Saturday, May 9, 2026
24.7 C
Hyderabad

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు. అభివృద్ధి పేరుతో అప్పులు పెంచడం, సంక్షేమం పేరుతో ఖర్చులు విస్తరించడం కలసి ఖజానాపై భారంగా మారుతున్నాయి.

భారత రాష్ట్రాల సగటు అప్పు-జీడీపీ నిష్పత్తి 25% నుంచి 30% మధ్యలో ఉంది. కొన్ని రాష్ట్రాల్లో ఇది 35% దాటింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు భారీగా అప్పులు తీసుకుని మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. అయితే సమస్య అప్పులు తీసుకోవడంలోనే కాదు, వాటిని ఎలా వినియోగిస్తున్నాం? ఎలా తీరుస్తామన్నదే కీలకం. ఉత్పాదక రంగాల్లో పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఆదాయం వస్తుంది. కానీ జీతాలు, సబ్సిడీలు, రాజకీయ ప్రయోజనాల కోసం ఖర్చు చేస్తే అది నిరర్థకమై దీర్ఘకాలిక భారంగా మారుతుంది.

ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద భాగం వడ్డీ చెల్లింపులకే వెళ్తోంది. కొన్ని అంచనాల ప్రకారం, కొన్ని రాష్ట్రాల్లో మొత్తం ఆదాయంలో 15% నుంచి 20% వరకు వడ్డీలకే ఖర్చవుతోంది. మరోవైపు ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు కలిపి 30% నుంచి 40% వరకు వెళ్తున్నాయి. అంటే అభివృద్ధి పనులకు మిగిలేది పరిమితమే. ఇదే పరిస్థితి కొనసాగితే “డెట్ ట్రాప్”లో పడే ప్రమాదం ఉంది.

ఉచిత పథకాల అంశం కూడా ఈ నేపథ్యంలో ప్రస్థావనీయమే. ఉచిత రేషన్, ఉచిత విద్యుత్, పెన్షన్లు వంటి పథకాలు పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో పాత్ర పోషిస్తున్నాయి. అయితే వీటి వ్యయం అనేక రాష్ట్రాల్లో బడ్జెట్‌లో 10% నుంచి 15% వరకు చేరింది. సమస్య ఏమిటంటే, ప్రయోజనం లేకుండా అమలు చేస్తే అనర్హులకూ లబ్ధి చేరుతుంది. ఫలితంగా ఖర్చు పెరుగుతుంది కానీ ఫలితం తక్కువగా ఉంటుంది.

ఇక రాజకీయ నియామకాలు, సలహాదారుల వ్యవస్థ కూడా ఖర్చులను పెంచుతున్న అంశమే. అవసరమైన నిపుణుల కంటే ఎక్కువగా నియామకాలు జరిగితే అది ఆర్థికపరంగా భారంగా మారుతుంది. ఒక సలహాదారికి నెలకు లక్షల రూపాయల జీతం, ఇతర భత్యాలు కలిపి సంవత్సరానికి కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. ఇలాంటి పదవులు పదుల సంఖ్యలో ఉంటే మొత్తం ఖర్చు ఎంతవుతుందో అంచనా వేయడం కష్టం కాదు.

రాష్ట్రాలు ఆదాయం పెంచుకునేందుకు భూముల విక్రయం, మద్యం ధరల పెంపు, పరోక్ష పన్నుల విధానం వంటి మార్గాలను అనుసరిస్తున్నాయి. అయితే ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. భూములు అమ్మడం ఒకసారి జరిగే ఆదాయం. మద్యం మీద ఆధారపడటం సామాజిక సమస్యలకు దారి తీస్తుంది. పన్నుల భారంతో మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడతారు.

అయితే, పరిష్కారం ఏమిటి? ఖర్చుల ప్రాధాన్యతను పునఃసమీక్షించాలి. అత్యవసర సంక్షేమం, ఆరోగ్యం, విద్య, మౌలిక వసతులు వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. నిర్ణీత సంక్షేమ పథకాలనే అమలు చేయాలి. డిజిటల్ డేటా ఆధారంగా అర్హులను గుర్తించి, అనర్హులను తొలగించాలి. దీనివల్ల 20% వరకు ఖర్చు తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఆదాయం పెంపుపై దృష్టి పెట్టాలి. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, పన్నుల ఆదాయం కూడా పెరుగుతుంది. సేవల రంగం ప్రత్యేకంగా ఐటీ, పర్యాటకం రాష్ట్రాలకు పెద్ద ఆదాయ వనరుగా మారగలదు. వ్యవసాయరంగంలో ప్రాసెసింగ్, ఎగుమతులు పెంచితే రైతుల ఆదాయం పెరుగుతుంది, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది.

అప్పుల నిర్వహణలో క్రమశిక్షణ అవసరం. తీసుకునే అప్పులపై పరిమితి విధించడం, వడ్డీ భారాన్ని తగ్గించే విధంగా పునర్వ్యవస్థీకరణ చేయడం అవసరం. పారదర్శకత కూడా కీలకం. ప్రజలకు ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలి.

రాజకీయ సంకల్పమే అత్యంత ముఖ్యమైనది. ఎన్నికల లాభనష్టాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. తక్షణ ప్రయోజనాల కోసం దీర్ఘకాలిక నష్టాలను విస్మరించడం ప్రమాదకరం. అభివృద్ధి, సంక్షేమం రెండూ అవసరమే. కానీ, వాటి మధ్య సమతుల్యత ఉండాలి.

రాష్ట్రాలు ఆర్థికంగా బలపడాలంటే “అప్పులు తగ్గించడం” ఒక్కటే మార్గం కాదు. “సరైన విధంగా అప్పులు వినియోగించడం”, “ఆదాయం పెంచడం” జరగాలి. ఇదే నిజమైన ఆర్థిక సంస్కరణలకు పునాది.

Latest News

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

07-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 06.31 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం సాధ్య రాత్రి 10.59 వరకు ఉపరి శుభ కరణం తైతుల ఉదయం 06.31...

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News