Saturday, October 24, 2026
23.8 C
Hyderabad

ఆర్థిక నియంత్రణ, క్రమశిక్షణే అసలైన సవాళ్ళు!?|EDITORIAL

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత పథకాలతో పాటు ఆదాయం పెంపు, వృథా ఖర్చుల నియంత్రణ, సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక ఇవే రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా నడిపించగలవు. లేదంటే, సంఖ్యల్లో ఘనంగా కనిపించే బడ్జెట్‌లు వాస్తవంలో భారంగా మారే ప్రమాదం లేకపోలేదు!

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.3,24,234 కోట్లు! అందులో సంక్షేమానికి రూ. 1,45,591 కోట్లు. ఈ కేటాయింపు లెక్కలు ఓ ప్రశ్నను సంధిస్తున్నాయి. సంక్షేమం పేరుతో పెరుగుతున్న ఈ ఖర్చులు రాష్ట్రాన్ని రుణభారం నుంచి విముక్తి చేస్తున్నాయా, లేక మరింత అప్పుల ఊబీలో పడేస్తున్నాయా? ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌ ను కూలంకశంగా పరిశీలిస్తే, అభివృద్ధి కంటే వ్యయం అధికంగా, ఆర్థిక క్రమశిక్షణ తక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నదన్న విమర్శలకు బలం చేకూరుస్తున్నది.

రెండున్నరేళ్లుగా కొనసాగుతున్న ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ పాలనలో, రుణాల నియంత్రణపై స్పష్టమైన దృష్టి కనబడడం లేదన్నది ప్రధాన అభ్యంతరం. గత ఆర్థిక సంవత్సరంలో బహిరంగ మార్కెట్ నుంచి రూ.64,539 కోట్లు రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్న ప్రభుత్వం, వాస్తవానికి రూ.67,539 కోట్లు సమీకరించింది. ఇది అంచనాలకన్నా ఎక్కువగా అప్పులు తీసుకున్నట్టు స్పష్టం చేస్తోంది. ఇక రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.73,383 కోట్లు బహిరంగ మార్కెట్ నుంచి, మిగతాతో కలిపి మొత్తం రూ.82,870 కోట్లు కొత్త రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోవడం ఆర్థిక భారం మరింత పెరిగే సూచనగా కనిపిస్తోంది.

ఇక ఆదాయ అంచనాల విషయానికి వస్తే, ప్రభుత్వం అదనంగా రూ.43 వేల కోట్లు సమీకరించగలమని భావిస్తోంది. ఇందులో పన్నుల ద్వారా రూ.14 వేల కోట్లు, కేంద్ర గ్రాంట్ల రూపంలో రూ.13 వేల కోట్లు, పన్నేతర ఆదాయంగా రూ.6,412 కోట్లు, కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.3,710 కోట్లు, కొత్త రుణాల రూపంలో రూ.5,325 కోట్లు రావచ్చని అంచనా వేసింది. అయితే ఈ అంచనాలు ఎంతవరకు వాస్తవం అవుతాయన్నది సందేహాస్పదం. గత బడ్జెట్‌లో కేంద్ర గ్రాంట్లుగా రూ.22,782.50 కోట్లు వస్తాయని భావించినా, వాస్తవంగా రూ.11,161 కోట్లు మాత్రమే లభించాయి. ఈ అనుభవం దృష్ట్యా, తాజా అంచనాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

వాస్తవానికి రాష్ట్ర ఆదాయంలో పెద్ద భాగం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అప్పులపై వడ్డీలు, కిస్తీల చెల్లింపులకే వెచ్చించబడుతోంది. దీంతో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమైన నిధులు ప్రధానంగా కొత్త రుణాలపై ఆధారపడుతున్నాయి. ఇది దీర్ఘకాలికంగా ఆర్థిక స్థిరత్వానికి ముప్పుగా మారే అవకాశముంది.

ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమ పథకాలకే అధిక ప్రాధాన్యత ఇవ్వడం గమనార్హం. పేదల అభ్యున్నతికి సంక్షేమం అవసరమే అయినా, వృథా ఖర్చులను నియంత్రించాల్సిందిపోయి, వాటినే కొనసాగించడం ఆందోళనకరం. డబుల్ పెన్షన్లు, అధిక వేతనాలు, సబ్సిడీల రూపంలో భారీగా ఖర్చులు పెరుగుతున్నాయి. బోగస్ రేషన్ కార్డులను తొలగించడం వంటి చర్యలు తీసుకుంటే ఖర్చులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. కానీ, ఆ సాహసం ఈ ప్రభుత్వమే కాదు, మరే ప్రభుత్వం చేయడానికి సాహసించడంలేదు. ఇది ఓట్ల రాజకీయం. దానికి ఏ పార్టీ, ఏ ప్రభుత్వమూ మినహాయింపు కాదు.

అభివృద్ధిలో పరిస్థితి ఆశాజనకంగా, ఆశించినంతగా లేదు. రోడ్ల దుస్థితి, ప్రభుత్వ వైద్యశాలలపై నిర్లక్ష్యం, హాస్టళ్లలో అసౌకర్యాలు, అధిక ధరలు, నిరుద్యోగం, రైతుల సమస్యలు ప్రజల నిత్యజీవితంపై ప్రత్యక్ష ప్రభావం చూపుతున్న అంశాలు. ఉన్న పాఠశాలలను మెరుగుపరచకుండా, కొత్తగా ‘ఇంటగ్రేటెడ్ స్కూళ్ల’ కోసం రూ.5 వేల కోట్లు కేటాయించడం ప్రాధాన్యతలపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. విద్యా వసతులు అత్యంత బలహీనంగా ఉన్నప్పుడు, మరో అధునాతన విద్యా ప్రాజెక్టులకు భారీ నిధులు కేటాయించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇక గ్రామీణాభివృద్ధి, స్వయం సమృద్ధి వంటి అంశాలు కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత పొందలేదన్న విమర్శ ఉంది. దేవాదాయ భూముల పరిరక్షణ, స్థానిక మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాల్లో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణ చూపించాల్సిన అవసరం ఉంది.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కొన్ని పథకాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా, ఆరోగ్య సేవల విస్తరణ వంటి చర్యలు సానుకూలమే. అయితే ఈ పథకాల అమలులో స్పష్టత, పారదర్శకత అవసరం. ఎవరు లబ్ధిదారులు? అమలు విధానం ఎలా ఉంటుంది? అనే ప్రశ్నలకు సమాధానాలు అవసరం.

మొత్తానికి, ప్రస్తుత బడ్జెట్‌లో సంక్షేమం–అభివృద్ధి మధ్య బ్యాలెన్స్ తప్పినట్లు కనిపిస్తోంది. రుణాలపై అధికంగా ఆధారపడటం, ఆదాయ అంచనాల్లో అనిశ్చితి, వ్యయ నియంత్రణలో నిర్లక్ష్యం వంటి అంశాలు దీర్ఘకాలిక ఆర్థిక ఆరోగ్యానికి సవాళ్ళుగా మారవచ్చు. ఉచిత పథకాలతో పాటు ఆదాయం పెంపు, వృథా ఖర్చుల నియంత్రణ, సమర్థవంతమైన ఆర్థిక ప్రణాళిక ఇవే రాష్ట్రాన్ని స్థిరమైన అభివృద్ధి దిశగా నడిపించగలవు. లేదంటే, సంఖ్యల్లో ఘనంగా కనిపించే బడ్జెట్‌లు వాస్తవంలో భారంగా మారే ప్రమాదం లేకపోలేదు.

Latest News

ముసలోనితోటి నిచ్చితార్థం! పెనిమిటి కోసం రద్దు!?|ADUGU TRENDS

గీ మద్దెల మనుసులు యేగంగా మారుతాండ్రు. సోసల్ మీడియ చెలరేగుతాంది. ఇగ మనుసులు ఎంతకైనా దిగజారుతాండ్రు. ఇగెంతకైనా ఎగబాకుతాండ్రు. సబ్ స్క్రైబర్లు, లైకులు, శేర్ల కోసం సిగ్గు శెరం లేని పనులు కూడా...

గాలి కాదు.. గరళం!|EDITORIAL

ఊపిరి పోసే గాలే ఇప్పుడు ప్రాణాలు తీసే విషంగా మారుతోంది! హైదరాబాద్‌లో పీఎం-10 స్థాయులు జాతీయ ప్రమాణాలను 33.3 శాతం మించగా, సంగారెడ్డి, నల్గొండల్లోనూ ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. దిల్లీలోనూ గాలి నాణ్యత...

అక్టోబర్ 24, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం స్వాతి కార్తె అక్టోబర్ 24 నుండి నవంబర్ 06 వరకు ఉపరి విశాఖ కార్తె తిధి త్రయోదశి ఉదయం 11.19 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 07.42 వరకు ఉపరి రేవతి యోగం...

కావలింత..! జెర జాగరత!?|ADUGU TRENDS

మనుషుల, మనసుల మద్దెల ఆప్యాయత, స్నేయితం, పేమ, అనురాగాల్ని వ్యక్తం శేసే ఒక సహజమైన భావోద్వేగ పద్ధతిని కావలింత అంటం. గదాన్నే కౌగిలి అని కూడ అంటరు. ఇగ కౌగిలి పేరున తెలుగు...

ఫ్రాన్స్‌ అశాంతికి బాధ్యులెవరు!?|EDITORIAL

ఫ్రాన్స్ లో నెలకొన్న అశాంతికి రాజకీయ నిందారోపణలు ముగింపు పలకలేవు. విద్యా వ్యవస్థను బలోపేతం చేయడం, జీవనవ్యయాన్ని తగ్గించడం, ప్రజల్లో ప్రభుత్వంపై విశ్వాసాన్ని పునరుద్ధరించడం ద్వారానే పరిస్థితులు చక్కబడతాయి. ప్రజల ఆగ్రహాన్ని కుట్రగా...

అక్టోబర్ 23, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి ఉదయం 11.27 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 07.24 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం ధ్రువ రాత్రి 09.37 వరకు ఉపరి వ్యాఘాత కరణం బాలవ ఉదయం 11.27 వరకు ఉపరి...

సెల్పీలొద్దు..పానాలే ముద్దు!?|ADUGU TRENDS

గీ శేతిల పోన్లొచ్చినకానుంచి, మనుసులు, సమాజం, పపంచకమే ఎవ్వలి శేతిల లేకుండపోతాంది. బుడ్డ పోరగాండ్ల కానుంచి ముసలొల్ల దాకా అందరి శేతుల్ల పోన్లేనాయె. గడికోపాలి గండ్ల యేలు పెట్టి గెలుకుడేనాయె? తలకాయ పెట్టి...

జియో ఐపీఓ జోరు…|EDITORIAL

దేశీయ పెట్టుబడి చరిత్రలో జియో ఐపీఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తోంది. వివిధ పెట్టుబడి సంస్థలకు భారీ ఆసక్తి ఆశలు రేకెత్తిస్తుండగా, మార్కెట్ ఒడిదుడుకులు, రూపాయి కదలికలు ఇన్వెస్టర్లకు అప్రమత్తత పాఠాలు నేర్పుతున్నాయి. మార్గం -...

అక్టోబర్ 22, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.05 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం శతభిషం సాయంత్రం 06.34 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం వృద్ధి రాత్రి 10.39 వరకు ఉపరి ధ్రువ కరణం భద్ర ఉదయం 11.05 వరకు ఉపరి...

అక్టోబర్ 21, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-శరత్ ఋతువు ఆశ్వీయుజమాసం శుక్లపక్షం తిధి దశమి ఉదయం 10.13 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం ధనిష్ఠ సాయంత్రం 05.16 వరకు ఉపరి శతభిషం యోగం గండ రాత్రి 11.17 వరకు ఉపరి వృద్ధి కరణం గరజీ ఉదయం 11.18 వరకు ఉపరి...

అభిమానమంటే గిదే పో!?|ADUGU TRENDS

ఎవ్వలికైనా ఎవ్వలో ఒకలంటేనో, వాళ్ళ తీరంటేనో, అభిమానం ఉంటది. కనీ, గదాన్ని బటయ పెట్టడం, సాటుకోవడం అంత సులువేం కాదు. గీయినె అభిమానం సూసి, గా పెద్దాయినే మస్తు ఫిదా అయిండు. గదేందో...

రియల్‌ ఎస్టేట్‌కు రివర్స్‌ గేర్‌!|EDITORIAL

ఒకప్పుడు కోట్లు కురిపించిన రియల్‌ ఎస్టేట్‌ రంగం ఇప్పుడు కొనుగోలుదారుల కోసం ఎదురుచూస్తోంది! హైదరాబాద్‌ మార్కెట్‌లో తగ్గుతున్న రిజిస్ట్రేషన్లు, మందగించిన క్రయవిక్రయాలు రంగం భవిష్యత్తుపై ప్రశ్నలు రేకెత్తిస్తున్నాయి. లగ్జరీ ఇళ్లకు కొంత డిమాండ్‌...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News