శంషాబాద్ విమానాశ్రయంలో భారీ ప్రమాదం తప్పింది. చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన బ్లూడార్ట్ కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య రావడంతో రన్‌వేపై అత్యవసర ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. దాంతో అధికారులు అనుమతి ఇవ్వడంతో అంతర్జాతీయ విమానాలన్నీ ఆపి సురక్షితంగా గా కార్గో ఫ్లైట్ ల్యాండింగ్ అయ్యింది. ల్యాండింగ్ సమయంలో కార్గో విమానం లో 5 మంది సిబ్బంది వున్నట్లు సమాచారం.

