సైబర్ నేరం ప్రస్తుతం అతిపెద్ద ప్రమాదం
షీల్డ్ – 2025 లో సీఎం రేవంత్ రెడ్డి
నేరాల విధానం చాలా వేగంగా మారుతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ వేదికగా జరుగుతున్న సైబర్ సెక్యూరిటీ సదస్సు (షీల్డ్ – 2025) లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….. ప్రస్తుత సమాజంలో ఫేక్ న్యూస్ తో ప్రమాదం వుందని, వాటిని ప్రజలు నమ్మకుండా చైతన్యం తీసుకురావాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. అలాగే ఒకప్పుడు దేశం లో మర్డర్ ,దోపిడీ లు తీవ్ర నేరాలు గా వుండేవి కానీ ఇప్పుడు అత్యంత పెద్ద నేరం సైబర్ నేరం అని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ అధికారులు సంయుక్తంగా నిరంతర కృషి తో తెలంగాణ లో సైబర్ నేరాలు కట్టడి చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ను సైబర్ సేఫ్టీ రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు.దేశంలో, రాష్ట్రంలో ప్రతి సెకండ్ సైబర్ నేరాల జరుగుతున్నాయన్నారు. నేరం జరిగిన తరువాత పోలీసులు పట్టుకునేవారు కానీ ఇప్పుడు నేరం జరగకుండా పోలీసులు నిరోధించాలని సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం, అనేక రాష్ట్రాలు మొత్తం ఒక తాటీ పైకి వచ్చి సైబర్ క్రైంపై పోరాడాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియా కూడా చిల్లరగా మారిందని దానిని కంట్రోల్ చేసే బాధ్యత తీసుకోవాలన్నారు. ఇలాంటివి సమాజానికి శ్రేయస్కరం కాదన్నారు. ఇలాంటి వాటిపై ప్రజలు, యువత అందరం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు.

