Tuesday, September 29, 2026
33.3 C
Hyderabad

మాటలు మంటలు రేపితే.. యుద్ధం ఎక్కడ ఆడుతుంది.!?|EDITORIAL

శాంతి చర్చలు సాగాల్సిన వేళ.. అమెరికా–ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. క్షిపణుల హెచ్చరికలతో ప్రపంచం వణుకుతోంది.. చమురు ధరలు కదులుతున్నాయి.. ఆర్థిక వ్యవస్థలు ఆందోళనలో పడుతున్నాయి. ఒకవైపు సైనిక ఒత్తిడి.. మరోవైపు ప్రతిఘటన.. మధ్యలో సామాన్యుడి ప్రాణాలు, భవిష్యత్తు ప్రశ్నార్థకం. మళ్లీ యుద్ధమేనా.. లేక శాంతికి చివరి అవకాశమా!?

మార్గం – అడుగు, ఎడిటోరియల్

ఒక్క బాంబు పడితే ఒక నగరం దెబ్బతింటుంది.. కానీ ఒక యుద్ధం మొదలైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థే కుదేలవుతుంది. ఇప్పుడు అమెరికా–ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తత ప్రపంచాన్ని మరోసారి అదే భయాన్ని వెంటాడేలా చేస్తోంది. కాల్పుల విరమణకు, దౌత్య చర్చలకు అవకాశాలు కనిపిస్తున్నాయనుకునేలోపే మళ్లీ సైనిక దాడుల హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు ఉద్రిక్తతలను మరింత పెంచుతుండగా.. ఇరాన్ కూడా తాము మరో యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తోంది. ఇరువైపులా ఆయుధాలు సిద్ధంగా ఉంటే.. శాంతి మాత్రం ఎక్కడ ఉంటుంది? ఇదే ఇప్పుడు ప్రపంచం ముందున్న అసలు ప్రశ్న.

ఇరాన్ ప్రతిపాదించిన ఏడు రోజుల రోడ్‌మ్యాప్‌లో హోర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం, కాల్పుల విరమణ, చమురు విక్రయాలపై ఆంక్షల సడలింపు, స్తంభింపజేసిన ఇరాన్ నిధుల విడుదల వంటి అంశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రతిపాదనపై అమెరికా సానుకూలంగా స్పందించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అదే సమయంలో మధ్యవర్తుల ద్వారా చర్చలకు అవకాశాలు కొనసాగుతున్నట్లు వస్తున్న వార్తలు మాత్రం కొంత ఆశను కలిగిస్తున్నాయి.

ఇరాన్ అణ్వాయుధాలను సంపాదించకుండా అడ్డుకోవడమే తమ ప్రధాన లక్ష్యమని అమెరికా చెబుతోంది. మరోవైపు ఇరాన్ తన జాతీయ ప్రయోజనాలు, సార్వభౌమత్వం విషయంలో వెనక్కి తగ్గబోమని స్పష్టం చేస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి ఒకవైపు అమెరికా మళ్లీ దాడి చేస్తే ఎదుర్కొనే సామర్థ్యం తమకు ఉందని చెబుతూనే.. మరోవైపు దౌత్యానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం. అంటే యుద్ధానికి ప్రత్యామ్నాయం ఇంకా పూర్తిగా మూసుకుపోలేదన్న సంకేతం కూడా ఇందులో ఉంది.

అయితే యుద్ధ ప్రభావం ఇప్పటికే ఇరుదేశాల సరిహద్దులను దాటి ప్రపంచాన్ని తాకుతోంది. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి విషయంలో ఏర్పడే ఏ చిన్న అంతరాయం అయినా అంతర్జాతీయ చమురు సరఫరాలపై ప్రభావం చూపుతుంది. చమురు ధరలు పెరిగితే రవాణా ఖర్చులు పెరుగుతాయి.. రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల ధరలు ప్రభావితమవుతాయి.. చివరికి ద్రవ్యోల్బణం భారాన్ని సామాన్యుడే మోయాల్సి వస్తుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఆందోళనలు పెరుగుతున్నాయి.

ఇలాంటి సమయంలో యుద్ధాన్ని పొడిగించడం ఎవరి ప్రయోజనానికి? ఒక దేశం సైనికంగా పైచేయి సాధించిందని ప్రకటించుకోవచ్చు. మరో దేశం తాము ప్రతిఘటించగలమని చెప్పుకోవచ్చు. కానీ క్షిపణులకు ఎదురుగా నిలిచేది సామాన్య ప్రజల ప్రాణాలే. యుద్ధంలో గెలిచినవారికి కూడా నష్టం తప్పదు. ఇళ్లు కూలుతాయి.. కుటుంబాలు ఛిన్నాభిన్నమవుతాయి.. ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటాయి.. తరతరాల భవిష్యత్తు చీకటిలోకి నెట్టబడుతుంది.

ఇప్పటికైనా అగ్గికి ఆజ్యం పోసే ప్రకటనలకు బదులు.. చర్చలకు బాటలు వేయాలి. ప్రతీకారానికి బదులు పరస్పర హామీలు.. సైనిక ఒత్తిడికి బదులు దౌత్యపరమైన పరిష్కారం.. ఆధిపత్యానికి బదులు మానవ ప్రాణాలకు విలువ ఇవ్వాలి. హోర్ముజ్ జలసంధి సురక్షితంగా తెరుచుకోవడం, చమురు సరఫరాలు సాధారణ స్థితికి రావడం, అణు సమస్యకు దౌత్యపరమైన పరిష్కారం కనుగొనడం ప్రపంచ ప్రయోజనం.

ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది మరో యుద్ధం కాదు.. మరో శాంతి ప్రయత్నం. చరిత్రలో యుద్ధాలు ఎన్నో జరిగాయి.. వాటి గాయాలు మాత్రం తరతరాలపాటు మిగిలాయి. అమెరికా–ఇరాన్ నాయకత్వాలు ఈసారి చరిత్రను పునరావృతం చేస్తాయా.. లేక చరిత్ర నుంచి పాఠం నేర్చుకుంటాయా? ప్రపంచం ఎదురు చూస్తోంది.

Latest News

తెలంగాణలో… కమల వికాసం కలేనా!?|TELANGANA|BJP

రాష్ట్రంలో బీజేపీకి భవిష్యత్తు ఉందా? కాషాయంలో అంతర్గత కలహాలు! కావాల్సిన కసరత్తేది? కార్యాచరణేది? పార్టీకి సత్తువెక్కడ? సమన్వయం ఎక్కడ? సీనియర్లకు, కార్యకర్తలకు గుర్తింపేది? సమీక్షలున్నాయా? సవరింపులున్నాయా? పెరుగుతున్న పార్టీకి... పెరగని గ్రామీణ బలం! కేంద్ర పదవులు... రాష్ట్రానికి ఉపయోగమేనా? బూత్ కమిటీలు ఉన్నాయా? పనిచేస్తున్నాయా? కొత్త...

ఇంద్రుడి మీద న్యాయమూర్తికి ఫిర్యాదు!?|ADUGU TRENDS

వాన దేవుడు వానలు కురిపిత్తరని మనం నమ్ముతం. గా వానాకాలం, సలికాలం, ఎండాకాలమని ఓ లెక్క పకారం వత్తయి. గీ మద్దెల గయి కూడా లెక్క తప్పినయి. పడితే ఒకటే వాన.. లేకపోతే...

సెప్టెంబర్ 29, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం సంకటహర చతుర్థి తిధి బ తదియ సాయంత్రం 06.25 వరకు ఉపరి చవితి నక్షత్రం అశ్విని ఉదయం 11.09 వరకు ఉపరి భరణి యోగం వ్యాఘాత ఉదయం 09.07 వరకు ఉపరి హర్షణ కరణం వణజి ఉదయం...

సెప్టెంబర్ 28, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 07.56 వరకు ఉపరి తదియ నక్షత్రం రేవతి ఉదయం 10.49 వరకు ఉపరి అశ్విని యోగం ధ్రువ ఉదయం 11.21 వరకు ఉపరి వ్యాఘాత కరణం తైతుల ఉదయం 08.32...

గీ యినాయకునికి.. నిమజ్జనమే లేదు!?|ADUGU TRENDS

పతి ఏటా యినాయకులను పతిష్టించి, పూజించి, కోటొక్క తీర్గ కొలిచి సివరాకరికి నిమజ్జనం చేస్తుంటం. కానీ, గీ యినాయకునికి నిమజ్జనమే లేదు!? ముంబై గిర్గావ్ లో ఓ గణేశ్ మండలి గీ సంప్రదాయాన్ని...

కత్తులు దూసిన చేతులే.. కరచాలనం!|EDITORIAL

నిన్నటి వరకు పరస్పరం సుంకాలు, ఆంక్షలు, హెచ్చరికలతో ఢీకొన్న అమెరికా–చైనా.. ఒక్కసారిగా ఆత్మీయ ఆలింగనంలో కనిపించాయి. శత్రువుల్లా కనిపించిన రెండు అగ్రశక్తుల అధినేతలు ఒకే వేదికపై చిరునవ్వులు చిందించడం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది....

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

సెప్టెంబర్ 27 నుండి అక్టోబర్ 03 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం కొత్త బాధ్యతలు మీ ముందుకు రావచ్చు. ఉద్యోగంలో మీ పనితీరును ఉన్నతాధికారులు గమనించే అవకాశం ఉంది. పెండింగ్‌లో ఉన్న...

ఇగ్రహం ఉన్న సోటనే నిమజ్జనం!|ADUGU TRENDS

ప్రతి ఏటా ఇనాయకులను నిలబెడత0.. తొమ్మిది, పది రోజులు ఘనంగా పూజలు సేస్త0. ఇగ గా ఇగ్రహాలను చెరువుల్ల, కుంటల్ల నిమజ్జనం సేస్త0. గా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో సేసే గా...

సర్ వివాదం.. ఈసీ విశ్వసనీయతకు సవాల్!|EDITORIAL

ఓటు ప్రజాస్వామ్యానికి ఆయుధం.. ఆ ఓటుకు కాపలాదారు ఈసీ! మరి కాపలాదారుడి విశ్వసనీయతపైనే ప్రశ్నలు తలెత్తితే? సర్ వివాదాలు, కమిషనర్ల అభ్యంతరాలు, ప్రతిపక్షాల ఆరోపణల నడుమ.. ఎన్నికల సంఘం పారదర్శకత ఇప్పుడు దేశం...

సెప్టెంబర్ 26, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 09.45 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పూర్వాభాద్ర ఉదయం11.50 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం గండ పగలు 02.41 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర ఉదయం 09.48 వరకు ఉపరి బవ రాహుకాలం...

అడుగుకు అభినందనలు!|ADUGU DIGITAL MEDIA

మట్టి వినాయకుల ప్రచారానికి పలువురి ప్రశంసలు ఈ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించాలని సూచనలు అడుగు కార్యాలయానికి మంత్రి జూపల్లి, కలెక్టర్ పలువురి ఫోన్లు! పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజలు నిర్వహించాలని ప్రజలకు అవగాహన...

ఆరోగ్యకరమైన భవిష్యత్తుల కోసం ఫార్మసిస్ట్ ల సశక్తీకరణ!|PHARMACIST|HEALTH

(ప్రపంచ ఫార్మసిస్ట్ ల దినోత్సవం : 25 సెప్టెంబర్ 2026) ప్రపంచంలో ఔషధం అవసరం లేని మనిషి లేడంటే అతిశయోక్తి కాదు. ఔషధ ప్రయోక్తలైన ఫార్మసిస్ట్ లు ప్రతి నిత్యం ప్రపంచవ్యాప్తంగా ఔషధాలతో పాటు...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News