Monday, August 3, 2026
31.5 C
Hyderabad

ఈ ప్రశ్నలకు బదులేవీ!?

యుద్ధాన్ని ఆదిలోనే ఎందుకు అపారు? ఎవరిని అడిగి కాల్పుల విరమణ చేశారు? ఎందుకు పాకిస్తాన్ పై పూర్తిస్థాయి దాడికి పూనుకోలేదు. పాక్‌ జుట్టు మన చేతికి అందే సమయంలో మోడీ ఎందుకు లొంగిపోయారు. మధ్యలో అమెరికా పెత్తనమేంటి? గత పాలకులు ఆ మాటకు వస్తే పాక్ పాలకుల మాదిరిగానే పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్యను పరిష్కరించడం బీజేపీకి, మోడీకి కూడా ఇష్టం లేదా? నేను దాడి చేసినట్లు చేస్తా? నీవు ధ్వంసం జరిగినట్లు గగ్గోలు పెట్టాలని ఏమైనా ముందే నిర్ణయించుకున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఇప్పుడు భారత ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై దూసుకు వస్తున్నాయి. ఇదే సమయంలో కాంగ్రెస్‌, ఆనాడు ఇందిరా గాంధీ ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గలేదని, నాటి ఆమె ప్రసంగాలను సోషల్‌ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరి మోడీ అమెరికా ఒత్తిడికి లేదా పాక్‌కు తలొగ్గారా? ఎందుకు? రాజకీయంగా అంతా అనుమానిస్తున్నట్లు మోడీకి కూడా కలిసి వస్తే మరిన్ని సార్లు అధికారంలో ఉంటే చాలన్న ఆలోచనలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నల పరంపర కొనసాగుతున్నది.

భారత్ నుండి పాకిస్తాన్ విడిపోయినప్పటి నుండే పాక్ కు భారత్ పట్ల వ్యతిరేకత ధోరణి వేళ్ళూనుకుని, విస్తరించి, వికటించి, విద్రోహంగా మారి ఉగ్రవాద రూపానికి చేరింది. అది పహల్గాం ఉగ్రదాడితో మరోసారి బయటపడింది. అత్యంత అమానవీయంగా, హేయంగా, దయనీయంగా కుటుంబ సభ్యుల ముందే మతం పేరుతో మారణహోమం స్రుష్టించారు. ఇది భారత ప్రజలను ఎంతగానే కలచివేసింది. పాక్ పని పట్టాలన్న కసి పెరిగింది. దీనికి తగ్గట్లుగానే కేంద్ర ప్రభుత్వం పాక్ లోని ఉగ్రవాదులును మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సిందూర్ ను ప్రారంభించింది. అయితే, పాకిస్తాన్, మన భారత ప్రజలను లక్ష్యంగా చేసుకుని చేసిన దాడులను తిప్పి కొడుతూనే, ఆ ప్రయత్నాలను నిర్వీర్యం చేస్తూనే, పాకిస్థాన్ ఉగ్ర స్థావరాలతోపాటు, పాక్ ఎయిర్ బేస్ లను విధ్వంసం చేసింది. త్రివిధ దళాలు ముప్పేట పాక్ పై దాడులు జరిపారు. దీంతో రెండు రోజుల్లోనే పాక్ దిమ్మ తిరిగి, మైండ్ బ్లాక్ అయింది. అమెరికా జోక్యంతో ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణకు దారి తీసింది. అయినప్పటికీ పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూనే ఉంది.

పాక్ పై ప్రతీకార దాడులు, మన మహిళల పసుపు కుంకుమలను కాలరాసిన ఉగ్రవాదులను అంతం చేయాలన్న పట్టుదల, దేశ భక్తి, దేశాభిమానం, జాతీయత, ఐక్యత, జరుగుతున్న దాడులు వంటి అనేక అంశాలు మరికొన్ని ప్రశ్నలను మరుగున పడేస్తున్నాయి. సందర్భం కాకపోవడంతోపాటు జాతి మొత్తం ఏకతాటిపై ఉండాల్సిన ఈ సమయంలో మనల్ని మనమే ప్రశ్నించుకోవడమేంటి? మంచో చెడో మనమంతా మన దేశం కోసం నిలవాల్సిన తరుణం ఇది. ఈ దశలో మరుగున పడుతున్న కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం.

పహల్గాం ఘటన మన ఇంటలీజెన్స్ వైఫల్యాన్ని తేటతెల్లం చేసింది. 370 ఆర్టికల్ రద్దు తర్వాత కశ్మీర్ లాంటి సున్నిత ప్రాంతంలో అంత స్వేచ్ఛాయుతంగా ఎందుకు వదిలేశారు? యధేచ్చగా ఉగ్రవాదులు దేశంలోకి జొరబడుతుంటే ఇంటలీజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఇప్పుడు చెప్పుకుంటున్న ఈ అధునాతన ఆయుధ, కమ్యూనికేషన్, సాంకేతిక వ్యవస్థ అప్పుడు ఎందుకు పని చేయలేదు? పహల్గాం ఘటనను ముందే పసిగట్టలేకపోవడం అటుంచితే, ఘటన జరిగిన కొద్దిసేపటికే అక్కడకు చేరిన మన భద్రతాదళాలు ఆ నలుగురు ఉగ్రవాదులను పట్టుకోలేకపోయాయి? అంతెందుకు ఆ ఉగ్రవాదులు దేశం విడిచిపోయే పరిస్థితి వరకు ఏం చేసినట్లు?

ఇక ఘటన జరిగిన తర్వాత 9 ఉగ్రవాద స్థావరాల్లో జరిపిన దాడుల్లో 100 మంది వరకు ఉగ్రవాదులు హతమయ్యారని మనం చెప్పుకుంటున్నాం. సరే, ఆ చనిపోయిన 100 మంది ఉగ్రవాదుల్లో పహల్గాం దాడికి బాధ్యులైన నలుగురు ఉన్నట్లా? లేనట్లా? మన ప్రతీకారం మొదటగా పహల్గాం ఘటనకు బాధ్యులైన ఆ నలుగురు ఉగ్రవాదులపై, తర్వాత ఉగ్రవాదంపై లేదా ఉగ్రవాదులపై, ఆ తర్వాత ఆ ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పై. ఇప్పుడు జరిపిన దాడులు, తర్వాత పరిణామాలు మన మొదటి టార్గెట్ ని మిస్సైనట్లుగా అనిపిస్తున్నది. పోనీ, ఉగ్రవాదులు చనిపోయినప్పటికీ, ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాక్ ను కట్టడి చేయడానికి చేసిన దాడుల్లో పాక్ ఏమైనా పరివర్తనను పొందిందా? అంటే అదీ లేదు. యుఎస్ జోక్యం కోసం కాళ్ళు పట్టుకున్న పాకిస్తాన్, కాల్పుల విరమణ ప్రకటించిన మరు క్షణం నుంచే తిరిగి భారత్ పై డ్రోన్ తదితర దాడులకు పాల్పడుతున్నది. అంటే ఇంత జరిగినా పాక్ లో మార్పులేదు. పాకిస్తాన్ మారలేదు. సరికదా, అదే తెగబాటు వ్యక్తమవుతున్నది. స్పష్టంగా కనిపిస్తున్నది.

అంతర్జాతీయ ఉగ్రవాదుల తయారీ కేంద్రంగా మారిన పాక్ లో ఏ మార్పూ లేనప్పుడు, రానప్పుడు దానికి తగిన గుణపాఠం చెప్పితీరాలన్నదే ప్రస్తుతం సగటు భారతీయుడి ఆవేదన. కానీ, యుద్ధ రీతి, నీతి, అంతర్జాతీయ నిబంధనలు, నియమాలు, ఒత్తిడిలు, అవసరాలు, మర్యాదలు… ఇలా అనేక అంశాలపై ముడిపడి అంతర్జాతీయ సంబంధాలు ఆధారపడి ఉంటాయి. ఆ రకమైన కాల్పుల విరమణపై సగటు భారతీయుడికి ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, భారత్ నుండి పాక్ విడి వడినప్పటి నుండీ ముడి వీడని పాక్ ఆక్రమిత కశ్మీర్ సమస్యకు పరిష్కారమే లేకపోవడంపై భారత పౌరుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. పీఓకే కారణంగా అశాంతి, అల్లర్లు, ఉగ్రవాదం, మానవ హోమం కేవలం భారత్, పాక్ విభజన రేఖ వెంటే గాక, భారత దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు దారి తీస్తున్నది. ఇప్పటిలాగే, గతంలోనూ చేతికి అందివచ్చిన అవకాశాలు చే జారిపోతున్నాయి. తరతరాలుగా ఇది ఇంకెంత కాలం?

ఇది మన సైన్యానికి మద్దతుగా నిలవాల్సిన సమయం. ఆరోపణలు, విమర్శల సందర్భం కాదు కానీ, ఇటు భారత, అటు పాకిస్తాన్ రాజకీయ వ్యవస్థపై ప్రజలకు నమ్మకం, అపనమ్మకాలకంటే కూడా అనుమానాలెక్కువగా ఉన్నాయి. ఈ రెండు దేశాల రాజకీయ వ్యవస్థలకు ఓట్లు కురిపించే కల్పతరువుగా పీఓకేకు ముద్ర పడింది. దేశభక్తి, జాతీయత, ఐక్యత, భావోధ్వేగాలతో కూడిన ఈ సున్నిత సమస్య కాస్త రెచ్చితే చాలు ఆ సాకుతో ప్రజల ఓట్లు అనుకూలంగా రాలుతాయని రాజకీయ పార్టీల, ప్రజలకు కూడా ఏర్పడిన నమ్మిక. అందుకని పీఓకే సమస్యను పరిష్కరించడానికి ఇరు దేశాల్లో రాజకీయపార్టీలకు అస్సలు ఇష్టం ఉండదని ప్రజల్లో బహిరంగంగానే చర్చ జరుగుతున్నది. నిజానికి రాజకీయ పార్టీల, నాయకుల ఆరోపణలను ప్రజలు సీరియస్ గా తీసుకోవడం లేదు. కాబట్టి ఇప్పుడు పట్టించుకోవాల్సింది పార్టీల ఆరోపణలను కాదు. ప్రజల అనుమానాలను. వాటిని నివృత్తి చేయడం ఎలా? అన్నదానిపై దృష్టి సారించాలి. ఆ విధంగా ఏలుబడిలో ఉన్న ప్రభుత్వాలు, పార్టీలు తమ నిజాయితీని నిరూపించుకోవాలి.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News