Thursday, September 3, 2026
27.5 C
Hyderabad

గీ కర్ణాటక ట్రాఫిక్ కట్టాలకు గింత కథ ఉందా!?|ADUGU TRENDS

ట్రాఫిక్ కట్టాలు లేందెక్కడ? కిరాణా దుకాన్ల, రేషన్ షాపుల్ల, బ్యాంకుల్ల, బస్సుల్ల, రోడ్ల మీద, శివరాకరికి సులభ్ కాంప్లెక్సుల్ల కూడా రద్దేనాయె!? కానీ, గీ కర్ణాటకల రద్దీకి కర్ణునికి ఏదో లింకుందట సూద్దాం పదండ్రి!

కర్ణాటకల ‘రెండు కిలోమీటర్లకు గంటపైనే పట్టింద’నడం, ‘వర్క్ ఫ్రం ఆఫీస్’ అనేకంటే ‘వర్క్ ఫ్రం ట్రాఫిక్’ అనడం మామూలేనట. పూర్వం రోజుల్ల కర్ణుడంతటి వాడికి కూడా గీడ ట్రాఫిక్ కట్టాలు తప్పలేదట!

యెన్కటికి చోళరాజ్యానికి దగ్గర్ల అంటే గిప్పుడు గీ బెంగుళూరుకు దగ్గర్ల కర్ణుడు-అర్జనుడికి యుద్ధం జరిగిందట. ఇగ రెండు జంక్షన్ల అవతల ఉన్న అర్జనుడ్ని సూర్యాస్తమయంలోపే ఖతం చేస్తనని కర్ణుడు ప్రతిన బూనిండట. గట్లనే యుద్ధానికి బయల్దేరిండంట. ఇగ రథం ఎంతకూ ముందుకు కదుల్తలేదట. ఎందుకుని శల్యుడిని అడిండట. ఇది పీకవర్, దేవుళ్లు గూడా గీ రూట్ల రావడానికి భయపడ్తరన్నడట. సూర్యాస్తమయం కావస్తున్నా, కర్ణుడు అర్జనుడిని చేరుకోలేదట. ఈలోగా గా కర్ణుడి రథం రోడ్డుమీదే ఉన్న పెద్ద గుంటల పడిపోయిందట. ఎంతకూ గా రథం కదలకపోవడంతోటి కర్ణుడు, ‘గీ నేల మీద ఏ చక్రం కూడా సాఫీగా తిరగొద్ద’ని శపించిండంట. ఎక్కడైతే కర్ణుడు ఆటకాయించబడిండో.. గదే గా ‘కర్ణా-అటకా’ గా మారిందంట!?

కర్ణాటక ట్రాఫిక్ రద్దీ మీద ఎవలో గిట్ల ఓ సెటైర్ రాసి, సొషల్ మీడియల పెట్టిండు. గదిప్పుడు తెగ శెక్కర్లు కొడ్తాంది. మస్తు లైకులు, షేర్లు కొట్టుకుంటాంది.

Latest News

BREAKING: కొండా సురేఖపై వేటు..చిన్నారెడ్డి ఔట్

సీఎం రేవంత్‌ నిర్ణయం! తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. మంత్రి కొండా సురేఖను రాష్ట్ర మంత్రివర్గం నుంచి తక్షణమే తొలగించాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి నిర్ణయించినట్లు అధికారిక నోట్‌ వెల్లడించింది. ఈ మేరకు...

కొండా సురేఖకు కేఏ పాల్ ఆహ్వానం..|KONDA SUREKHA|KA PAUL

కాంగ్రెస్‌ను వీడి ప్రజాశాంతి పార్టీలోకి రండి మంత్రి కొండా సురేఖకు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బహిరంగ ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీలో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో సురేఖ పార్టీ...

రాజీనామా చేయాల్సిందే.. లేదంటే బర్తరఫ్‌!|KONDA SUREKHA|RESIGN|BURTRAF

కొండా సురేఖకు అధిష్ఠానం అల్టిమేటం.. ఇంటి వద్ద నిర్మానుష్యం పార్టీ లైన్‌ దాటని అనుచరులు  తెలంగాణ కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం మరోసారి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్‌...

ఉద్వాసనమే!|KONDA SUREKHA|CM|REVANTH REDDY|DELHI

సురేఖను పట్టించుకోని అధిష్ఠానం ముక్తసరిగా మూడు ముక్కల్లో ఖర్గేతో మచ్చట అపాయింట్ మెంట్ ఇవ్వని కేసీ వేణుగోపాల్ ఏఐసీసీ కార్యాలయంలోనే రోజంతా పడిగాపులు నిరాశతో వెనుతిరిగిన మంత్రి కొండా సురేఖ ఖర్గే, కేసీలతో రేవంత్ రెడ్డి వేర్వేరుగా భేటీలు సురేఖ వ్యవహారాన్ని...

ఉగ్రమూలాలపై పాక్ కు భారత్ మరో హెచ్చరిక!?|EDITORIAL

పాకిస్తాన్ నిజంగా శాంతి కోరుకుంటే మాటలకంటే చర్యలు ముఖ్యం. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తీసుకునే చర్యలు పారదర్శకంగా, నిరంతరంగా ఉండాలి. ఉగ్రవాదాన్ని ఒకప్పుడు వ్యూహాత్మక సాధనంగా చూసిన విధానాలకు స్వస్తి చెప్పి, పొరుగుదేశాలతో విశ్వాసాన్ని...

సెప్టెంబర్ 03, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి షష్ఠి రాత్రి 01.39 వరకు ఉపరి సప్తమి నక్షత్రం కృత్తిక రాత్రి 12.50 వరకు ఉపరి రోహిణి యోగం వ్యాఘాత రాత్రి 07.56 వరకు ఉపరి హర్షణ కరణం భద్ర పగలు 02.43 వరకు ఉపరి బవ రాహుకాలం...

హైకమాండ్‌ ముందు కొండా సురేఖ బాంబ్‌..|KONDA SUREKHA|CONGRESS

రేవంత్‌పై చర్యలకు డిమాండ్‌..|CM|REVANTH REDDY ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకూ షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలంటూ డిమాండ్‌ రాష్ట్రంలో రాజగోపాల్‌రెడ్డి వార్నింగ్‌!|KOMATIREDDY RAJAGOPAL REDDY|WARNING ఢిల్లీలోని ఇందిరా భవన్‌ వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. పార్టీ అంతర్గత విభేదాలు,...

సిడెం సేపట్లనే బరువు తగ్గొచ్చా!?|ADUGU TRENDS

ఒగప్పుడంటే ఎండా, వానా, సలి, శేను, శెలకా, బరువు పనులు, కట్టం బతుకులు..ఇగిప్పుడంటే ఏసీలు, ప్యాన్ల కింద కుర్సీలల్ల జీతాలైపాయె. కట్టం తక్కువాయె ఒత్తిడి ఎక్కువాయె. గందుకే శానా మంది బరువులు పెరిగి,...

సర్కార్, పోలీసులు, సీజేపీకి అసలైన పరీక్ష!?|EDITORIAL

సీజేపీ గత ఆందోళనల సందర్భంగా అసాంఘిక శక్తులు చొరబడ్డాయన్న ఆరోపణలను కూడా తేలికగా తీసుకోలేం. అయితే ఖలిస్తాన్ అనుకూల శక్తులు లేదా ఇస్లామిక్ ఉగ్రవాదులు నిరసనలో చేరతారన్న వాదనలను నిర్ధారిత ఆధారాలు లేకుండా...

సెప్టెంబర్ 02, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 05.40 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం భరణి రాత్రి 02.12 వరకు ఉపరి కృత్తిక యోగం ధ్రువ రాత్రి 10.41 వరకు ఉపరి వ్యాఘాత కరణం గరజి సాయంత్రం 04.44 వరకు ఉపరి వణజి రాహుకాలం...

ఆన్ లైన్లనే మనువు… అచ్చింతలు!?|ADUGU TRENDS

పెండ్లిల్లు సొర్గంల నిర్ణయిత్తరట. ఎవలితో? ఎక్కడ? ఎప్పుడు? ఎట్ల జరగాల్నో? గాడనే తేలుత్తరట. గవాటి సంగతేమో! గనీ, గీ మద్దెల భూమ్మీద మనువులు మాత్రం మానవులే నిర్ణయిత్తాండ్రు. గా అమెరిక అధ్యచ్చుడు ట్రంపు...

చల్లని హిమాలయాల్లో విస్ఫోటక వాటర్ బాంబ్స్!|EDITORIAL

ముప్పు పర్వత ప్రాంతాలకే పరిమితం కాదు. సిక్కిం లేదా నేపాల్ హిమాలయాల్లో పెద్ద స్థాయిలో జీఎల్ఓఎఫ్ సంభవిస్తే కోసి, గండక్, తీస్తా వంటి నదుల ద్వారా వరదనీరు దిగువ మైదాన ప్రాంతాలకు చేరే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News