Tuesday, August 4, 2026
29.8 C
Hyderabad

ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట లేదా!?|EDITORIAL

దేశంలో ఆర్థిక నేరాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సరిహద్దులు దాటి ఇతర దేశాల నేరగాళ్ళు మన ప్రజలపై దోపిడీకి దిగుతున్నా సరిదిద్దుకోలేకపోతున్నాం. దేశంలో ఆర్థిక నేరాలకు పాల్పడిన నేరగాళ్ళు ఇతర దేశాల్లో స్థిరపడి ఎంజాయ్ చేస్తున్నా వారిని పట్టుకొచ్చే పనిలో మన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ప్రజలు కష్టపడి సంపాదించుకున్నది ఇంటా బయటా దోపిడీ అవుతున్నా రక్షణ లేకుండా పోయింది. చివరకు బ్యాంకులు కూడా తమ పూచీ లేకుండా ప్రవర్తించే తీరు అత్యంత దారుణం. తీసుకున్న అప్పులకు ఖాతాదారులు బాధ్యత వస్తున్న విధంగా ఆ ఖాతాదారులు దాచుకున్న డబ్బు, నగానట్రాకు ఆ బ్యాంకులు కూడా బాధ్యత వహించాలి కదా! సరే, ఆర్థిక నేరాల అదుపునకు ప్రభుత్వాలు చేస్తున్నదేంటి? ప్రజల విలువైన ప్రాణాలకు, వారు కూడబెట్టుకున్న ఆస్తులకు, దాచుకున్న డబ్బులకు రక్షణ, భద్రత లేకుపోతే మనం ఏ సమాజంలో బతుకుతున్నాం? ప్రజాస్వామ్యంలోనేనా? పరస్పరం పీక్కుతినే ఈ దోపిడీకి అంతుపొంతు, అడ్డూ అదుపూ లేదా?

ప్రపంచంలో కొందరిలో, ఆ మాటకొస్తే ప్రజల్లో ‘ఈజీ మనీ’ అనే ఓ జాఢ్యం వేళ్ళూనుకుని, పెరిగి పెద్దదై తన విక్రుత రూపాలను రకరకాలుగా ప్రదర్శిస్తున్నది. ఎలాగైనా డబ్బులు సంపాదించాలి. ఎంజాయ్ చేయాలి? అందుకు ఏ దారైనా ఫరవాలేదు. ఒకప్పుడు దోపిడీలు, దొంగతనాలు జరిగేవి. వస్తువులను ఎత్తుకుపోయేవారు. ఫలానా దోపిడీ జరిగిందంటే ఫలానా వాళ్ళే చేసి ఉంటారన్న క్లూ లు పోలీసులకు దొరికేవి. దొంగలు కూడా కన్నాలు వేసే వాడు డోర్లు బార్లా తెరిచి ఉన్నా కన్నాలు మాత్రమే వేసేవాడు. ఇప్పుడలా కాదు. పుట్టి, పెరిగి పెద్దదై పోయిన శాస్త్ర సాంకేతికతను నేరగాళ్ళు విరివిగా విస్తారంగా వినియోగిస్తున్నారు. అర చేతిలో వైకుంఠం లాగా వచ్చిన స్మార్ట్ ఫోన్ ప్రపంచాన్నే ఆసరా చేసుకుని, ఇస్మార్ట్ గా దోపిడీలు చేసేస్తున్నారు. తెలియని నెంబర్ల ఫోన్ ఎత్తితే, మెస్సేజ్ లు, లింకులు ఓపెన్ చేస్తే, చేయకపోయినా బ్యాంకుల అక్కౌంట్లల్లో డబ్బులు ఇట్టే మాయం అవుతున్నాయి. వీళ్ళందరినీ సైబర్ నేరగాళ్ళంటున్నారు. అల్లారు ముద్దుగా పెంచుతూ, వాడు తినడానికి ఫోన్ బూచీని చేతిలో పెట్టి, అలవాటు చేసి, అదే చదవాలని ఒత్తిడి చేసి, లక్షలు, కోట్లు పోసి, చదివించి, అలాంటి ఉద్యోగాలే చేయాలని ప్రోత్సహించి, బాగా చదవుకోరా? గొప్పగా ఎదగరా? అంటూ మనం చదివించిన మన పోరగాళ్ళే, పోకిరీలే ఈ దోపిడీ ముఠాలుగా మారుతున్నారు. ఫోన్లు మాత్రమే కాదు, ఫోన్ల సమాచారం మాత్రమే కాదు, బ్యాంకుల్లో దాచుకున్న డబ్బులు మాయం అవుతుంటే తెల్లబోవడం తప్ప చేయగలిగింది లేకుండా పోతోంది. పనిలోపనిగా కొందరు ప్రజల్లో ఈ ఈజీ మనీ బలహీనతలను కూడా సొమ్ము చేసుకుంటూ అనేకానేక యాప్ ల దాకా, కష్టపడి ఏదో చేద్దామనుకునే వారికి వర్క్ ఫ్రం హోం పేరుతో.. ఇలా అనేక కొత్త కొత్త దోపిడీ ఆవిష్కరణలు కూడా జరుగుతూనే ఉన్నాయి.

ఇక బ్యాంకులకు లక్షల కోట్లు ఎగవేసిన మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వారంతా విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. దేశంలోనే ఉన్న మరికొందరు ఎగవేతదారులు రాజకీయాలను అడ్డం పెట్టుకుని దర్జాగా బతికేస్తున్నారు. రాజకీయాల్లో ఉంటూ అవినీతికి పాల్పడుతున్న వారు పదవులు వెలగబెడుతున్నారు. రాష్ట్రాల వనరులను లూటీ చేసిన వారు, దేశ సంపదను దోచిన వారు మన ఓట్లతో గెలిచి, మనమిచ్చిన పదవులతో మనలనే పరిపాలిస్తున్నారు. రాజకీయ నాయకుల, వ్యాపారుల అవినీతి కారణంగా దేశ వనరులు దెబ్బతింటున్నాయి. ఖజానా ఖాళీ అవుతోంది. వారి జీత భత్యాలు, వారి విలాసాల కారణంగా లక్షల కోట్లు ఏటా వృధా అవుతున్నాయి. ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకులను మేపడానికి అవుతున్న లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలగమానదు. అధికారం, దర్పం అనుభవించడానికే చాలామంది రాజకీయాల్లో ఆసక్తి చూపుతున్నారు. కానీ సామాన్యులు, ఓట్లేసిన వారు మాత్రం అడుక్కునే పరిస్థితి కల్పించి వారికి ఉచిత పథకాల బిచ్చమేస్తున్నారు.

అవినీతి, అక్రమాల కట్టడి చేయడంలో పాలకులు పూర్తిగా విఫలం అవుతున్నారు. అనేక అక్రమాలు వెలుగుచూస్తున్నా, అరికట్టడంలో విఫలం అవుతున్నారు. ఇక దేశంలో విరవివిగా రుణాలు ఇచ్చి, ఉపాధిరంగాలను ప్రోత్సహిస్తే యువత సమస్య తీరేది. నిరుద్యోగులకు ఉపాధి దక్కేది. భారతీయ బ్యాంకులు సామాన్యులకు రుణాలు ఇవ్వండంలో ఎంత కఠినంగా ఉంటున్నాయో సూటుబూటు వేసుకుని వచ్చే వారికి అప్పనంగా వేలకోట్లు కట్టబెట్టి రుణాలు ఇస్తున్నాయి. విజయ్ మాల్యా, నీరవ్‌ మోడీ లాంటి వారు ఇలాగే బ్యాంకులకు వేలకోట్లు ఎగవేసి విదేశాల్లో ఎంజాయ్‌ చేస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ 11 ఏళ్ల పాలనలో వీరిని పట్టుకుని తీసుకుని రావడంలో పూర్తిగా విఫలం అయ్యారు. విదేశీ నల్ల ధనాన్ని ధనా ధన్ మన దేశానికి తెచ్చేస్తేనానని చెప్పి ముచ్చటగా మూడోసారి మోడీ అధికారంలోకి వచ్చేశారు. నిజానికి మన బ్యాంకులు సులభంగా పేద, మధ్య తరగతి ప్రజలకు రుణాలు ఇచ్చినట్లయితే ఉపాధి రంగం బలపడేది. పెట్టుబడుల కోసం మన పాలకులు విదేశాల చుట్టూ తిరగాల్సిన అవసరం వచ్చేది కాదు. ప్రభుత్వాల రుణ పథకాలు కూడా సామాన్యులకి అందడం లేదు. అలాగే ప్రజలు కూడా ఇచ్చిన రుణాలు చెల్లించాలన్న శ్రద్ధ కనబర్చడం లేదు. ప్రజల నుంచి ప్రభుత్వాల దాకా ఎగవేత ఆలోచనే. కనీసం ముక్కూ, ముఖం చూడకుండా లోన్‌ ఇస్తామంటే ఎవరు కాదంటారు? అవసరం ఉన్నా లేకున్నా తీసుకుంటారు! కానీ, ఆ తరువాతే అసలు సినిమా మొదలవుతుంది. ఫోన్లలోనే బెదిరింపులు, వేధింపులు, చావులు.

ఇక అప్పుల యాప్‌లు… చైనాకు చెందినవిగా పోలీసులు చెబుతున్నారు. కొందరు దేశంలోని నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌తో ఒప్పందం కుదుర్చుకుని, రుణాలిస్తున్నట్లు సైబర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొందరు ఆర్బీఐ మార్గదర్శకాలను పట్టించుకోకుండా అధిక వడ్డీలు వసూలు చేస్తూ వేధింపులకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని అరికట్టడమే గాకుండా బ్యాంకుల రుణ పద్దతిని ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాలి. బ్యాంకులు ప్రజల డబ్బుతో పెద్దలకు దోచిపెట్టడం గాకుండా బతికేందుకు అసవరమైన విధంగా రుణాలు ఇవ్వగలగాలి. సైబర్ నేరాలను అరికట్టాలి. మొత్తం నేరాల అదుపు కోసం ప్రత్యేక విధి విధానాలు అవసరం. దేశ రక్షణ వ్యవస్థ లాగే ఇవ్వాళ నేరాల రక్షణ కూడా అత్యవాశ్యం.

Latest News

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News