Thursday, September 24, 2026
25.8 C
Hyderabad

అవమానించినా, అభిమానించిన వీర విధేయుడు!!

మన పీవీ చెక్కిన శిల్పం మన్మోహనుడు!

-అసెంబ్లీ సంతాప తీర్మానంలో మాజీ మంత్రి హరీష్ రావు

కాంగ్రెస్ పార్టీలో తాను ఎన్ని ఇబ్బందులెదుర్కొన్నా, ఏనాడూ ఆ పార్టీని ఒక్క మాట కూడా అనని వీర విధేయుడు మన్మోహన్ సింగ్ అని మాజీ మంత్రి టి.హరీశ్ రావు కొనియాడారు. సోమవారం శాసనసభలో జరిగిన మన్మోహన్ సింగ్ సంతాప సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ స్మరణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన సంతాప తీర్మానాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన సంపూర్ణంగా బలపరుస్తున్నదని స్పష్టం చేశారు. మన్మోహన్ సింగ్ కు భారత రత్న ఇవ్వాలనే తీర్మానాన్ని సమర్ధిస్తున్నట్లు హరీశ్ రావు పేర్కొన్నారు. కొత్తగా ఏర్పాటు చేసే స్కిల్ యూనివర్సిటీకి మన్మోహన్ సింగ్ పేరు పెట్టాలని హరీశ్ రావు కోరారు. పెద్దల సభలో 33 సంవత్సరాలు పనిచేసిన మన్మోహన్ కు రాష్ట్ర పెద్దల సభ శాసనమండలిలో కూడా సమావేశం ఏర్పాటు చేసి నివాళులర్పిస్తే మరింత బాగుండేదని హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.

‘‘ ఒకనాడు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే, ఆ ఓటమికి మన్మోహన్ సింగ్, పీవీ ఆర్థిక విధానాలు కారణమని ఏఐసీసీ ఆంటోనీ కమిటీ రిపోర్టు ఇచ్చింది. దీనిపై ఏఐసీసీలో చర్చపెడితే మన్మోహన్ కంట తడి పెట్టారే తప్ప, తనను కాంగ్రెస్ నాయకులే తప్పుపట్టారని బాధపడలేదు, కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. ఆనాడు మన్మోహన్ సింగ్ కంటతడి పెట్టిన వార్తపై దేశమంతా చర్చ జరిగింది’’ అని హరీశ్ రావు గుర్తు చేశారు.
‘‘ మరో సందర్భంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ గారికి రెండేళ్ల జైలు శిక్ష పడితే, లాలూను రక్షించేందుకు ఒక ఆర్డినెన్స్ తెచ్చారు. అపుడుప్రధానిగా ఉన్న మన్మోహన్ నిర్ణయం సరైందేనంటూ ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ పెట్టారు. హఠాత్తుగా అక్కడికి వచ్చిన రాహుల్ గాంధీ వచ్చి ఆర్డినెన్స్ కాపీలను చింపివేశారు. ఒక ప్రధానిగా మన్మోహన్ సింగ్, వారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే, దాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉన్న రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అయినా, మన్మోహన్ మౌన మునిలానే ఉన్నారు తప్ప, నోరు తెరిచి ఒక్క మాట కూడా అనలేదని, అందుకే కాంగ్రెస్ వీర విధేయుడు మన్మోహన్ సింగ్’’ అని హరీశ్ రావు పేర్కొన్నారు.
అదేవిధంగా రెండోసారి ఏర్పాటైన యూపీఏ ప్రభుత్వంలో చాలా కుంభకోణాలు,కేసులు, అరెస్టులు జరిగినట్లుగా వార్తలు వచ్చాయని, అపుడు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ ఒక చిన్న మచ్చకూడా రాకుండా చూసుకున్నారంటే, అది వారి గొప్పతనమేనని హరీశ్ రావు కొనియాడారు. కేంద్ర కేబినెట్లో చేరిన కేసీఆర్ కు నౌకాయాన మంత్రి పదవినిస్తే, డీఎంకే పార్టీ కోసం ఆ శాఖను త్యాగం చేసి, తెలంగాణ కోసం 6 నెలల పాటు ఏశాఖ లేని కేంద్రమంత్రిగా ఉన్నారని మన్మోహన్ సింగ్ కేసీఆర్ ను ప్రశంసించారని హరీశ్ రావు గుర్తు చేశారు.
మన్మోహన్ సింగ్ ను తన కేబినెట్లోకి ఆర్థికమంత్రిగా తీసుకొని, దేశ రాజకీయాలకు పరిచయం చేసింది తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నర్సింహరావేనని, పీవీ నమ్మకాన్ని నిలిపిన మన్మోహన్ దేశ ఆర్థిక రంగానికి దశ, దిశను చూపారన్నారు.
కారణాలేమోగానీ పీవీ గారు మరణించిన రోజు కాంగ్రెస్ పట్టించుకోలేదని, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆరే పీవీ ఘాట్ ను, పీవీ పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేశారని హరీశ్ రావు గుర్తు చేశారు. పీవీ నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి, పీవీ జయంతి, వర్థంతులను అధికారికంగా జరిపించింది కూడా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనేనన్నారు. అంతేగాకుండా పీవీగారి శతజయంతి ఉత్సవాలను ఘనంగా జరిపి, మన పీవీ, మన ఠీవి అని పీవీ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఘనత కూడా కేసీఆర్ గారిదేనని హరీశ్ రావు అన్నారు.

Latest News

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

సెప్టెంబర్ 22, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ఏకాదశి రాత్రి 07.23 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 06.14 వరకు ఉపరి శ్రవణ యోగం అతిగండ సాయంత్రం 04.49 వరకు ఉపరి సుకర్మ కరణం వణజి ఉదయం 06.34...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News