Tuesday, August 4, 2026
27.7 C
Hyderabad

పోరాటం, త్యాగం, నమ్మకాల సమ్మిళితమే మేడారం జాతర!|EDITORIAL

తెలంగాణ సామాజిక–సాంస్కృతిక జీవనంలో జాతరలకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి గ్రామానికీ, ప్రతి ప్రాంతానికీ ఒక స్థానిక దేవత, ఒక ప్రత్యేక సంప్రదాయం ఉంటుంది. కొమురవెల్లి మల్లన్న, కొత్తకొండ వీరభద్రస్వామి, కొండపోచమ్మ వంటి జాతరలు ప్రజల విశ్వాసాలకు కేంద్రబిందువులుగా నిలిచాయి. అయితే ఇవన్నీ ఒక ఎత్తయితే, మేడారం మహా జాతర మరో ఎత్తు. సంఖ్యలో, సంప్రదాయంలో, భావోద్వేగంలో మేడారం ఒక విశిష్ట అనుభవం.

మేడారం జాతర మిగతా భారతీయ విశ్వాసాలకు, సంప్రదాయాలకు, జాతరలకు భిన్నమైనది. దేవతల చరిత్ర, కొలుపుల్లో విభిన్నమైనది. ఇది దేవాలయ కేంద్రంగా ఉన్న ఆచారం కాదు. గర్భగుడి లేదు, అర్చక వ్యవస్థ లేదు, శాస్త్రీయ పూజావిధానాలు లేవు. అయినా కోటానుకోట్ల మందిని ఆకర్షించే అపూర్వ శక్తి ఈ జాతరకు ఉంది. విశ్వాసానికి నిర్మాణాలు, విగ్రహాలు అవసరం లేదని నిరూపించే జాతర. అడవిలో, ప్రకృతి ఒడిలో, గిరిజన సంప్రదాయాల మధ్య జరిగే ఈ జాతర నేడు సర్వజనీన ఆమోదాన్ని పొందింది.
సమ్మక్క–సారలమ్మలు కేవలం గిరిజన దేవతలు మాత్రమే కాదు. అణచివేతకు ఎదురొడ్డి పోరాడిన చరిత్రకు ప్రతీకలు. రాజ్య విస్తరణ కోసం పోరాడిన వారు చక్రవర్తులైతే, ప్రజల కోసం ప్రాణత్యాగం చేసిన మేడరాజులు దేవతలయ్యారు. కాకతీయుల కాలంలో ఇది చరిత్ర ఇచ్చిన గొప్ప సందేశం. అయితే, నేటికీ భక్తులు ఆ చరిత్రను వినడం, విశ్లేషించడంతోపాటుగా, అమ్మల దయను నమ్మి మొక్కులు చెల్లించడానికి మేడారానికి వస్తారు. విశ్వాసం ఇక్కడ చరిత్రకన్నా గొప్పది. నమ్మకమైనది.

ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరకు కోట్ల సంఖ్యలో భక్తులు హాజరవుతారు. అసలీ భక్త జన తాకిడిని తట్టుకోలేకే రెండేళ్ళకోసారి నిర్వహిస్తున్నారు. గిరిజనులు, గిరిజనేతరులు, పట్టణ, గ్రామీణ భేదం లేకుండా జనసందోహం వెల్లువలా తరలివస్తుంది. నాలుగు రోజుల జాతరలో కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతాయి. చిన్న వ్యాపారులు, కూలీలు, స్థానికులు తమ జీవనాధారాన్ని ఈ జాతర ద్వారా మెరుగుపరుకుంటారు. మేడారం ఒక ఆధ్యాత్మిక కేంద్రం మాత్రమే కాదు. ఒక ప్రత్యామ్నాయ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా.

అయితే ఈ మహాజాతర నిర్వహణ రాష్ట్ర, జిల్లా పాలనా యంత్రాంగానికి పెద్ద సవాల్. అటవీ ప్రాంతం, పరిమిత మౌలిక వసతులు, విపరీతమైన జనసాంద్రత ఈ మూడింటి మధ్య సమన్వయం సాధించడం అంత సులభం కాదు. అయినా ప్రతి సారి ప్రభుత్వం, అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. తాగునీరు, వైద్యం, రవాణా, భద్రత వంటి అంశాల్లో ఎప్పటికప్పుడు మెరుగుదల కనిపిస్తోంది. అయినప్పటికీ, భక్తుల సంఖ్య ఏటేటా పెరుగుతున్న నేపథ్యంలో దీర్ఘకాలిక ప్రణాళిక అవసరం స్పష్టంగా కనిపిస్తోంది. అభివృద్ధి పేరుతో గిరిజన సంస్కృతిపై దాడి జరగకుండా జాగ్రత్త పాటించాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.

మేడారం జాతర మరో ముఖ్యమైన కోణం, సామాజిక సమానత్వం. ఇక్కడ మత, కుల, ప్రాంతీయ భేదాలు కరిగిపోతాయి. చెట్ల కింద అందరూ సమానంగా బస చేస్తారు. ఒకే వంటకాన్ని పంచుకుంటారు. సంపంగివాగులో పుణ్యస్నానాలు చేస్తూ కుంభమేళాను తలపిస్తారు. శబరిమలను గుర్తు చేసే జనసందోహం, తిరుమలలో కనిపించే మొక్కుల సంప్రదాయం వంటివన్నీ మేడారంలో ఒకేచోట కనిపిస్తాయి. అయినా ఈ జాతర తన మూల స్వరూపాన్ని కోల్పోలేదు. అదే దాని గొప్పతనం.

నేడు ప్రపంచీకరణ ప్రభావంతో అనేక స్థానిక సంప్రదాయాలు కనుమరుగవుతున్నాయి. కానీ మేడారం మాత్రం కాలానికి ఎదురొడ్డి నిలుస్తోంది. ఇది గిరిజన సంస్కృతికి ఉన్న బలాన్ని, ప్రజల విశ్వాసానికి ఉన్న గాఢతను చాటిచెబుతోంది. సమ్మక్క–సారలమ్మలపై ఉన్న నమ్మకం భక్తులను మళ్లీ మళ్లీ మేడారానికి తీసుకొస్తోంది. “అమ్మ దర్శనం చేసుకుంటే కష్టాలు తీరతాయి” అన్న విశ్వాసమే ఈ మహాజాతరకు ప్రాణం.
మేడారం మహా జాతర ఒక పండగ మాత్రమే కాదు. ఒక భావజాలం. అది గిరిజన ఆత్మగౌరవానికి ప్రతీక, ప్రజా విశ్వాసానికి అద్దం, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి గుర్తు. ఈ విశిష్టతను కాపాడుకుంటూనే, భవిష్యత్తుకు మరింత సుస్థిరంగా తీసుకెళ్లడం మనందరి బాధ్యత. మేడారం అంటే కేవలం ఒక ప్రాంతం, చరిత్ర, త్యాగం, విశ్వాసం మాత్రమే కాదు. అది ఒక అనుభూతి, ఒక నమ్మకం, ఒక జీవన తత్వం.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News