HMPV
HMPV (హ్యూమన్ మెటాప్న్యుమో వైరస్) COVID-19, ఫ్లూ మరియు ఇతర శ్వాసకోశ సంబంధిత వ్యాధుల్లా కనిపిస్తుంది.
ఇది ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు, మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిని ప్రభావితం చేస్తుంది.
లక్షణాలు
- జ్వరం
- దగ్గు
- ముక్కు కారడం
- గొంతు నొప్పి
- తీవ్రత ఎక్కువగా ఉన్నవారిలో బ్రాంకైటిస్ మరియు నిమోనియా కనిపించవచ్చు.
- ఇన్ఫెక్షన్ సోకిన 3-6 రోజుల్లో లక్షణాలు బయటపడతాయి.
HMPV వ్యాపన మార్గాలు
1.తుమ్ములు మరియు దగ్గు వల్ల తుంపర్ల ద్వారా
వైరస్ సోకిన వ్యక్తి దగ్గు లేదా తుమ్ముతో వైరస్ పక్కవారికి వ్యాపిస్తుంది.
2.సన్నిహిత కాంటాక్ట్
వైరస్ సోకిన వ్యక్తుల దగ్గరగా మెలగడం వల్ల వ్యాప్తి చెందుతుంది.
3.బాధితులను తాకడం ద్వారా
బాధితులను తాకి ఆ చేతులను ముక్కు, కళ్లు, నోటిని తాకినప్పుడు వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
నివారణ మార్గాలు
1. చేతుల పరిశుభ్రత
చేతులను తరచూ సబ్బుతో కనీసం 20 సెకన్లపాటు శుభ్రంగా కడగాలి.
2. ముఖాన్ని తాకడం మానుకోవాలి
చేతులను శుభ్రం చేసుకోకుండా నోరు, ముక్కు, కళ్లను తాకకూడదు.
3. మాస్క్ ధరించడం
బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వ్యాధి వ్యాప్తిని తగ్గించవచ్చు.
4. అనారోగ్యంగా ఉన్నప్పుడు బయటికి వెళ్లకూడదు
వైరస్ లక్షణాలు ఉన్నప్పుడు ఇంట్లోనే ఉండాలి.
5. ప్రాసిగ్గతమైన ప్రదేశాలకు దూరంగా ఉండండి
రద్దీగా ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండడం మంచిది.
సూచన :
HMPV ప్రభావం ఎక్కువగా చిన్నారులు, వృద్ధులు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో కనిపిస్తుంది. ఈ వైరస్ తీవ్రతను అడ్డుకునేందుకు ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం.

