ఇండ్లకు ముందల, యెనుక రేకుల పందిరిలేసుకుంటం. గా పందిరి ఎంత మంచిగేసినా, గా గోడల కాంచి, నీల్లు కింద పడ్తాంటయి. గట్టిగ, గాలి వానొత్తే ఇంక శెప్పనలవి కాదు. మరి గిట్ల గాకుండ ఒకాయినె ఓ మంచి ఇకమతు శేసిండు. గదేందో సూద్దాం పదండ్రి.

రేకుల పందిరి యేసే ముందు గొడల కేలి బిగించడానికి ముందే ఓ శిన్న ఇస్రెతోటి గా రేకులని ఒక పక్కకు వంచిండు. ఐటెంక, గా రేకుల శివర్ల మీద ఓ ప్లాస్టిక్ బిల్లను బిగించిండు. ఇగ గా రేకులను గోడకు ఆనించి, గట్టిగ ఒత్తి పెట్టి బిగించిండు. గంతే. ఇగ ఎంత వాన పడ్డా, గా గోడలకు శినుకు పడది. ఒక్క సుక్క కూడా నీల్లు కారనే కారయట. గీ శిట్కాని మరి, మీరూ ఆడుండ్రి.

