Wednesday, July 29, 2026
23.1 C
Hyderabad

ఉగ్రవాదంపై ఉక్కుపాదం!

2008 ముంబై దాడులు మిగిల్చిన విషాదాల గాయాలింకా మానలేదు. అయితే ఆ కుట్రల వెనక ఎవరెవరు ఉన్నారన్నది కూడా ఇంకా తేలలేదు. ముంబై దాడులు సహా, అనేక ఉగ్రవాద దాడులు, కుట్రల్లో పాక్ ప్రమేయం ఉన్నట్లు భారత్‌ అనేక ఆధారాలు సేకరిస్తూనే ఉంది. కానీ, పాక్‌ తోసిపుచ్చుతూనే ఉంది. ప్రపంచం ముందు పాక్‌ను దోషిగా నిలబెట్టడంలో భారత్‌ విజయం సాధించింది. కసబ్‌ తదితరులను ఉరితీత తర్వాత కూడా పాక్‌ ఉగ్రవాదాన్ని ఎప్పటికప్పుడు ప్రపంచ వేదికలపై భారత్‌ ఎండగడుతూనే ఉంది. పాక్‌కు గట్టిగా బుద్ది చెప్పేలా చర్యలు తీసుకునేందుకు కూడా వెనకాడడం లేదు. గతంలో పాలకులు పాక్‌ పట్ల ఉదాసీనంగా నిర్లిప్తంగా వ్యవహరించారు. పాక్‌తో యుద్ధం, బంగ్లాదేశ్‌ విముక్తి తదితర సందర్భాల్లో పాక్‌ను పూర్తిగా కట్టడి చేసి ఉంటే ఇవాళ ఈ దుర్గతి పట్టేది కాదు.
తాజాగా ఇప్పుడు తహవ్వుర్‌ రాణాను ఇండియాకు రప్పించడంలో సఫలం అయినట్లే, ఇదే సందర్బంలో రాణా నుంచి వివరాలు సేకరిస్తే..ముంబై దాడుల వెనక కుట్రలను ఛేదించగలం. రాణా అంత సులువుగా బయటపడతాడని అనుకోవడానికి లేదు. భారత్‌ పట్ల నరనరాన వ్యతిరేకతను నింపుకున్న రాణా ముంబై దాడుల కోసం ఎంతగా తెగించాడన్నది ప్రపంచ దేశాలతో పాటు పాక్‌కు కూడా అర్థం అయివుంటుంది. ముంబై దాడుల వెనక ఉగ్రవాదులుగా మారిన ఇద్దరు స్కూల్‌ ఫ్రెండ్స్‌ మాస్టర్‌ మైండ్స్ గా వ్యవహరించారు. 166 మంది ప్రాణాలు పొట్టన పెట్టుకొన్నారు. అమెరికా చట్టాల్లోని లొసుగుల్ని వాడుకొని భారత్‌కు దొరక్కుండా తప్పించుకోవాలని విశ్వప్రయత్నం చేశారు. చివరికి ఆ ఇద్దరిలో ఒకరిని మన జాతీయ దర్యాప్తు సంస్థ భారత్‌కు తీసుకొచ్చింది. మరొకరు అమెరికా జైల్లోనే ఉన్నాడు. ఆ ఇద్దరే తహవ్వుర్‌ రాణా, డేవిడ్‌ కోల్‌మన్‌ హెడ్లీ. వీరిద్దరి వయస్సు 64 ఏళ్లు. వీరిని ముంబై దాడుల కుట్రదారులుగా గుర్తించడంలో ఎన్‌ఐఎ తీవ్రంగా కృషి చేసింది. ఈ ఇద్దరూ పాక్‌లోని హసన్‌ అబ్దుల్‌లోని సైనిక అకాడవిూ అయిన క్యాడెట్‌ కాలేజ్‌ (సీసీహెచ్‌)లో చదువుకున్నప్పటి నుంచి మిత్రులు. ఆ తర్వాత ఇద్దరూ ఉగ్రవాదులు గా మారడం విచిత్రం. డేవిడ్‌ హెడ్లీ పాకిస్థానీ దౌత్యవేత్త, బ్రాడ్‌కాస్టర్‌ అయిన దావూద్‌ సయ్యద్‌ గిలానీ, ఓ అమెరికా జాతీయురాలికి పుట్టాడు. ఆ తర్వాత గిలానీ కుటుంబం పాక్‌కు వలస వెళ్లింది. అక్కడే హెడ్లీ సీసీహెచ్‌లో చేరాడు. ఇక తహవ్వుర్‌ రాణా 1961లో ఓ హైస్కూల్‌ ప్రిన్సిపల్‌ కుటుంబంలో జన్మించాడు. ఇతడూ సీసీహెచ్‌లోనే చేరాడు. అక్కడే తొలిసారి హెడ్లీ-రాణా మిత్రులుగా మారారు. అక్కడి నుంచే వారి ఉగ్రరచనలకు బీజం పడిందని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో హెడ్లీ తల్లితో కలిసి అమెరికాలోని ఫిలడెల్ఫియాకు వెళ్లిపోయాడు. అక్కడ అతడు మాదక ద్రవ్యాల వ్యాపారంతోపాటు, కీలక సమాచారాన్ని ఏజెన్సీలకు విక్రయించేవాడు. పాక్‌లో లష్కరే, సైన్యానికి, ఇటు- అమెరికాలోని సీఐఏకు ఇన్ఫర్మేషన్‌ చేరవేసేవాడు. మరోవైపు రాణా పాక్‌ ఆర్మీ మెడికల్‌ కోర్‌లో కెప్టెన్‌ హోదాలో పని చేశాడు. 1997లో ఆర్మీని వదిలేసి.. భార్యతో కలిసి కెనడాకు వలస వెళ్లి, 2001 నాటికి పౌరసత్వం సంపాదించాడు. టొరెంటోలో ‘ఫస్ట్‌ వరల్డ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీస్‌’ పేరిట ఓ సంస్థను స్థాపించాడు. ఆ తర్వాత దాని కార్యాలయాలను చికాగో, న్యూయార్క్ ల్లోనూ తెరిచాడు. ఈ కంపెనీ ముసుగులోనే అతడు ముంబై దాడులకు కుట్రను అమలు చేశాడని బహిర్గతం అయింది.
2006 నుంచి ముంబై దాడులకు కుట్ర రచన మొదలైంది. ఇదంతా ఎన్‌ఐఎ సేకరించగలిగింది. అదే ఏడాది హెడ్లీ తొలిసారి ముంబైని సందర్శించాడు. అప్పుడు ‘మెస్సర్స్‌ ఇమిగ్రేషన్‌ లా సెంటర్‌’ పేరిట ఓ కార్యాలయం ఏర్పాటుకు ఆర్‌బీఐకి పత్రాలు సమర్పించాడు. వీటిపై రేమాండ్‌ జోసెఫ్‌ శాండర్స్‌ అనే వ్యక్తి సంతకాలున్నాయి. ఇది రాణాకు చెందిన ‘ఫస్ట్‌ వరల్డ్‌ ఇమిగ్రేషన్‌’కు అనుబంధంగా పనిచేసింది. ఇందుకోసం టార్డియో ఏసీ మార్కెట్‌లో ఆఫీస్‌ స్పేస్‌ తీసుకొన్నాడు. భారత్‌ వచ్చినప్పుడు దానిని స్థావరంగా వాడుకున్నాడు. ముంబైలో మొత్తం ఎనిమిది సార్లు పర్యటించి రెక్కీలు నిర్వహించాడని ఎన్‌ఐఎ పసిగట్టింది. దాడులకు రెండు వారాల ముందు రాణా స్వయంగా భారత్‌కు వచ్చాడు. అతడు ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ పొవాయ్‌లో దాదాపు 10 రోజుల పాటు తిష్ఠ వేసి కుట్రలు పన్నాడు. డేవిడ్‌ హెడ్లీకి అవసరమైన వీసాను రాణానే ఇప్పించినట్లు జాతీయ దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఇందుకోసం అతడి పేరు, తండ్రి వివరాలను తప్పుగా చూపించారు. ముంబైలో తన ఎనిమిది రెక్కీల సందర్భంగా హెడ్లీ నిరంతరం రాణాతో టచ్‌లో ఉన్నాడు. ఇందుకోసం 231 ఫోన్‌కాల్స్‌ చేశాడని ఎన్‌ఐఎ గుర్తించింది. అతడు చేసిన సాయానికి ప్రతిగా..పాక్‌ ఐఎస్‌ఐ అధికారులతో మాట్లాడి ఓ డీల్‌ కుదిర్చాడు. రాణా పాకిస్థాన్‌ను సందర్శించడానికి వీలుగా అతడికి మేజర్‌ ఇక్బాల్‌ను పరిచయం చేశాడు. ఆ మేజర్‌ రాణాతో మాట్లాడినట్లు తేలింది. భారత్‌లో ఉన్నప్పుడు నేరుగా పాక్‌కు కాల్స్‌ చేయోద్దని హెడ్లీకి స్పష్టమైన ఆదేశాలున్నాయి. ముంబై దాడుల తర్వాత కూడా హెడ్లీ-రాణా టచ్‌లో ఉన్నారు. ఇక విజయవంతంగా ముంబైలో మారణ హోమం సృష్టించి నందుకు ఉగ్రవాది లష్కరే సాజిద్‌ను రాణా అభినందించాడు. ఈ దాడిలో మరణించిన ఉగ్రవాదులకు పాక్‌ అత్యున్నత పురస్కారం ‘నిషాన్‌ ఈ హైదర్‌’ ఇవ్వాలని హెడ్లీ వద్ద రాణా వ్యాఖ్యానించాడు. భారతీయులకు అలా జరగాల్సిందేనని కూడా వ్యాఖ్యానించాడు. 2009 అక్టోబర్‌ 3న చికాగో అంతర్జాతీయ విమానాశ్రయంలో హెడ్లీని ఎఫ్‌బీఐ అరెస్టు చేయడంతో ఇద్దరి స్నేహం ముగిసింది.
హెడ్లీ సీఐఏకు పని చేస్తున్నా.. తరచూ పాక్‌కు వెళ్లి రావడంపై అమెరికా నిఘా సంస్థ కన్నేసింది. డెన్మార్క్ లోని కోపన్‌హెగన్‌లో ఉగ్రదాడికి కుట్ర పన్నుతున్నట్లు అతడిపై అనుమానాలు ఉన్నాయి. అప్పటికే హెడ్లీని తమకు అప్పగించాలని భారత్‌ అమెరికాను కోరుతోంది. ఆ తర్వాత కొన్ని నెలలకే రాణాను కూడా డెన్మార్క్‌ కుట్ర కేసులో అరెస్టు చేశారు. ఈ నేరం నిరూపితమైనా.. భారత్‌లో ముంబై దాడుల కుట్ర అభియోగాలు మాత్రం వీగిపోయాయి. ఈ విచారణ సందర్భంగా తనను హెడ్లీ ఇందులోకి లాగాడని రాణా చెప్పాడు. డెన్మార్క్‌ కుట్ర కేసులో రాణాకు వ్యతిరేకంగా హెడ్లీ కూడా సాక్ష్యం చెప్పడంతో ఈ కేసులో రాణాకు 14 ఏళ్ల జైలు శిక్ష పడింది. అతడు 2020 కొవిడ్‌ సమయంలో విడుదలయ్యాడు. ఆ మర్నాడే అతడిని అరెస్టు చేయడానికి ‘పరస్పర నేరగాళ్ల అప్పగింత ఒప్పందం’ మేరకు భారత్, అమెరికా వారెంటు కోరింది. దాదాపు ఐదేళ్లపాటు వివిధ దశల్లో జరిపిన న్యాయపోరాటం తర్వాత అతడు విచారణను ఎదుర్కోవడానికి భారత్‌కు తీసుకొచ్చారు.
మొత్తంగా ఎన్‌ఐఎ చేసిన కృషి సాహససోపేత మైనదని చెప్పాలి. ఇది ఓ రకంగా అంతర్జాతీయంగా భారత్‌ ప్రతిష్టను పెంచేదే. రాణా నోరు విప్పితేనే విషయాలు, వివరాలు బయటకు వస్తాయి. అప్పుడే భారత్ కు అసలైన విజయం దక్కుతుంది.

Latest News

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

ప్రకృతి వింత: నడిచే అడవి రహస్యం తెలుసా?|NATURE|FOREST

ప్రకృతి సృష్టించే వింతలు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అడవి అనగానే ఒకే చోట స్థిరంగా ఉండే వృక్షాలు గుర్తుకొస్తాయి. కానీ, చెట్లు ఒక చోటు నుండి మరొక చోటుకి నెమ్మదిగా నడుస్తూ కదులుతాయనే...

జూలై 27, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి త్రయోదశి మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం మూల ఉదయం 11.00 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం వైధృతి రాత్రి 12.18 వరకు ఉపరి విస్కమ్బ కరణం తైతుల మధ్యాహ్నం 03.35 వరకు ఉపరి...

భరించేదే భార్య పో!?|ADUGU TRENDS

‘భరించేటోడే భర్త అన్నరు!’. ‘నిజానికి భరించేదే భార్య!!’ అనే గా సామెతకు గీమె సరిగ్గా సరిపోతది. పెనిమిటిని 180 కిలోమీటర్లు భుజానేసుకుని నడిశిన పెండ్లాన్ని మనమెక్కడైనా సూసినమా? కావాల్నంటే మీరే సూడుండ్రి. గీమె పేరు...

‘బొద్దింక’లు హిట్టా? ఫట్టా!?|EDITORIAL

విద్యార్థుల చదువు, పరీక్షలు, భవిష్యత్తుతో కూడిన అంశాలపై విశేష మద్దతు లభించడం సహజం. ఏ రాజకీయ పార్టీ అయినా ఉద్యమానికి మద్దతు పలకడం వేరు, ఆ ఉద్యమాన్నే హైజాక్ చేయడం వేరు. అలాగే...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 26 నుండి ఆగష్టు 01 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం చేపట్టిన పనులు క్రమంగా విజయవంతంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News