గీ మద్దెల మనుసులు యేగంగా మారుతాండ్రు. సోసల్ మీడియ చెలరేగుతాంది. ఇగ మనుసులు ఎంతకైనా దిగజారుతాండ్రు. ఇగెంతకైనా ఎగబాకుతాండ్రు. సబ్ స్క్రైబర్లు, లైకులు, శేర్ల కోసం సిగ్గు శెరం లేని పనులు కూడా తెగబడి శేత్తాండ్రు. గసొంటిదే గీ ముచ్చట.

గా మొన్న ఓ ఈడియ, పోటువలు సోసల్ మీడియల మస్తు తిరిగినయి. ట్రెండైనయి. గండ్ల ఓ 75 ఏండ్ల ముసలాయినె రామ్ సుఘర్ ను ఓ 30 ఏండ్ల బ్లాగర్ రీనా రాజ్ పుత్ నిశ్చితార్థం చేసుకున్నది. ఉంగురాలు మార్సుకున్నది. గదాన్ని తన బ్లాగ్ ల పెట్టి వైరల్ శేసింది. పేమకు వయసుతో పనేం లేదని పటకించింది. గా వయసు పొల్లకు గీ ముసలాయెనెకు 45 ఏండ్లు తేడా ఉన్నది. గప్పుడే శానా మంది అన్నరు ముసలి తానానికి కుసుమ గుడాలని, గీయనికు గిదేం పోయే కాలమని. అయితే, గీ మద్దెల గామె మరొక్క ఈడియ, పోటువలను తన బ్లాగ్ ల పెట్టింది. గా నిశ్చితార్థాన్ని రద్దు శేసుకున్ననని, కుటుంబ లొల్లుల్ల వదిలిపోయిన తన పెనిమిటి తిరిగి వచ్చిండని గండ్ల పెట్టింది. ఇంకా తన నిశ్చితార్థం పోటువను, తన పెనిమిటితో దండలేసుకుంటున్న పోటువలను శేర్ శేసింది. గిది ఉత్తర ప్రదేశ్, ఔరైయాల జరిగింది. గిదంతా గా లైకులు, శేర్ల కోసం శేసిందని తెలిసింది. ఇగ నెటిజన్లు మస్తు లొల్లిలొల్లి శేత్తాండ్రు. లేనిపోనియి పెట్టి జనాల్ని ఆగం శేయొద్దంటాండ్రు. మీ సార్థానికి గిట్ల మనుసుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలుకుతాండ్రు.

