగిలి పేరున తెలుగు...

ఫ్రాన్స్‌ అశాంతికి బాధ్యులెవరు!?|EDITORIAL

ఫ్రాన్స్ లో నెలకొన్న అశాంతికి రాజకీయ నిందారోపణలు ముగింపు పలకలేవు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, జీవనవ్యయాన్ని తగ్గించడం, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారానే పరిస్థితులు చక్కబడతాయి. ప్రజల ఆగ్రహాన్ని కుట్రగా...

అక్టోబర్ 23, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి ఉదయం 11.27 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 07.24 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం ధ్రువ రాత్రి 09.37 వరకు ఉపరి వ్యాఘాత కరణం బాలవ ఉదయం 11.27 వరకు ఉపరి...

సెల్పీలొద్దు..పానాలే ముద్దు!?|ADUGU TRENDS

గీ శేతిల పోన్లొచ్చినకానుంచి, మనుసులు, సమాజం, పపంచకమే ఎవ్వలి శేతిల లేకుండపోతాంది. బుడ్డ పోరగాండ్ల కానుంచి ముసలొల్ల దాకా అందరి శేతుల్ల పోన్లేనాయె. గడికోపాలి గండ్ల యేలు పెట్టి గెలుకుడేనాయె? తలకాయ పెట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News