మాజీ ప్రధాన మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ గారు కన్నుమూయడంతో దేశవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేసిన ఆయన సేవలు అపారమని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆయన మృతిపట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
“మన్మోహన్ సింగ్ వంటి మహా నాయకుడు ఈ లోకాన్ని విడిచిపోవడం దేశానికి తీరని నష్టం. ఆయన తెలివితేటలతో దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపించారు. ప్రధాన మంత్రిగా, ఆర్థిక మంత్రి పాత్రలో ఆయన అందించిన సేవలు భారత ప్రజలు ఎన్నటికీ మరచిపోలేరు” అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి పేర్కొన్నారు.
ఝాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ, “మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో భారతదేశం ఆర్థిక వ్యవస్థలో అనేక ఒడిదొడుకులను అధిగమించింది. ఆయన సాదాసీదా వ్యక్తిత్వం, క్రమశిక్షణ దేశ రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచింది” అని అన్నారు.

