వెంకటేశ్వర స్వామి కళ్యాణంకు హాజరై ప్రత్యేక పూజలు
1974 నుండి ఏ ఎమ్మెల్యే పట్టించుకోని దేవాలయానికి ఎమ్మెల్యే రావడంతో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
జనగామ జిల్లా, పాలకుర్తి మండలం, తొర్రూరు(జె) గ్రామ శివారులో మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా కొండపై స్వయంభువుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణము, మల్లన్న పట్నాలు కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ అర్చకులు స్వామి వారి శేష వస్త్రాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఎమ్మెల్యే యశస్విని రాజా రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 1974 సంవత్సరంలో ఈ కొండపై వెంకటేశ్వర స్వామి వెలిశాడని, ఈ ఆలయం ఎంతో పురాతనమైనది అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా రాలేదని అందరు చెప్తున్నారు అని, ఈ గుట్టను అభివృద్ధి చేయలేదన్నారు. ఇలాంటి ఆలయాల చరిత్ర భవిష్యత్తు తరాలకు తెలియాల్సిన అవసరం వుంది అన్నారు. అందులో భాగంగా ఈ గుట్టను వచ్చే సంవత్సరం కళ్యాణం లోపు నిధులు కేటాయించి అభివృద్ధి చేసే బాధ్యత తాను తీసుకుంటానన్నారు. ఈ ప్రాంతాన్ని అందరం కలిసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేద్దాం అన్నారు.

ఇదే సందర్భంలో భక్తులు ఈ ఆలయానికి ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే రాలేదని, ఈ కళ్యాణానికి వచ్చిన మొట్ట మొదటి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాత్రమేనని, వారు రావడమే గాక అభివృద్ది చేస్తానని మాట ఇవ్వడంతో హర్షం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, భక్తులు, నాయకులు, అభిమానులు, పెద్ద ఎత్తున హాజరైన ప్రజలు పాల్గొన్నారు.



