Monday, October 5, 2026
26.8 C
Hyderabad

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డికే మళ్లీ మద్దతు ఇవ్వాలని, ఆయనను గెలిపించాలని ప్రజలను కోరడం పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. ఈ ప్రకటనపై మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మంత్రి కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల సందర్భంగా పరకాలలో మాట్లాడిన కొండా సుస్మిత, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై విరుచుకుపడ్డారు. ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉండగానే అభ్యర్థిని ఎలా ఖరారు చేస్తారని ప్రశ్నించారు. గతంలో కొండా మురళికి ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి మాట తప్పారని ఆరోపిస్తూ, తమపై ఎదురుదాడికి దిగితే సీఎం, ఆయన కుటుంబ సభ్యుల స్కాములను బయటపెడతానని హెచ్చరించారు. పరకాల నియోజకవర్గంలో రాబోయే కాలంలో పోటీ చేసేది తానేనని, కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతానని ఆమె స్పష్టం చేశారు.

ఈ వ్యాఖ్యలపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి స్పందిస్తూ, క్షేత్రస్థాయి పరిస్థితులు మరియు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకునే సీఎం రేవంత్ రెడ్డి తనను ప్రోత్సహిస్తూ మాట్లాడారని పేర్కొన్నారు. సుస్మిత చేసిన వ్యక్తిగత విమర్శలకు స్పందించి తన స్థాయిని తగ్గించుకోనని, తగిన సమయంలో పార్టీ అధిష్ఠానమే అన్ని విషయాలను చూసుకుంటుందని తేల్చిచెప్పారు. మంత్రి కొండా సురేఖతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు.

మరోవైపు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు సుస్మిత వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం కూడా లేని వ్యక్తులు ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం సరికాదన్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా మాట్లాడే వారి వ్యాఖ్యలను ఎవరూ పరిగణనలోకి తీసుకోరని విమర్శించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి స్పందిస్తూ, పార్టీ గౌరవానికి భంగం కలిగించేలా ఎవరైనా లక్ష్మణరేఖ దాటి మాట్లాడితే సహించేది లేదని, సుస్మిత వ్యాఖ్యలపై పూర్తి సమాచారం తీసుకున్న తర్వాత నిబంధనల ప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. అలాగే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షీ నటరాజన్ కూడా ఈ పరిణామాలపై దృష్టి సారించి, సమగ్ర నివేదికను పంపాలని నాయకత్వాన్ని ఆదేశించారు. స్థానిక నియోజకవర్గంలో ఆధిపత్యం, టికెట్ కేటాయింపుల చుట్టూ మొదలైన ఈ వివాదం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

Latest News

అక్టోబర్ 05, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి దశమి రాత్రి 02.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పుష్యమి రాత్రి 12.51 వరకు ఉపరి ఆశ్లేష యోగం శివ పగలు 12.50 వరకు ఉపరి సిద్ద కరణం వణజి పగలు 03.55 వరకు ఉపరి...

పట్టుకుంటే ఊతం.. కూసుంటే ఆసనం!?|ADUGU TRENDS

వయసు మీద పడిందనుకోండ్రి. నడక కట్టమే. కూసునుడు కూడా ఇంకా కట్టం. మూడో కాలనే శేతి కర్రో.. ఇంకేదో ఒకటి ఊతంగా ఉండాల్సిందే. గట్లనే శేతకాకపోతే కూసోనికి ఏదో ఒక ఉచితాసనం ఉండాల్సిందే....

కరెంట్ అఫైర్స్|ADUGU DIGITAL MEDIA|COMPITITIVE EXAMS|SPECIAL|CURRENT AFFAIRS

1) లడఖ్‌లోని అన్ని జిల్లాల్లో అటానమస్ కౌన్సిళ్లు: లడఖ్‌లోని మొత్తం 7 జిల్లాలలో స్వయంప్రతిపత్తి కలిగిన హిల్ డెవలప్‌మెంట్ కౌన్సిళ్లను (AHDCs) ఏర్పాటు చేయాలని మరియు ఆర్టికల్ 371 కింద రాజ్యాంగ రక్షణలు కల్పించాలని...

వంటింట్లో ధరల మంటలు!?|EDITORIAL

వానలు ముఖం చాటేస్తే పంటలు ఎండిపోతాయి.. పంటలు తగ్గితే ధరలు మండిపోతాయి.. ధరలు పెరిగితే సామాన్యుడి వంటింటిలో మంటలు చెలరేగుతాయి. నిర్ణీత బడ్జెట్‌ బుగ్గిపాలవుతుంది! వాతావరణ అస్థిరతకు అంతర్జాతీయ సంక్షోభాలు తోడవుతున్న వేళ...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

అక్టోబర్ 04 నుండి 10 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా ఆదాయం...

గాంధీజీకి గుడి..ఎక్కడో మరి!?|ADUGU TRENDS

దేవుల్లకు గుడి కట్టటం మన సంప్రదాయం. మనుసుల్లో మహానుభావులకు కూడా గుడి కట్టడం సూత్తున్నం. కాకాపోతే మనుసుల్లో మహానుభావులు తక్కువ. గవాల్లకు గుడి కట్టుడు కూడా శాలా తక్కువే. గట్లనే గాంధీజీకి కూడా...

కాలుష్య కోరల్లో ఢిల్లీ.. ఇంకెన్నాళ్లు ఈ నరకం!?|EDITORIAL

ఉదయం కళ్లుతెరిస్తే పొగమంచు.. బయటకు వస్తే విషగాలి.. ఇదేనా దేశ రాజధాని ఢిల్లీ పరిస్థితి? కాలుష్యం పెరిగిన ప్రతిసారీ కొత్త ఆంక్షలు.. కొత్త ప్రకటనలు.. కానీ శాశ్వత పరిష్కారం మాత్రం ఎక్కడా కనిపించదు....

అక్టోబర్ 03, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి సప్తమి ఉదయం 09.50 వరకు ఉపరి అష్టమి నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి పునర్వసు యోగం వరీయాన్ రాత్రి 06.49 వరకు ఉపరి పరిఘ కరణం బవ ఉదయం 09.50...

గురువుకు పూర్వ విద్యార్థుల అపూర్వ కానుక!?|ADUGU TRENDS

గురువంటే విద్యా బుద్ధులు నేర్పేవాడే కాదు. జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేవాడు. భావి భారతానికి బాటలు వేసే వాడు. గిట్లనే సదువుకుని ఎదిగిన, గీ ముచ్చట ఎరిగిన గా సదువుకున్న పొల్లగాండ్లు గా సారును...

జయహో స్మిత్ మచ్చర్…ధైర్యానికి సెల్యూట్!|EDITORIAL

ఆకాశంలో ప్రాణాలు గాల్లో కలిసిపోతాయనుకున్న క్షణం.. ఓ కెప్టెన్‌ అసమాన ధైర్యం వందల ప్రాణాలకు రక్షణ కవచమైంది! తీవ్ర గాయాలు.. కాక్‌పిట్‌లో దాడి.. అదుపుతప్పుతున్న విమానం.. అయినా వెనుకడుగు వేయని స్మిత్ మచ్చర్!...

అక్టోబర్ 02, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి షష్ఠి పగలు 12.13 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రోహిణి ఉదయం 07.20 వరకు ఉపరి మృగశిర యోగం వ్యతీపాత రాత్రి 09.54 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి పగలు 12.13 వరకు ఉపరి...

పాలిచ్చే ఏటీఎం!?|ADUGU TRENDS

అవుమల్ల.. గిప్పటిదాకా పైసలిచ్చే ఏటీఎంను సూసినం. గట్లనే టికెట్లనిచ్చే ఏటీఎంలను గూడ సూసినం. కానీ, గీ పాలిచ్చే ఏటీఎంను ఎక్కడైనా సూసినమా? కానీ, గా సిద్దిపేట జిల్ల గజ్వేల్ ఒకాయినె గీ పాల...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News