హైదరాబాద్‌లో అరెస్ట్
సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్స్ పరిసరాల్లో ఇన్నోవా కారులో గంజాయి తరలిస్తున్న ఇద్దరు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును తనిఖీ చేయగా, 10 కిలోల గంజాయి లభించింది. విచారణలో నిందితులు హైదరాబాద్‌లోని ప్రముఖ ఐటీ కంపెనీలో ఉద్యోగులని గుర్తించారు. వారిలో ఒకరు ప్రవీణ్ వర్మగా నిర్ధారణ అయ్యింది. జల్సాలకు అలవాటు పడి, జీతంతో సరిపెట్టుకోలేక గంజాయి అక్రమ రవాణాకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి తెచ్చి నగరంలో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. నిందితుల వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ఇన్నోవా కారు స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

