Thursday, July 30, 2026
23.4 C
Hyderabad

రాష్ట్రంలో వర్షాలు|Rain

అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి|CM|REVANTH REDDY ఆదేశాలు

STATE|రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం|CM స్పష్టం చేశారు. వాతావరణ శాఖ సూచనల ప్రకారం, రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉన్నందున అన్ని శాఖలూ సమన్వయంతో పనిచేయాలని సీఎం సూచించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మార్కెట్లలోని ధాన్యం తడిపోకుండా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు వర్షాల వల్ల ఇబ్బందులు పడకుండా పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని సూచించారు. ఎలాంటి అనుకోని పరిస్థితులు తలెత్తకుండా అన్ని కలెక్టర్లు|COLLECTOR తక్షణం అప్రమత్తంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరంలో వర్షం పడుతున్న ప్రాంతాల్లో రోడ్లపై నీరు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా చూడాలని సంబంధిత శాఖలను సీఎం ఆదేశించారు. జీహెచ్ఎంసీ|GHMC, పోలీస్|POLICE, హైడ్రా|HYDRAA, ట్రాఫిక్|TRAFFIC మరియు విద్యుత్ శాఖల మధ్య సమన్వయం కీలకం అని పేర్కొన్నారు. ఎలాంటి సమాచారం వచ్చినా వెంటనే స్పందించేలా యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని సూచించారు.

వర్షాల దృష్ట్యా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకాలను ఇవ్వాలని సీఎస్‌ను సీఎం ఆదేశించారు. ప్రజల భద్రతకు ఎటువంటి ఆటంకం కలగకుండా ముందస్తుగా అన్ని శాఖలు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు.

Latest News

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News