ఎనకటికి ‘మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ‘ అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట!

తమిళనాడు రాష్ట్రం నాగపట్టినం జిల్లా వేళా0గన్ని దగర విలుందమావడి ఊరుంది. గా ఊరిల తాగి ఊగే తందనాలను తగ్గించాలని నిర్ణయించిండ్లు. ‘మందును అరికడుదాం.. ప్రజలను రచ్చిద్దాం’ అని పెండ్లి గాని పొల్లగా0డ్లు తాగొద్దని, ఒకేల తాగితే, 5 యేల రూపాయిల జరిమానా యిధించిండ్లు. పెండ్లి అయినోల్లు తాగొచ్చని, అయితే, తగువులు పడొద్దని గ్రామ పంచాయతీ తీర్మానం చేసింది. ఒకేల తగువులు పడితే, 5 యేల రాపాయిల జరిమానా విదిత్తమని డప్పు కొట్టి సాటింపేసిండ్లు. ఎట్లుంది గీ ఐవుడియా.

