ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ మెగా అభిమానులకు క్షమాపణలు తెలిపారు. ఇటీవల ఓ ఈవెంట్‌లో రామ్ చరణ్ స్థాయిని తగ్గించినట్లు అనిపించే వ్యాఖ్యలు చేయడంతో అభిమానులు అసహనానికి గురయ్యారు. ఈ వివాదంపై స్పందించిన అల్లు అరవింద్, తాను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. దిల్ రాజు పరిస్థితిని వివరించే సందర్భంలో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు. తన మాటల వల్ల మెగా అభిమానులకు బాధ కలిగితే క్షమించాలంటూ అభిప్రాయపడ్డారు. రామ్ చరణ్ గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన వ్యక్తి అని, తన మాటల వల్ల ఎవరూ అపార్థం చేసుకోవద్దని కోరారు.

