మేడారం సమ్మక్క- సారలమ్మ దర్శనానికి బుధవారం భక్తులు భారీగా తరలి వస్తున్నారు. మినీ మేడారం జాతరకు ఇంకా ఏడు రోజుల సమయం ఉండడంతో ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. భక్తులు భారీగా తరలి రావడంతో సమ్మక్క- సారలమ్మ గద్దెలు భక్తులతో నిండిపోయాయి. జంపన్న వాగు పరిసర ప్రాంతాలు కిటకిటలాడుతున్నాయి.

