Friday, September 25, 2026
27.1 C
Hyderabad

శాంతి జపం! యుద్ధ తపం!?|EDITORIAL

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. 30ఏళ్ళ తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అగ్ర రాజ్య అధ్యక్షుడు, ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని అన్నారు. అణ్వాయుధ పరీక్షలపై ట్రంప్‌ ప్రపంచ దేశాలకు మాత్రమేగాక, భారత్ కు కూడా షాకిచ్చారు. అంతేకాదు తాజాగా ఆయన తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తామే కాదు, చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌ సహా ప్రపంచంలో అనేక దేశాలు రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని సీబీఎన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వెల్లడించారు! అమెరికా అధ్యక్షుడి మాటలు చూస్తేంటే ట్రంప్ లో శాంతి జపమూ, యుద్ధ తపమూ కలగలిసి ఉన్నట్లు కనిపిస్తున్నది.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

సంచలనాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో బాంబు పేల్చారు. 30ఏళ్ళ తర్వాత అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభిస్తున్నామని ఇటీవలే ప్రకటించిన అగ్ర రాజ్య అధ్యక్షుడు, ఆ జాబితాలో పాకిస్తాన్ కూడా ఉందని అన్నారు. అణ్వాయుధ పరీక్షలపై ట్రంప్‌ ప్రపంచ దేశాలకు మాత్రమేగాక, భారత్ కు కూడా షాకిచ్చారు. అంతేకాదు తాజాగా ఆయన తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. తామే కాదు, చాలా దేశాలు అణ్వాయుధాలను పరీక్షిస్తున్నాయన్నారు. రష్యా, చైనా, ఉత్తర కొరియా, పాకిస్థాన్‌ సహా ప్రపంచంలో అనేక దేశాలు రహస్యంగా అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని సీబీఎన్‌ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్‌ వెల్లడించారు.

‘ఆయా దేశాలు వాటి గురించి మాట్లాడడం లేదు. రష్యా, చైనాల కంటే తమ వద్దే ఎక్కువగా ఉన్న అణ్వాయుధాలతో ఈ ప్రపంచాన్ని 150 సార్లు ధ్వంసం చేయవచ్చన్నారు. అయినప్పటికీ అణ్వస్త్రాల నిరాయుధీకరణ గురించి తాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మాట్లాడానని ట్రంప్‌ తెలిపారు.

అమెరికా అధ్యక్షుడి మాటలు చూస్తేంటే ట్రంప్ లో శాంతి జపమూ, యుద్ధ తపమూ కలగలిసి ఉన్నట్లు కనిపిస్తున్నది. అలాగే ప్రపంచాన్ని హెచ్చరిస్తూ, బెదిరింపులకు కూడా ట్రంప్ పాల్పడుతున్నారు. అయితే, ట్రంప్‌ ఆదేశాలపై అమెరికా ఇంధనశాఖ కార్యదర్శి క్రిస్‌ రైట్‌ వివరణ ఇచ్చారు. తాము జరపబోయే అణుపరీక్షల్లో ఎలాంటి విస్ఫోటాలు ఉండవన్నారు. వ్యవస్థలన్నీ నిర్దేశిత లక్ష్యం మేరకు పనిచేస్తున్నాయో లేదో తెలుసుకునేందుకే ఈ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ట్రంప్‌ వ్యాఖ్యలను చైనా తీవ్రంగా ఖండించింది. తమ దేశం ఎల్లప్పుడూ శాంతియుత అభివృద్ధి మార్గానికి కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. అణ్వాయుధాల విషయంలో ‘ముందుగా వినియోగించకూడదు’ అనే విధానంతోపాటు, తమ అణు వ్యూహం పూర్తిగా రక్షణాత్మకమైనదని పేర్కొంది.

ఇక ట్రంప్‌ హెచ్చరికలు భారత్ కేనా? పాక్ భుజంపై తుపాకీని ఎక్కుపెట్టి భారత్ ను టార్గెట్ చేస్తున్నారా? అన్న అనుమానాలు కలగక మానవు. ఇటీవల భారత్‌పై పాక్ ఉగ్రదాడికి నిరసనగా చేసిన ఉగ్రమూకలపై దాడి సందర్భంగా మన ఆయుధ పాఠవం ప్రపంచానికి, ముఖ్యంగా అమెరికాకు తెలిసొచ్చింది. భారత్ తమను ధిక్కరించే స్థాయికి చేరుకుందన్న భయం కూడా ఈ వ్యాఖ్యలకు కారణం కావచ్చు. పాక్‌కు అమెరికా ఇచ్చిన యుద్ధ విమానాలను తుత్తునియలు చేసింది. దీంతో భారత్‌తో సమానంగా పాక్‌ను కూడా చేర్చి రెండు అణ్వాయుధ దేశాలు అంటూ పదేపదే వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు పాక్‌ కూడా అణ్వాయుధ పరీక్షలు చేస్తోందన్నారు. ఇదంతా కూడా పాక్‌లో పాగావేసి, అక్కడి నుంచి అవసరమైతే భారత్‌, చైనాలపై దాడులకు దిగాలన్న అ మెరికా కుయక్తులు అర్థమవుతూనే ఉన్నాయి. అందుకే భారత్‌ వ్యతిరేక చర్యలపై ట్రంప్‌ స్పీడ్‌ పెంచారు. సుంకాలు, వీసాలు, అమెరికాలో అనధికారికంగా ఉన్నవారిని వేధించి, వెక్కరించి తిప్పిపంపడం, ఉద్యోగాల్లో భారీతయులను తొలగించాలన్న డిమాండ్‌, వంటివన్నీ కూడా ఆపరేషన్‌ సింధూర్‌ తరవాత తీసుకున్న గట్టి నిర్ణయాలు.

ఇదే సందర్భంలో పుతిన్‌, జిన్‌పింగ్‌ చాలా కఠినాత్ములు, బలమైన నాయకులు, తీవ్రంగా పరిగణించాల్సిన వ్యక్తులు అని నేరస్తులపైలా వ్యాఖ్యానించారు.‘మేము చైనాని ఓ కంట కనిపెడతాం. వారు అమెరికాను ఎల్లప్పుడూ కనిపెడ్తూ ఉంటార’ని అన్నారు. గత 8 నెలల్లో 8 యుద్ధాలను ఆపానని, భారత్‌, పాక్‌ల మధ్య అణుయుద్ధాన్ని నివారించానని మరోసారి వ్యాఖ్యానించారు.

అయితే,ఇప్పటికే ట్రంప్‌ మీద స్వదేశంలో తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. విదేశాల్లో కుట్రలు చేస్తున్నారని, భారత్‌ లాంటి మిత్రదేశాన్ని దూరం చేసుకుంటున్నారని మండిపడు తున్నారు.

ఇదే అవకాశంగా ట్రంప్ వ్యాఖ్యలపై ఇస్లామాబాద్‌ స్పందించింది. తామెప్పుడు ఇతర దేశాల కంటే ముందుగా అణు పరీక్షలను పునరుద్ధరించబోమన్నారు. అణు పరీక్షలను నిర్వహించిన మొదటి దేశం పాక్‌ కాదని.. అదేవిధంగా అణు పరీక్షలను తిరిగి ప్రారంభించే మొదటి దేశంగానూ తాము ఉండబోమని స్పష్టం చేశారు. ఈ విషయంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావో నింగ్‌ సైతం స్పందించారు. బాధ్యతాయుతమైన అణ్వాయుధ దేశంగా చైనా ఎల్లప్పుడూ ఆత్మరక్షణ అణువ్యూహాన్ని సమర్థిస్తుందన్నారు. అణు పరీక్షలు నిలిపివేయాలనే విషయంలోనూ తాము అదే నిబద్ధతకు కట్టుబడి ఉంటామన్నారు.

మొత్తంగా అమెరికా అణుపరీక్షల వ్యవహారం ఎలా ఉన్నా రష్యాచ,చైనాల సరసన పాక్‌ను కూడా చేర్చడం వెనక భారత్‌ను బెదరించే ధోరణిని ట్రంప్‌ ప్రకటించారు. పాక్‌ను భారత్ పక్కలో బల్లెంగా ఎగదోసే పనిలో ట్రంప్‌ బిజీగా ఉన్నాడు. అందువల్ల ఎప్పటికైనా అమెరికాతో, ట్రంప్‌తో జాగ్రత్తగా ఉండాల్సిందే.

Latest News

సెప్టెంబర్ 25, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చతుర్దశి రాత్రి 09.53 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం శతభిషం ఉదయం 11.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శూల పగలు 03.50 వరకు ఉపరి గండ కరణం గరజి ఉదయం 09.43...

SIRపై CJP సమరం..|SIR|CJP

సీఈసీకి 48 గంటల డెడ్‌లైన్! న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ **(SIR)**పై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ 48 గంటల్లో...

తెలంగాణ వార్‌రూమ్‌ టు ఢిల్లీ వార్‌రూమ్‌|TELANGANA|WAR ROOM|DELHI|WAR ROOM

రుద్ర సంతోష్‌ కుమార్‌కు ఏఐసీసీలో కీలక బాధ్యతలు హైదరాబాద్‌: తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని క్షేత్రస్థాయి వరకు సమన్వయం చేసిన కాంగ్రెస్‌ నాయకుడు రుద్ర సంతోష్‌ కుమార్‌కు జాతీయ స్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించారు. జాతీయ...

జింబాబ్వేలో ఘనంగా గణేష్ శోభాయాత్ర|ZIMBABWE|GANESH|SHOBHA YATRA

రూ.8 లక్షలకు లడ్డూ సొంతం చేసుకున్న బద్దం నరేష్ రెడ్డి జింబాబ్వే రాజధాని హరారేలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. హరారే గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో తొమ్మిది రోజులపాటు నిర్వహించిన వేడుకలు...

యికటి0చిన ముద్దు కటకాలు సూపింది!?|ADUGU TRENDS

ము ము ముద్దంటే చేదా?! ఆ ఉద్దేశ్యం లేదా? అన్నరు. ముద్దంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ ఉద్దేశ్యం ఉందో? లేదో తెలుసుకోకపోతే, ముద్దూ, ముచ్చటా యికటిత్తయి. కటకాలు కూడా సూపిత్తయి. ముద్దుకైన, ముచ్చటకైన...

ఊగిసలాటకు ఊతం భద్రతే!|EDITORIAL

చమురు ధరల ఊగిసలాటకు తాత్కాలిక దౌత్య పరిణామాలు మాత్రమే కాకుండా యుద్ధం, రవాణా అంతరాయాలు, ఉత్పత్తి సామర్థ్యం, భద్రతా ముప్పులు కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో శాంతి నెలకొని, అంతర్జాతీయ నౌకా రవాణా సాధారణ స్థితికి...

సెప్టెంబర్ 24, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు త్రయోదశి రాత్రి 09.33 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం ధనిష్ఠ ఉదయం 09.58 వరకు ఉపరి శతభిషం యోగం ధృతి సాయంత్రం 04.34 వరకు ఉపరి శూల కరణం కౌలవ ఉదయం 09.08...

గా ఊర్ల పేమ పెండ్లిల్లు నిషేధం!?|ADUGU TRENDS

ఇగీ మద్దెల ఏడ సూసినా, లవ్వు మ్యారేజీలు, లివింగ్ టుగెదర్లేనాయె! గియి ఊర్లు, మండలాలు, జిల్లాలు, రాష్ట్రాలు దాటి దేశాలు, ఖండాంతరాలకు విస్తరించినయి. ఇగ కులం లేదు, మతం లేదు. ఇల0 లేదు....

యూపీ విభజన ప్రతిపాదనా? రాజకీయ వ్యూహమా?|EDITORIAL

దేశంలో చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై చర్చ జరగడం సహజమే. కానీ ఇలాంటి నిర్ణయాలు ప్రజల దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని తీసుకోవాలి. యూపీ విభజనపై రాజ్‌భర్‌ చేసిన ప్రకటన అధికారిక విధానంగా మారుతుందా?...

సెప్టెంబర్ 23, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు ద్వాదశి రాత్రి 08.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం శ్రవణ ఉదయం 08.18 వరకు ఉపరి ధనిష్ఠ యోగం సుకర్మ సాయంత్రం 04.50 వరకు ఉపరి ధృతి కరణం బవ ఉదయం 08.03...

పుతిన్ తిరుగులేని నేతేనా!?|EDITORIAL

పుతిన్ రాజకీయ పట్టు బలపడినప్పటికీ, ప్రతిపక్ష స్వేచ్ఛ, ఎన్నికల పారదర్శకత, యుద్ధానికి ముగింపు వంటి అంశాలపై రష్యా ఎదుర్కొంటున్న ప్రశ్నలు అలాగే ఉన్నాయి. ఈ నేపథ్యంలో పుతిన్ ఆధిపత్యాన్ని కేవలం సీట్ల సంఖ్యతో...

బంగారం కొనే ముందు గీ మూడు సూడాలే!|ADUGU TRENDS

మనం బంగారం, నగలు ఏడ కొంటం? ఔసలోల్ల దగ్గర, బంగారం దుకాణాల్ల కొంటం .పెద్దపెద్ద దుకాణాలకు కూడా పోయేటోల్లు ఉంటరు. కానీ, గీ మూడు ముఖ్యమైన ముచ్చట్లు పట్టించుకోం. కానీ మన సర్కార్...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News